అన్వేషించండి

Swapna Shastra: పెళ్లికానివారికి ఈ కల వస్తే త్వరలో ఓ ఇంటివారవుతారని అర్థం!

కలలు మంచి,చెడు ఫలితాలతో పాటూ భవిష్యత్తును సూచిస్తాయి. కలలలో కనిపించే ఈ చిహ్నాల ద్వారా జీవితంలో ఏం జరగబోతోందో ముందుగానే ఊహించవచ్చు. మరి శివుడు కలలో కనిపిస్తే భవిష్యత్ లో ఏం జరగబోతోంది...

Swapna Shastra:  నిద్రలో కలలు కనడం సహజమైన ప్రక్రియ. కలలకు కాళ్లుండవు అన్నట్టు..ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడో పడేస్తాయి. ఇలా జరుగుతుందా అని డౌట్ వచ్చేలాంటి కలలు వస్తుంటాయి. వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి అధీనంలోనూ ఉండదు.  నిద్రపోయేముందు ఏం ఆలోచిస్తామో.. నిద్రలో అదే ఆలోచన కలరూపంలో వస్తుందని కూడా అంటారు. అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం కల. అయితే వచ్చే ప్రతికలకి ఏదో అర్థం ఉంటుంది. మరి మీ కలలో శివుడు పదే పదే కనిపిస్తే మీ భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలుసా...

శివాలయం మెట్లు ఎక్కినట్టు కలొస్తే

కలలో శివాలయం మెట్లు ఎక్కడం మీరు జీవితంలో చాలా శుభసంకేతకంగా భావించాలి. అప్పటి వరకూ ఉన్న అశాంతి తొలగిపోయి మీరు ఆనందం, ప్రశాంతత వైపు పయనిస్తారని అర్థం. మీరు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి..మీరు మంచి రోజులు ప్రారంభమయ్యాయని అర్థం.

కలలో తెల్లని శివలింగం కనిపిస్తే

కలలో తెల్లని శివలింగం కనబడితే...మీ కుటుంబంలో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడితే దాన్నుంచి బయటపడతారని అర్థం. మీ జీవితంలో మంచి జరుగుతుందనేందుకు సూచన.

Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు

శివుడిని పూజించినట్టు కలొస్తే

శివుడిని  పూజించినట్లుగా మీకు కనిపిస్తే సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు. ఇంటా-బయటా ఎదుర్కొంటున్న కొన్ని చికాకులు తొలగిపోతాయి. ఇకపై మీర చేపట్టే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని అర్థం

ఇది అశుభం

శివుని ఉగ్రరూపం కోపాన్ని చూపుతుంది కాబట్టి శివుడు అగ్ని రూపంలో కనిపించినా, ఆగ్రహంతో కనిపించినా ఏదో అశుభం జరగబోతోంది అనేందుకు సంకేతం

పాము కనిపిస్తే

కలలో శివుడు, పాము కలిసి కనిపిస్తే అది శుభ సంకేతం. సంపదకు చిహ్నం. త్వరలో సంపదను పొందుతారని అర్ధం

Also Read: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం

త్రిశూలం-ఢమరుకం కనిపిస్తే

కలలో శివుని త్రిశూలం లేదా డమరుకం చూడటం వల్ల త్వరలో మీరు గుడ్ న్యూస్ వింటారు అనేందుకు సంకేతం. 

మూడో కన్ను తెరిచినట్టు కలవస్తే

కలలో శివుని మూడవ కన్ను చూడటం జీవితంలో గణనీయమైన మార్పుకు సంకేతం. మీరు ప్రారంభించబోయే పని విషయంలో ఆచితూతి అడుగేయాలని, పెద్దల సలహాలు స్వీకరించిన తర్వాతే ఆ పనిని కొనసాగించాలన...అడుగడుగూ జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఇది 

Also Read: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!

పెళ్లికానివారికి ఈ కల వస్తే

కలలో శివ-పార్వతులు కలపి కనిపిస్తే... అవివాహితులకు వివాహం జరుగుతుంది. వివాహితుల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఆర్థికలాభం, కొత్త అవకాశాల వృద్ధికి సూచన ఇది..

ఏ దేవుడు కనిపించినా శుభమే.. 

కలలు వచ్చేవారికి ఎవరికైనా ఎప్పుడోఓసారి దేవుడు తప్పకుండా కలలో కనిపిస్తాడు. ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా కానీ దేవుడు మాత్రం ఏదో సందర్భంలో కలలో తప్పనిసరిగా కనిపిస్తాడు. ఇలాంటి కలవస్తే కెరీర్ పరంగా మీకు మంచి జరగబోతోందని అర్థం. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
Telangana Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Embed widget