అన్వేషించండి

Dharmasthala : ధర్మస్థల రహస్యాలు - మంజునాథ స్వామి ఆలయం వెనుక దాగిఉన్న అద్భుతాలు, దర్శన సమయాలు!

Dharmasthala Temple: ధర్మస్థల అంటే ధర్మస్థలం అని అర్థం. ఇక్కడ కొలువయ్యాడు శ్రీ మంజునాథుడు. శివుడి అవతారాల్లో ఒకటైన మంజునాథుడి ఆలయం విశిష్టత, ప్రత్యేకతలు మీకు తెలుసా..

Sri Kshetra Dharmasthala Manjunatha Swamy Temple:  కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం 800 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దీనిని జైనులు నిర్వహిస్తారు, పూజలు మధ్వ వైష్ణవులు చేస్తారు. 

దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలో మల్లార్మడి అనే గ్రామంలో ఉన్న ఈ ప్రదేశాన్ని పురాణాల ప్రకారం కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నెల్లియడి బీడు అనే ఇంట్లో, జైన అధిపతి శ్రీ బిర్మన్న పెర్గాడే  కుటుంబం నివసించేవారు. ఓ రోజు కొంతమంది సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని నిరంతరం ఆచరించడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని అడిగారు. వారి అభ్యర్థన విని ఆశ్చర్యపోయిన ఆ జంట.. సందర్శకులను ప్రత్యేకంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. ఆ రోజు రాత్రి భగవంతుడు వారి కలలో కనిపించి ఈ ఇంటిని ధర్మపూజలకోసం అంకితం చేయాలని అడిగాడట. జైన దంపతులు ఆ కలను అనుసరించి తమ నివాసాన్ని ఇచ్చేసి మరోఇల్లు నిర్మించుకునేందుకు వెళ్లిపోయారు. 

పూజలకు అంకితం చేసిన ఆ ఇంట్లో నివసించిన జైన దంపతులకు మరో బాధ్యత అప్పగించారు ధర్మ దేవతలు.  శ్రీ కాళ రాహువు, శ్రీ కాలర్కాయి, శ్రీ కుమార స్వామి,  శ్రీ కన్యా కుమారి లకు నాలుగు ప్రత్యేక మందిరాలను ప్రాంగణం లోపల నిర్మించాలని ఆదేశించారు. ఆ మందిరాల నిర్మాణం తర్వాత బ్రాహ్మణులను పూజలు చేసేందుకు ఆహ్వానించారు జైన దంపతులు. ఈ విగ్రహాలతో పాటూ ఓ శివలింగాన్ని కూడా ప్రతిష్టిస్తే పూజలు నిర్వహిస్తామని ఆ బ్రాహ్మణులు చెప్పారు. దీంతో మంగళూరు సమీపంలో కద్రి మంజునాథ స్వామి ఆలయం నుంచి ఓ శివలింగాన్ని తీసుకొచ్చేందుకు  అన్నప్ప స్వామి అనే వ్యక్తిని నియమించారు. ధర్మస్థల ఆలయం మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయం నుంచి కిలోమీటరన్నద దూరంలో ఈ అన్నప్ప స్వామి మందిరం కూడా దర్శించుకోవచ్చు. గణేషుడి మందిరం కూడా ఉంటుంది ఇక్కడ. ఆ జైన కుటుంబ వారసుడిని వివాదాల పరిష్కారం కోసం ధర్మ అధికారిగా గౌరవిస్తారిక్కడ.  

శ్రీ మంజునాథ స్వామి దర్శన సమయాలు

శ్రీ మంజునాథ స్వామి ఆలయం వేకువజామున 4 గంటలకు తెరుచుకుంటుంది. 

శుద్ధి తర్వాత ఉదయం ఆరున్నర నుంచి 11 వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 

ఉదయం 11.30 గంటలకు శివుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నదానం ప్రారంభవుతుంది.  

మధ్యాహ్నం 12 గంటలకు మాహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఈ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు.

ఈ ప్రదక్షిణలు పూర్తయ్యాక మళ్లీ  2 గంటల 15 నిముషాల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

సాయంత్రం 5 గంటలకు తిరిచి రాత్రి 8 గంటల 30 నిముషాల వరకూ దర్శనాలు కొనసాగుతాయి. 8.30 కి మహాపూజ జరుగుతుంది. 

శ్రీ మంజునాథ స్వామి ప్రత్యేక రోజులు
 
వినాయకచవితి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఆరాధన ఉంటుంది

కార్తీకమాసం,మహాశివరాత్రి సమయంలోనూ ఆలయం భక్తులతో నిండిపోతుంది

ఉగాది ఉత్సవాలు  వైభవంగా జరుగుతాయి ఇక్కడ

వార్షిక జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుగుతుంది

ధర్మస్థల ఎలా చేరుకోవాలి?

మంగళూరు వరకు వెళితే అక్కడి నుంచి బస్సులు లేదా టాక్సీల్లో ధర్మస్థల చేరుకోవచ్చు. ఇక్కడ వసతిని ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు, అక్కడకు వెళ్లాక కూడా దొరుకుతాయి.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, పుస్తకాల్లో పొందుపరిచిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని పరిగణలోకి తీసకునేముందు సంబంధిత నిపుణుల సలహాలు స్వీకరించండి.. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

18-10-2026 ఆదివారం ధనస్సు, మకర, కుంభ, మీన రాశులకు శుభ ఫలితాలు!
18-10-2026 ఆదివారం ధనస్సు, మకర, కుంభ, మీన రాశులకు శుభ ఫలితాలు!
18-10-2026 ఆదివారం సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశులవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
18-10-2026 ఆదివారం సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశులవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
18-10-2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఎలా ఉందంటే?
18-10-2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఎలా ఉందంటే?
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget