Sri Ayyappa Swamy Temple: కేరళ తంత్రులతో పూజలు, ఏపీలో ఇరుముడులు సమర్పించే అయ్యప్ప ఆలయం ఇదే!
అయ్యప్ప మాలధారులంతా శబరిమలకు వెళ్లి ఇరుముడులు సమర్పించుకుంటారు. కానీ..అక్కడకు వెళ్లే అవకాసం లేనివారంతా సొంత రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో దర్శనం చేసుకుంటారు. అలాంటి ఆలయమే నెల్లూరు జిల్లాలో ఉంది..
Sri Ayyappa Swamy Temple: మణికంఠుడు, హరిహర పుత్రుడని భక్తులు విశ్వశించే అయ్యప్పస్వామి ప్రధాన ఆలయం శబరిమలలో ఉంది. రాష్ట్రాలను దాటుకుని వెళ్లలేని భక్తులకోసం అయ్యప్ప సేవాసమాజం వారు నెల్లూరులో నిర్మించారు. ఇప్పటికీ కేరళ తంత్రులతోనే పూజలందుకుంటున్నాడు మణికంఠుడు. నెల్లూరుకు ల్యాండ్ మార్క్ అయ్యప్పగుడి. నెల్లూరుకి ఓ వైపున రంగనాయకులు గుడి, మరోవైపున అయ్యప్ప గుడి ఉంటాయి. అయ్యప్పగుడి సెంటర్ అంటే నెల్లూరులో బాగా ఫేమస్. అయితే ఈ ఆలయానికి మరో అరుదైన విశిష్టత కూడా ఉంది. సహజంగా అయ్యప్ప మాల ధరించే భక్తులు శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఏపీలో కూడా ఇరుముడి సమర్పించే అతి కొద్ది ఆలయాల్లో నెల్లూరు అయ్యప్ప గుడి కూడా ఒకటి.
తంత్రులతో పూజలు
1987లో కేరళ తంత్రులతో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఏటా ఇక్కడ మండల పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప మాల ధారణ సమయంలో భక్తులు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు. మాల ధరించిన స్వాములకు నిత్యాన్నదానం ఉంటుంది. జిల్లానుంచి బయలుదేరే అయ్యప్పస్వాములంతా ఈ ఆలయం వద్ద ఆగి, స్వామిని దర్శించుకుని తమ యాత్ర మొదలు పెట్టడం ఆనవాయితీ.
Also Read: ఈ ఆలయంలో 700 ఏళ్లుగా దీపం వెలుగుతూనే ఉంది, ఒక్కసారి దర్శించుకున్నా చాలు!
పదునెట్టాంబడి ఉంది
ఏపీలోని అయ్యప్ప స్వామి ఆలయాలన్నింటి కన్నా నెల్లూరులో ఉన్న ఈ అయ్యప్ప గుడికి ఓ విశిష్టత ఉంది. శబరిమల ఆలయంలాగే ఇక్కడ కూడా ఉపాలయాల నిర్మాణం ఉంది. పదునెట్టాంబడి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ప్రధాన ఆలయంలో కేరళ తంత్రులు మాత్రమే పూజలు నిర్వహిస్తుంటారు. ఉపాలయాల్లో స్థానిక పూజారులుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే సంతానం లేనివారికి ఆ అదృష్టం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
Also Read: దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!
అయ్యప్పస్వామి స్తోత్రం
అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!
చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!
వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !!
శ్రీ అయ్యప్ప పంచరత్నం
1.లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం !!
ఓం స్వామియే శరణమయ్యప్ప
2.విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !!
3.మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !!
4.అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం !!
5.పాండ్యేశవంశ తిలకం భారతేకేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం !!
పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !!
యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః
త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం !!