అన్వేషించండి

Zodiac Sign-Jyotirlinga: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి

ఎవరి జాతకంలో అయినా గ్రహాలు అనుకూలంగా ఉంటే పర్వాలేదు కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రతికూల గ్రహాలు అనుకూలంగా మారాలంటే పరమేశ్వర అనుగ్రహం ఉండాలంటారు పండితులు.

ఓం నమ:శివాయ 

గ్రహాలకు మూలం సూర్యుడు. సూర్యుడికి అధిదేవత ఆ పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడే ఒక్కో గ్రహానికి ఉండే అధిష్టాన దేతలను నియమిస్తాడు. ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరుడి ఆదేశానుసారమే సంచరిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి. అయితే మీ రాశి, మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. మరి ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలో చూడండి..

మేషం
ఈ రాశి వారు పూజించాల్సిన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజుడికి స్వగృహం. వీరికి పదకొండో రాశ్యాధిపతి శని. అందుకే గ్రహపీడా నివారణార్థం శ్రీ రామచంద్రుడు పూజించిన రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచిది. 

శ్లోకం
సుత్రామ పర్ణీ జరరాషి యోగే నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె 
శ్రీరామ చంద్రేన సమర్పితం త రామేశ్వరాఖ్యం నియతం నమామి!!

వృషభం
ఈ రాశివారు పూజించాల్సిన లింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రుడికి స్వగృహం. చంద్రుడు ఉచ్ఛరాశి. అందుకే శ్రీకృష్ణుడు పూజించిన సోమనాథ జ్యోతిర్లింగం దర్శించుకోవాలి. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథుడి సన్నిధిలో రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు.

శ్లోకం
సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం
భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే !!

Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి

మిథునం
ఈ రాశివారు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం’. ఈ రాశి బుధుడికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శనం శుభప్రదం. శని సంచార కాలంలో నాగేశ్వర లింగాన్ని దర్శించుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. 

శ్లోకం
సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే !!

కర్కాటకం
ఈ  రాశివారికి పూజించాల్సిన శివలింగం ఓంకారేశ్వరం.ఈ రాశి చంద్రుడికి స్వగృహం. జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.

శ్లోకం
కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ
సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే !!

సింహం
ఈ రాశి సూర్యుడికి స్వగృహం. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వరం. కింద పేర్కొన్న శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. 

శ్లోకం
ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం
వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే !!

కన్యా 
ఈ రాశివారికి అధిపతి బుధుడు. వీరు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం శ్రీశైలం. అన్ని బాధల నుంచి విముక్తి పొందేందుకు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. 

శ్లోకం
శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం
తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం!!

Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Telangana Congress Bombs : తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desamమహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Telangana Congress Bombs : తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
Rains in AP, Telangana: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
CM Chandrababu: 'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Embed widget