Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
మే 29 ఆదివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 29- 05 - 2022
వారం: ఆదివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం
తిథి : చతుర్ధశి ఆదివారం మధ్యాహ్నం 2.12 వరకు తదుపరి అమావాస్య
వారం : ఆదివారం
నక్షత్రం: కృత్తిక పూర్తిగా ఉంది
వర్జ్యం : సాయంత్రం 5.28 నుంచి 7.12 వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.42 నుంచి 7.34 వరకు
అమృతఘడియలు : రాత్రి తెల్లవారుజామున 3.52
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:26
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యున్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందడమే కాదు..జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సూర్యారాధన ద్వారా ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం సూర్యుని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
శ్రీ సూర్య స్తోత్రం
ధ్యానం |
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || 1||
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || 2 ||
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || 3 ||
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || 4 ||
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || 5 ||
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || 6 ||
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ]
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ || 7 ||
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || 8 ||
ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ ||
Also Read: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట
Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
Also Read: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం