News
News
X

Jyeshtha Purnima 2022: ఈ రోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఈ పరిహారాలు పాటిస్తే సిరిసంపదలకు లోటుండదు

జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది జూన్ 14 మంగళవారం వచ్చింది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం అత్యంత శుభకరం. ఇంకా ఏం చేయాలంటే...

FOLLOW US: 
Share:

జ్యేష్ఠ పూర్ణిమ ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకొస్తుందంటారు. ఈ శుభసమయంలో కొన్ని పరిహారాలు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతారు. ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని తరిమేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలంటే ఈ రోజున కొన్ని పరిహారాలు పాటించాలని చెబుతారు.

 • జ్యేష్ఠ పూర్ణిమ రోజు లక్ష్మీదేవిన ఆరాధించాలి, సంద్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఇలాచేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు
 • ఈ రోజున కనకధార స్త్రోత్రం, అష్టలక్ష్మీ స్త్రోత్రం పఠించడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పురాణాలు చెబుతున్నాయి
 • 11 గవ్వలకు పసుపు రాసి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి. అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకాన్ని దిద్ది పూజించాలి. ఆ మరుసటి రోజు వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో లేదా అల్మరాలో ఉంచాలి. ఇలాచేస్తే సంపద వృద్ధి చెందుతుందని విశ్వాసం
 • జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసాన్ని నివేదిస్తే ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయంటారు
 • జ్యేష్ఠ పూర్ణిమ రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణు సహస్రనామం పఠించడం కూడా ప్రయోజనకరం

వట్ పూర్ణిమ వ్రతం
ఇదే రోజుని వట్ పూర్ణిమ వ్రతం చేస్తారు. వివాహిత స్త్రీలు మర్రి చెట్టును పూజించి 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. భర్త దీర్ఘాయువు,  సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించమని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉపవాసాన్ని ఉత్తర భారతదేశంలో వట్ ​​సావిత్రి వ్రతం అంటారు. ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. బెరడులో విష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు. శివుడు కూడా మర్రిచెట్టు కింద ధ్యానం చేశాడని చెబుతారు. ఆయుర్వేదం పరంగా చూస్తే మర్రి చెట్టులో  ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

Also Read: ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

మర్రిచెట్టును పూజిస్తే...

 • వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి
 • ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు.
 • మర్రిచెట్టు కింద హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది
 • శనివారం మర్రి కాండం మీద పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది
 • ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు
 • మర్రి చెట్టుపై తెల్లటి నూలు దారాన్ని 11 సార్లు కట్టి నీరుపోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి

నోట్: పండితుల నుంచి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి ధనలాభం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Also Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి

Published at : 14 Jun 2022 06:56 AM (IST) Tags: Lakshmi sri maha vishnu Jyeshtha Purnima 2022 Vat Purnima Vrat 2022 importance and significance of Vat Purnima Eruvaka Pournami

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు