Tirumala Brahmotsavam 2025: బ్రహ్మోత్సవ ధ్వజారోహణం రోజున శ్రీవారికి భారీ కానుక- స్వర్ణ యజ్ఞోపవీతం ఇచ్చిన భక్తులు
Tirumala Brahmotsavam 2025: 3.86 కోట్లు విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం ను శ్రీవారికి కానుకగా వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండి దంపతులు అందజేశారు.

Tirumala Brahmotsavam 2025: శ్రీవారికి కానుకలు ఇచ్చేవాళ్లు చాలా మంది ఉంటారు. కొందరు నగదు రూపంలో హుండీలో వేస్తుంటారు. స్వామి వల్ల మేలు జరిగిందని భావించే వాళ్లు ధనవంతులు ప్రత్యేక ఆభరణాలు తయారు చేసి ఇస్తారు. ఇలాంటి భక్తులు ఇవాళ స్వామి వారికి 3.86 కోట్లు విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం కానుకగా అందజేశారు. వైజాగ్‌లోని హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు ఈ భారీ కానుక టీటీడీకి అందజేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం అంకురార్పణ, నేడు ధ్వజస్తంభంలో గరుడ ధ్వజారోహణం వేద మంత్రోచ్చారణల మధ్య, భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగింది. ఈ మహోత్సవం అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి.

ప్రతి ఏటా శరదృతువులో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు, శ్రీవిష్ణువు మూర్తి అయిన శ్రీవెంకటేశ్వరుడు తన భక్తులను ఆశీర్వదించడానికి వచ్చే రథయాత్రలా నిర్వహిస్తారు. భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు, దర్శన టికెట్లు, లైవ్ స్ట్రీమింగ్ వంటి ఆధునిక సౌకర్యాలతో సిద్ధమయ్యారు.ఈ రోజు ధ్వజారోహణం సమయంలో సుమారు 70 వేల మంది భక్తులు దర్శనం పొందారని టీటీడీ అధికారులు తెలిపారు.

ధ్వజారోహణం అంటే ఏమిటిఛ: ఇది బ్రహ్మోత్సవాల మొదటి రోజు ముఖ్య కార్యక్రమం. తిరుమల ఆలయ వద్ద ఉన్న ధ్వజస్తంభంపై, గరుడు(శ్రీమహావిష్ణువు వాహనం) చిత్రం ఉన్న ధ్వజాన్ని ఆరోహించడం. వేదాలు పఠిస్తూ, వాయిద్యాల, భక్తుల హరినామస్మరణ మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది దేవతలు, ఋషులను ఉత్సవానికి ఆహ్వానించినట్లుగా చెబుతారు.

బ్రహ్మోత్సవాలు 9 రోజుల మహోత్సవం. పురాణాల ప్రకారం, శ్రీవెంకటేశ్వరుడు తన భక్తులతో కలిసి తిరుమల రథాలపై పర్యటించడం వల్ల ఈ ఉత్సవం ప్రారంభమైంది. 2025 సంవత్సరంలో, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ ఉత్సవం, ప్రతి రోజు వేర్వేరు వాహనాలపై స్వామి దర్శనం ఇస్తారు. మొదటి రోజు సాయంత్రం పెద్ద సేష వాహనంపై ప్రదక్షిణలు, రెండో రోజు చిన్న సేష వాహనం, మూడో రోజు సింహ వాహనం – ఇలా కొనసాగుతుంది.

ఐదో రోజు గరుడ వాహన సేవ భక్తులలో అత్యంత ఆసక్తికరమైనది. ఈ రోజు స్వామి గరుడు వాహనంపై కూర్చుని, నాలుగు వీధుల్లో పర్యటించడం వల్ల భక్తులు 'గోవిందా' అని స్మరించుకుంటూ దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహన సేవకు ప్రత్యేక అర్థం ఉంది.

2025 బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 5 వేల మంది పోలీసులు, CCTVలు, డ్రోన్‌లతో భద్రతా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రత్యేక బస్‌లు నడుపుతున్నారు. తెలంగాణ నుంచి కూడా తిరుమలకు సులభంగా చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

టీటీడీ వెబ్‌సైట్, యూట్యూబ్ ద్వారా లైవ్ ట్రాన్స్‌మిషన్, VR దర్శనాలు అందుబాటులో ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో, అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలు, కళారూపాలు ప్రదర్శనలు జరుగుతున్నాయి.






















