What a Tiger in a Dream Means: పులి రియల్ గానే కాదు కలలో కనిపించినా ప్రమాదమే.. దేనికి హెచ్చరికో తెలుసా!
Tiger Attack Dream Meaning: కలలు రావడం సర్వసాధారణం. అయితే ప్రతి కలకూ ఓ అర్థం ఉందంటుంది స్వప్నశాస్త్రం..మరి పులి కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?
What a Tiger in a Dream Means: సాధారణంగా పులి కనిపిస్తే భయపడతారు. క్రూర జంతువు కాబట్టి చూడగానే భయం వేస్తుంది. అయితే కలలో కనిపిస్తే.. వెంటాడితే.. తప్పించుకునే అవకాశం కూడా లేకపోతే.. ఇలాంటి కలలు దేనికి సంకేతం? అందులో ఉండే సూచన / హెచ్చరిక ఏంటి? ..స్వప్నశాస్త్రంలో ఏముంది..
కలలో పులి కనిపిస్తే మీ జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్న చింతలకు సూచన. అంటే ఓ అడుగు వెనక్కు వేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మీ సమస్యలను పరిష్కరించడానికి శక్తిని సేకరించడానికి ఈ కల సంకేతం. కలలో పులిని చూడటం అనేది మీ సృజనాత్మక శక్తిని లేదా మీ భావాలను నిర్భయంగా వ్యక్తీకరించడానికి సంకేతం కావచ్చు. పులులు స్వేచ్ఛ , ఏకాంతానికి చిహ్నాలుగా నమ్ముతారు. అంటే మీతో మీరు సమయం గడిపేందుకు, మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకునేందుకు ఈ కల సంకేతం. మీ ముందు సవాళ్లున్నాయి..మీరు కలలో ఉన్నారు.. మారువేషంలో ఉన్న శత్రువులను ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని అర్థం. చాలా సంస్కృతులలో పులులను తెలివైన, ఆధ్యాత్మిక జంతువులుగా చూస్తారు. మీ కలలో పులిని చూడటం వలన మీరు మీ ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తున్నారని మరియు మీ గట్ ఫీలింగ్స్ మీకు మార్గనిర్దేశం చేస్తున్నాయని సూచిస్తుంది.
Also Read: పెళ్లికానివారికి ఈ కల వస్తే త్వరలో ఓ ఇంటివారవుతారని అర్థం!
పులి మిమ్మల్ని వెంబడించడం వల్ల మీ కెరీర్, సంబంధాలు లేదా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హెచ్చరిక కూడా కావచ్చు. అంటే సమస్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని హెచ్చరిక
మీపై పులి దాడిచేసినట్టు కల వస్తే..ఇది మీరు భవిష్యత్ లో కొత్త దశలో అడగుపెట్టబోతున్నారు..సమస్యలు తప్పవంటూ చేసే హెచ్చరిక. మీ జీవితంలో కొత్త దశ అంటే ఉద్యోగం, వ్యాపారం, డేటింగ్, పెళ్లి ఏదైనా కావొచ్చు..
పులి దాడి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుతున్నట్టు కలొస్తే..మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు అర్థం. ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేని పరిస్థితిలో ఉన్నారని సూచన. అధిక ఒత్తిడి నుంచి బయపడమని సంకేతం కూడా..
నిద్రపోతున్న పులి మీ కలలో కనిపిస్తే.. మీలో అణిచివేతకు గురైన ప్రతిభను సూచిస్తుంది. మీరు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని , సృజనాత్మకతలో తిరోగమనంలో ఉన్నట్టు అర్థం. మీ లక్ష్యాలు నిర్ధేశించుకుని అడుగు ముందుకు వేయమని సూచన
Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు
కలలో తెల్ల పులి కనిపిస్తే ఆధ్యాత్మిక మేలుకొలుపు, పరివర్తనానికి సంకేతం. భవిష్యత్ గురించి మరింత స్పష్టత రావాల్సిన టైమ్ ఇది అని సూచన
నల్ల పులి కలలో కనిపించడం మంచి శకునం..మీరు సంపద, శ్రేయస్సు , విజయం పొందుతారని సూచన. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం అని అర్థం
ఎర్ర పులి కలలో కనిపిస్తే మీకు ఎవరైనా ద్రోహం చేయబోతున్నారని అర్థం. పులి పంజా విసిరినట్టు కనిపించినా కానీ.. మీ స్నేహితులు, సన్నిహితులు, సహోద్యోగుల్లో మిమ్మల్ని ముంచేవారున్నారు జాగ్రత్త అని హెచ్చరిక
Also Read: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం
నోట్: స్వప్నశాస్త్రంలో పేర్కొన్న వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది..దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...