News
News
X

TTD New Rule For NRIs : ఇకపై ప్రవాస భారతీయులకు కొండపైనే దర్శన టోకెన్లు - ఈ పత్రాలు ఉంటే చాలు !

ప్రవాస భారతీయులకు సులువుగా దర్శనం టిక్కెట్లు ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

FOLLOW US: 
Share:

TTD New Rule For NRIs :   దేవ దేవుడ్ని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వస్తున్న వారి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.  కోవిడ్ తరువాత ఎటువంటి ఆంక్షలు లేకుండా తిరుమలకు అనుమతిస్తున్న క్రమంలో ఏడుకొండలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి..‌ గత రెండేళ్ళుగా స్వామి వారిని దర్శించుకోలేని భక్తులు ఒక్కసారిగా తిరుమలకు చేరుకోవడంతో సప్తగిరుల్లో సందడి వాతావరణం నెలకొంది.. అయితే సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టిటిడి తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల వద్ద నుండి విశేష స్పందన వస్తొంది. గత రెండు సంవత్సరాలుగా రద్దు చేసిన ఎన్నారై దర్శనాలను తిరిగి ప్రారంబిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.‌ దీంతో ప్రవాస భారతీయులకు టిటిడి తీపి కబురు తెలిపినట్లు అయ్యింది.

తెలంగాణలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమల వెళ్లొచ్చినంత ఫలితం!

ప్రవాస భారతీయులకు స్వామి వారి దర్శన భాగ్యం విషయంలో టిటిడి కొన్ని వెలుసుబాటు కల్పించిన క్రమంలో ఇకపై గతంలో మాదిరిగానే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద గల ప్రత్యేక ప్రవేశ మార్గం వద్ద ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను తిరిగి ప్రారంబిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రవాసాంధ్ర 90 రోజుల వ్యవధిలో తమ పాస్ పోర్టును చూపించి‌ దర్శన భాగ్యం పొందే వెసులు బాటు కల్పించింది టిటిడి..వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ప్రత్యేక ప్రవేశ మార్గంలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రవాస భారతీయులు ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు పొందవచ్చు.

వ్యవసాయం ఓ యజ్ఞం,ఏరువాక పౌర్ణమికి పురాణాల్లోనూ ఎంతో ప్రాధాన్యం

మరో వైపు తిరుమల రాలేని అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుల కోసం   అమెరికాలోని 7 ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. అవి శనివారం నుంచే ప్రారంభమవుతున్నాయి.  టీటీడీ ఆధ్వర్యంలో  జులై 3 వరకు ప్రధాన నగరాల్లో వీటిని నిర్వ హిస్తున్నారు.  జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డీసీ, 9న అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయి. 

అమెరికాలో ఉండే భక్తులు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉండే హిందువులు, తెలుగు భక్తుల కోసం ఏపీ ఎన్నార్టీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  తమ దేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని యూకే, దుబాయ్, కెనడా వంటి దేశాల్లో ఉన్న భక్తుల నుంచి కూడా వినతులు అందుతున్నాయని, వీటిపై పరిశీలన జరుపుతున్నామని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. 

Published at : 17 Jun 2022 07:40 PM (IST) Tags: ttd tickets for expatriate Indians Srivari Darshan tickets for NRIs

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్