News
News
X

Sri Ramanuja Sahasrabdi Samaroham: ముచ్చింతల్‌ లో రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల షెడ్యూల్ ఇదే..

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ముచ్చింతల్‌ దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 2 నుంచి 14వ వరకు జరగనున్నాయి. 216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం కొలువుతీర్చారు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే.

FOLLOW US: 

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ముచ్చింతల్‌ దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 2 నుంచి 14వ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

ఈ క్షేత్రంలో ప్రధాన ఆకర్షణలేంటంటే..

  • సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ 08 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది.
  • పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో ఫౌంటెయిన్‌ నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలుగుతుంది.
  • రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు.
  • రాజస్థాన్‌లో లభించే పింక్‌ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు క్షేత్రం ఆవరణలో కనువిందు చేస్తున్నాయి
  • రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు.
  • సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు  చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు.
  • గర్భగుడిలో స్తంభాలపై చెక్కిన ఆకృతులు అలరిస్తున్నాయి.
  • దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు మరింత ఆకర్షణ. విభిన్న రంగులతో కూడిన రెండు లక్షల మొక్కలు ఉద్యానవనాల్లో ఉన్నాయి.

Also Read:  వారంలో ఈ రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు సిద్ధిస్తాయట...
12 రోజుల పాటూ జరగనున్న ఉత్సవాల్లో ఏ రోజు ఏంటి..
ఫిబ్రవరి 3న అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం
ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాక, రామానుజాచార్య మహా విగ్రహావిష్కరణ
ఫిబ్రవరి 8, 9 తేదీల్లో  ధర్మసమ్మేళనం 
ఫిబ్రవరి9న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రాక
ఫిబ్రవరి10న సామాజిక నేతల సమ్మేళనం
ఫిబ్రవరి11న సామూహిక ఉపనయనం
ఫిబ్రవరి 12న విష్ణు సహస్రనామ పారాయణం
ఫిబ్రవరి13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక
ఫిబ్రవరి14న మహా పూర్ణాహుతి

 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటూ జరగనున్న శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో  దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు పాల్గొననున్నారు. 120 యాగశాలల్లో 1035 హోమగుండాలను సిద్ధం చేశారు.

Also Read: బ్రహ్మచారులిద్దరూ ఒకే విగ్రహంలో కొలువుతీరిన ఆలయం..
Also Read:  నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!

Published at : 28 Jan 2022 07:32 AM (IST) Tags: ramanuja sahasrabdi millenium sri mathe ramanujaya namaha ramanuja ramanuja sahasrabdi date ramanuja sahasrabdi celebrations video statue of equality ramanuja sri ramanja temple sri ramanujacharya swami sri ramanujacharya statue\ ramanuja sahasrabdi statue sri ramanuja sahasrabdi samaroham sri ramanuja sahasrabdi ramanuja sahasrabdi song ramanuja sahasrabdi project ramanuja sahasrabdi celebrations ramanuja sahasrabdi millenium celebrations ramanuja sahasrabdi

సంబంధిత కథనాలు

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

టాప్ స్టోరీస్

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Zoonotic Langya virus:  చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!