By: ABP Desam | Updated at : 08 Apr 2022 02:39 PM (IST)
Edited By: RamaLakshmibai
image credit : booksfact
భారతదేశంలో ఉన్న రామక్షేత్రాలన్నింటిలో రాముడు ద్విభుజుడు. భద్రాచల రాముడు మాత్రం చతుర్భుజుడు. భక్త రామదాసు రాములోరికి ఆలయం కట్టించటమే కాదు ఎన్నో బంగారు ఆభరణాలు చేయించాడు. భద్రాద్రికి తరలివచ్చే భక్తులు సైతం అనేక రకాల బంగారు ఆభరణాలను రాముడికి కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం రామయ్యకి 54 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, 925 కేజీలకు పైగా వెండి, 34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్లు, 1350 ఎకరాలకు పైగా మాన్యం ఉన్నాయి. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తే ఈ లెక్క మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.
ముక్కోటి, శ్రీరామనవమి సందర్భాల్లో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారామచంద్రస్వామికి ధరింపచేస్తారు. అవేంటంటే
ఈ ఆభరణాలన్ని ఇప్పటికీ రామాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇవేకాకుండా భక్తులు సమర్పించిన ఎన్నో బంగారు ఆభరణాలు స్వామివారు ధరిస్తున్నారు. అందుకే తాను కారాగారం పాలైనప్పుడు ...ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలకవా...ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా అన్నాడు రామదాసు.
రూ.34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్లు
బంగారం, వెండి ఆభరణాలే కాకుండా రూ.34 కోట్ల 28లక్షల 66వేల 467 లు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో నగదు ఉంది. ఇవి వివిధ బ్యాంకుల్లో నిల్వ చేశారు. వీటి నుంచి వచ్చే వడ్డీ ద్వారా నిత్యన్నదానం, ఉద్యోగులకు వేతనాలు అందజేస్తున్నారు. ఎంప్లాయీస్ పింఛన్ ఫండ్, అన్నదానం, శాశ్వత పూజలు, భూములు, రిజర్వ్యూఫండ్, కాటేజీ నిర్మాణం, వాగ్గేయ కారోత్సవాలు, ఫ్లవర్ డేకరేషన్, రామదాసు ప్రాజెక్టు, జనరల్ ఫండ్ ఇలా 196 ఎఫ్‌డీఆర్‌లు ఉన్నాయి.
శ్రీరామదాసు సినిమాలో ఇక్ష్వాకు కుల తిలక పాటలో తాను చేయించిన ఆభరణాల లెక్కలు కొన్ని చెబుతాడు రామదాసు...
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Vastu Shastra-Spirituality: ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే
Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట
Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం
Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!