అన్వేషించండి

లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే కాదు.. 8 రకాల సంపదలకు అధిష్టాన దేవత!

Spirituality: లక్ష్మీదేవిని సిరుల తల్లి అంటారంతా.. దీనివెనుక రెండు పురాణ కథలున్నాయి. ఈ రెండు కథలు తెలిస్తేనే ఆమెను ఐశ్వర్యానికి అధిష్టాన దేవత అని ఎందుకు పూజిల్తారో అర్థమవుతుంది

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సిరుల తల్లి లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుండి ఉద్భవించింది.
  • అష్టలక్ష్ములుగా పూజలందుకుంటూ ఆమె ఎనిమిది రకాల సంపదలు ప్రసాదిస్తుంది.
  • ఆమె జ్ఞానం, ఆరోగ్యం, ధైర్యం, సంతానం, ధన సంపదలిస్తుంది.

Lakshmi Devi: శ్రీ మహాలక్ష్మిని సంపదకు అధిష్టాన దేవతగా పూజిస్తారు. మా ఇంట సిరులు కురిపించమ్మా అని పూజిస్తారు. లక్ష్మీపూజకు ప్రతి శుక్రవారాన్ని మరింత ప్రత్యేకంగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవిని సిరుల తల్లి అని ఎందుకంటారు? ఆమె డబ్బుకి మాత్రమే అధిదేవత కాదు 8 రకాల సంపదకు అధిపతి అని మీకు తెలుసా?

మీరు కోరుకున్నవన్నీ పొందాలంటే ఈ అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి

దేవతలు  - రాక్షసులు కలసి క్షీర సాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి జన్మించింది. దేవతలకు బలం తగ్గి రాక్షసులు పైచేయి సాధిస్తున్న సమయంలో అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించమని విష్ణువు సలహా ఇచ్చారు. మంధర పర్వాతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకి సర్పాన్ని తాడుగా మార్చి మధించగా 14 రకాల రత్నాలు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటిగా.. బంగారు కాంతితో పద్మంపై కూర్చని నాలుగు చేతులతో ఆవిర్భవించింది మహాలక్ష్మి. ఆమెతో పాటే సంపద, సిరి, సౌందర్యం, శుభం వచ్చాయ్. దేవతలు - రాక్షసులు అందరూ ఆమెను పొందాలని పోటీపడ్డారు కానీ.. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వరించింది. విష్ణువు లోక రక్షకుడు అయితే..మహాలక్ష్మి లోక పోషణకి అధిపతిగా మారింది. పోషణ అంటే ఆహారం, వస్త్రం, ధనం, సౌఖ్యం అన్నీ వస్తాయి..అందుకే ఆమెను సిరుల తల్లి అంటారు.  శ్రీ అంటే శోభ, శుభం, కాంతి, సంపద  

లలితాదేవి చేతిలో పాశం గురుత్వాకర్షణ శక్తికి, ఇచ్ఛాశక్తికి ప్రతీక! ఆ 'పాశం' వెనుకున్న ఆధునిక విజ్ఞాన శాస్త్రం!

వేదాల ప్రకారం లక్ష్మీదేవి డబ్బుకి మాత్రమే కాదు...ఈ 8 రకాల సంపదలకు అధిష్టాన దేవత. ఈ 8 రకాల సంపదలనే అష్టలక్ష్ములుగా పూజిస్తున్నాం. 

ఆది లక్ష్మి – మూల సంపద, ఆత్మజ్ఞానం  - జీవితంలో ప్రారంభాన్ని సూచిస్తుంది ఆదిలక్ష్మి

ధాన్య లక్ష్మి – ఆహార ధాన్య సంపద  - ఆర్థిక సంక్షోభం ఎదుర్కోకుండా రక్షించే అమ్మ

ధైర్య లక్ష్మి – మనోబలం, ధైర్యం  - భయం, పిరికితనం వీడి ధైర్యంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించేదే ధైర్యలక్ష్మి
 
గజ లక్ష్మి – వాహన, రాజ్య సంపద   - అనారోగ్యం నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్నిచ్చే శక్తి గజ లక్ష్మి
 
సంతాన లక్ష్మి – పిల్లలు, వంశాభివృద్ధి   - ఉత్తమ సంతానాన్ని ప్రసాదించే సంతాన లక్ష్మి

విజయ లక్ష్మి – విజయం, కీర్తి  - చేపట్టిన పనిలో విజయాన్నిందించి ఉన్నత స్థాయికి చేర్చేందుకు విజయ లక్ష్మి

విద్యా లక్ష్మి – జ్ఞానం, విద్య   - మీరు నేర్చుకునే చదువు, విజ్ఞానం నుంచి ప్రయోజనం కలగాలంటే విద్యాలక్ష్మిని పూజించాలి

ఐశ్వర్య లక్ష్మి – ధనం, బంగారం - ఇక్కడ ఐశ్వర్యం అంటే బంగారం మాత్రమే కాదు ఆనందం కూడా
 
లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు జీవితానికి కావాల్సిన అన్ని సిరులు అందించే దేవత. అందుకే ఆమెను సిరుల తల్లి అంటారు భక్తులు.  

సంతాన భాగ్యం లేదా? ఈ 6 సులభమైన పరిహారాలు పాటిస్తే చాలు ఇంట్లో నవ్వుల్ విరబూస్తాయ్!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

Frequently Asked Questions

లక్ష్మీదేవిని 'సిరుల తల్లి' అని ఎందుకు అంటారు?

ఆమె కేవలం డబ్బుకి అధిదేవత కాదు. ఆహారం, వస్త్రం, ధనం, సౌఖ్యం వంటి లోక పోషణకు అధిపతి కాబట్టి ఆమెను సిరుల తల్లి అంటారు.

లక్ష్మీదేవి ఎలా జన్మించింది?

దేవతలు, రాక్షసులు కలిసి క్షీర సాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి జన్మించింది. ఆమె బంగారు కాంతితో పద్మంపై కూర్చని, నాలుగు చేతులతో ఆవిర్భవించింది.

లక్ష్మీదేవి అధిపతిగా ఉన్న 8 రకాల సంపదలు ఏవి?

ఆమె ఆది, ధాన్య, ధైర్య, గజ, సంతాన, విజయ, విద్యా, ఐశ్వర్య లక్ష్ములుగా 8 రకాల సంపదలకు అధిపతి. వీటినే అష్టలక్ష్ములుగా పూజిస్తారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget