TGSRTC one day Temple Tour Package : ఒకే రోజు 4 పుణ్యక్షేత్రాలు..టికెట్ ధర 800 లోపే..బంపర్ ఆఫర్ మాత్రమే కాదు వీకెండ్ బెస్ట్ ఆప్షన్!
TSRTC Temple Tour Package: ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వేలకు వేలు వెచ్చించవద్దు..ఒక్క రోజులు 4 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది TSRTC. ధర కూడా 800 రూపాయల లోపే ...

TGSRTC one day Temple Tour Package : ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వేలకు వేలు వెచ్చించవద్దు..ఒక్క రోజులు నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది TSRTC. ధర కూడా 800 రూపాయల లోపే ...ఆ డీటేల్స్ తెలుసుకుందాం
వీకెండ్ వచ్చిందంటే చాలు ఆ రెండు రోజుల్లో ఎక్కడికి వెళ్లొచ్చు అనే ప్లాన్ లో ఉంటారు. అయితే ఓ రోజంతా ఎంచక్కా చక్కర్లు కొట్టినా మరోరోజు రెస్ట్ తీసుకునేలా ప్లాన్ చేసుకుంటే.. ఆనందం, విశ్రాంతి రెండూ మీ సొంతం అవుతాయి. ఇలాంటివారికోసం ఈ టూర్ బెస్ట్ ఆప్షన్. ఒక్కరోజులో నాలుగు పుణ్యప్రదేశాలు చూపించడమే కాదు..అత్యంత తక్కువ ధరకు వెళ్లొచ్చేయవచ్చు. ఇందుకోసం వినూత్న ప్యాకేజ్ తీసుకొచ్చారు TSRTC అధికారులు. ప్రైవేట్ వెహికల్స్ తో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతోనే నాలుగు క్షేత్రాలు దర్శించుకనేలా ప్లాన్ చేశారు.
జూన్ 27న...వేములవాడ, కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించారు...దీనికి భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని పుణ్యక్షేత్రాలకు ప్రయోగం చేయాలని ఫిక్సయ్యారు. ఇందులో భాగంగా మరో మూడు రూట్లలో లగ్జరీ, డీలక్స్ బస్సులు నడిపేందుకు నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు.
వీకెండ్, పండుగలు, ప్రత్యేక సెలవు రోజుల్లో టూర్లు తిరిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంతా. వారం మొత్తం విధుల్లో బిజీగా ఉన్నవారంతా వీకెండ్ వచ్చేసరికి సరదాగా టూర్ వెళ్లి వస్తే రిలాక్సైపోతాం అనే ఆలోచనలో ఉంటున్నారు. కొందరు బడ్జెట్ పట్టించుకోకుండా చుట్టేసి వస్తారు, మరికొందరు బడ్జెట్ సమస్యతో ఆగిపోవాల్సి వస్తోంది. ఇలాంటివారిని దృష్టిలోపెట్టుకుని ...మరో మూడు రూట్లలో తక్కువ ధరతో ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రకటించింది TSRTC
1700 రూపాయలకే...
జూలై 5న శోలాపూర్, గంగాపూర్, పండరీపూర్, తుల్జాపూర్, బీదర్ కు బయలుదేరే డీలక్స్ బస్ టికెట్ ధర కేవలం 1700 రూపాయలు మాత్రమే. ఈ 5 ప్రదేశాలు హాయిగా చుట్టేసి వచ్చేయవచ్చు
కేవలం 700 రూపాయలకే...
జులై 5, 12, 19, 26 ఈ నాలుగు తేదీల్లో కేవలం 700 రూపాయలకే ఒక్కరోజులో నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు టీఎశ్ ఆర్టీసీ అధికారులు. అవే... అపురూప వేంకటేశ్వరస్వామి, కొండగట్టు, వేములవాడ, ధర్మపురి...ఈ క్షేత్రాలకు వెళ్లే డీలక్స్ బస్ ధర ఒక్కొక్కరికి 700 రూపాయలు మాత్రమే.
5100 రూపాయలు
ఓ రెండు మూడు రోజులు సమయం వెచ్చించి ఇంకాస్త దూరం వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారికోసం ఈ ప్యాకేజి. కేవలం 5 వేల 100 రూపాయలు చెల్లిస్తే చాలు ... జూలై 8న ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో భాగంగా కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబ ఈ నాలుగు క్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఉంటుంది
ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువ వ్యయంతో పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చే అవకాశం ప్రజలకు కల్పించినట్టు అవుతుంది..అదే సమయంలో ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు ఈ టూర్ ప్యాకేజీలు ఉపయోగపడతాయన్నారు ఆర్టీసీ డీఎం విశ్వనాథ్. ఈ అవకాశాన్ని భక్తులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వీటికి ఆదరణ పెరిగేకొద్దీ మరిన్ని క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేలా ప్లాన్ చేసుకుంటాం అని చెప్పారు.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!
అరుణాచలంలో కనిపించే టోపీ అమ్మ ఎవరు? ఆమెకు శక్తులున్నాయా? ఆమెను ముట్టుకునేందుకు, కాళ్లు మొక్కేందుకు భక్తులు ఎందుకు ఎగబడతారు.. పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















