అన్వేషించండి

Lakshmi Mantra: మీరు కోరుకున్నవన్నీ పొందాలంటే ఈ అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి

Lakshmi Mantra: లక్ష్మీదేవిని 8 రూపాలలో పూజిస్తారు. ఈ 8 లక్ష్మీ రూపాలను అష్టలక్ష్ములు అంటారు. అష్టలక్ష్మి మంత్రాలు ఏమిటి? అష్టలక్ష్మి మంత్రం పఠిస్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి.?

Lakshmi Mantra: సంపద, మంచి ఆరోగ్యం, సంతానం పొందడానికి, మీరు లక్ష్మీ దేవి ఎనిమిది రూపాలను.. అంటే అష్ట ల‌క్ష్ముల‌ను పూజించాలి. లక్ష్మీదేవిని ప్ర‌ధానంగా 8 రూపాలలో పూజిస్తారు. ఈ 8 రూపాలు మనకు వివిధ మార్గాల్లో మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. జీవితంలో అన్ని రకాల సుఖాలు కలగాలంటే అష్టలక్ష్మి మంత్రాన్ని పఠించాలి. ఎవరైతే రోజూ ఈ మంత్రాల‌ను జపిస్తారో వారికి జీవితంలో కోరుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయి. రోజూ జరిపించాల్సిన అష్టలక్ష్మి మంత్రాలను చూడండి.

ఆది లక్ష్మి
ఆది లక్ష్మి ఒక వ్యక్తి జీవిత ప్రారంభాన్ని సూచిస్తుంది. మీరు కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు, ఆ స్థలంలో పూజ చేసే పండితుడు ఈ మంత్రాన్ని రాస్తారు. కాబట్టి మీరు జీవితంలో ఏదైనా కొత్తగా ప్రారంభించాలని అనుకున్నప్పుడు, ఈ మంత్రాన్ని పఠించండి.
మంత్రం: ఓం శ్రీ ఆదిల‌క్ష్మ్యై న‌మః

Also Read : లక్ష్మీదేవి ఇలాంటి ఇళ్లలో ఎప్పటికీ ఉండదు!

ధాన్య‌ లక్ష్మి
మ‌న‌కు జీవితంలో ధ‌న‌,ధాన్యాలను ధాన్య‌ల‌క్ష్మీ దేవి క‌టాక్షిస్తుంది. మీరు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని లేదా మీ ఇంట్లో ధాన్యం కొరతను ఎదుర్కోకుండా ధాన్య‌ల‌క్ష్మి ఆశీర్వాదాలు పొందాలంటే మీరు ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రం - ఓం శ్రీం క్లీం ధాన్య‌ల‌క్ష్మ్యై న‌మః

ధైర్య‌ లక్ష్మి
మాన‌వ‌ జీవితంలో విశ్వాసం, సహనాన్ని ధైర్య ల‌క్ష్మి సూచిస్తుంది. మీరు ఏదైనా పని చేయడానికి లేదా ఏదైనా పనిని గ‌డువులోపు పూర్తి చేయడానికి భయపడితే, మీరు మామూలుగా మారడానికి ఈ మంత్రాన్ని పఠించాలి.
మంత్రం - ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్య‌లక్ష్మ్యై న‌మః

గజ లక్ష్మి
గజ లక్ష్మి రూపం మన జీవితంలో ఆరోగ్యంతో పాటు బలాన్ని సూచిస్తుంది. మీరు జీవితంలో శారీరక బాధ‌ల‌ను ఎదుర్కొంటున్నట్లయితే, ఉపశమనం పొందడానికి మీరు ఈ మంత్రాన్ని పఠించాలి.
మంత్రం - ఓం శ్రీం హ్రీం క్లీం గ‌జ లక్ష్మ్యై న‌మః

సంతాన లక్ష్మి
మ‌న జీవితంలో కుటుంబానికి, సంతానానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. సంతానం లేనివారు లేదా కొత్తగా పెళ్లయిన వారు సంతాన ల‌క్ష్మిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. మీ పిల్లల విజయానికి సరైన దిశలో మార్గనిర్దేశం చేసేందుకు మీరు ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రం - ఓం హ్రీం శ్రీం క్లీం సంతాన లక్ష్మ్యై న‌మః

విజయ లక్ష్మి
విజయ లక్ష్మి మాన‌వ‌ జీవితంలో విజయం, శ్రేష్ఠతను సూచిస్తుంది. మీరు వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు లేదా మీ విజయాన్ని కోరుకునే ఏదైనా కార్య‌క్ర‌మానికి వెళ్లినప్పుడు మీరు ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రం - ఓం క్లీం ఓం విజయ లక్ష్మ్యై న‌మః

విద్యా లక్ష్మి
విద్యా లక్ష్మి మ‌న‌ జీవితాల్లో విద్య‌ను, జ్ఞానాన్ని సూచిస్తుంది. మీరు చదువులో ఏకాగ్రత వహించి దాని నుంచి పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే, మీరు ఈ మంత్రాన్ని పఠించాలి.
మంత్రం - ఓం అం ఓం విద్యా లక్ష్మ్యై న‌మః

Also Read : లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!

ఐశ్వర్య లక్ష్మి
ఐశ్వర్య లక్ష్మి మీ జీవితంలో ప్రేమ, ఆనందాన్ని సూచిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఈ మంత్రాన్ని పఠిస్తుంటారు.
మంత్రం - ఓం శ్రీం శ్రీం ఐశ్వర్య లక్ష్మ్యై న‌మః

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget