![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Eruvaka Pournami 2022: వ్యవసాయం ఓ యజ్ఞం,ఏరువాక పౌర్ణమికి పురాణాల్లోనూ ఎంతో ప్రాధాన్యం
Eruvaka Pournami 2022: వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం వేదకాలం నుంచి వస్తోన్న ఆచారం. జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం..దీని ప్రత్యేకత ఏంటంటే...
![Eruvaka Pournami 2022: వ్యవసాయం ఓ యజ్ఞం,ఏరువాక పౌర్ణమికి పురాణాల్లోనూ ఎంతో ప్రాధాన్యం Eruvaka Pournami 2022, Significance and importance of Eruvaka Purnima, know in details Eruvaka Pournami 2022: వ్యవసాయం ఓ యజ్ఞం,ఏరువాక పౌర్ణమికి పురాణాల్లోనూ ఎంతో ప్రాధాన్యం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/5a98223b7bbe73676d9cbaed499da9ff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈ రోజే ఏరువాక పౌర్ణమి (Eruvaka Pournami 2022)
పురాణాల్లో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం
పురాణాల్లో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే ఈ రోజే రైతులు భూమిపూజ చేసి వ్యవసాయ పనులు ఆరంభిస్తారు. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం..అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు..ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ధనలాభం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
సస్యానికి అధిపతి చంద్రుడు
పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని 'ఏరువాక' అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు. ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం సెంటిమెంట్.
Also Read: ఈ రోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఈ పరిహారాలు పాటిస్తే సిరిసంపదలకు లోటుండదు
రకరకాల పేర్లు
ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు.వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. అధర్వణవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం ఏరువాకను సీతాయజ్ఞంగా వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం.
'వప్ప మంగళ దివసం'
'బీజవాపన మంగళ దివసం'
'వాహణ పుణ్ణాహ మంగళమ్'
'కర్షణ పుణ్యాహ మంగళమ్..'
అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు..
Also Read: ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)