అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Spirituality: దేవాలయంలో ఈ పనులు చేయకూడదు

ఇంట్లో పూజలు చేసినా చేయకపోయినా ఆలయాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువే. కొందరు రెగ్యులర్ గా , మరికొందరు పండుగలు-ప్రత్యేక రోజుల్లో వెళతారు. అయితే ఆలయానికి వెళ్లేవారు ఈ పద్ధతులు పాటిస్తున్నారా....

Spirituality: దేవాలయం  పవిత్రమైన స్థలం.  ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మరచిపోయి ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు భక్తులు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయంలో ఓ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందుకే ఆలయం లోపల మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల కూడా అంతా పవిత్రంగా ఉండాలంటారు. అలాంటిది ఆలయం లోపలకు వెళుతున్నారంటే ఇంకెన్ని పద్ధతులు, నియమాలు పాటించాలో తెలుసా..

దేవాలయానికి వెళ్లేవారు పాటించాల్సిన పద్ధతులు

  • దేవాలయం అంటే దేవుడు కొలువైన స్థలం..పవిత్రమైన ప్రదేశం.. అలాంటి ప్రదేశానికి వెళ్లే భక్తులు కొన్ని పద్ధతులు
  • పాటించాలి..అప్పుడే దైవం అనుగ్రహానికి పాత్రులవుతారు
  • గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, నుదుటన కుంకుమ ధరించాలి
  • సంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి
  • పెద్దవారి దగ్గరికి, పిల్లల దగ్గరకు, దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదు..అందుకే పళ్లు, పూలు తీసుకుని వెళ్లాలి.. గీతలో కృష్ణ పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.
  • గుడికి చేరుకోగానే కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
  • ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి
  • లోపలకు అడుగుపెట్టాక మనసులో భగవంతుడి ధ్యానం తప్ప..మరో ఆలోచన ఉండకూడదు
  • ప్రదిక్షిణ చేసిన తర్వాత మొదట మూల విగ్రహం పాదాలను దర్శించుకుని ఆ తర్వాత స్వామివారి రూపం మొత్తాన్ని చూడాలి
  • అర్చన చేయించుకునేవారు గోత్రం, ఇంటిపేరు నక్షత్రం చెప్పుకోవాలి.
  • దర్శనం అయి తీర్థం తీసుకున్నతర్వాత కాసేపు స్వామి అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి
  • ప్రసాదం తీసుకుని బయటకు వెళ్లేముందు మరోసారి దేవుడిని దర్శించుకుని..గోపురానికి నమస్కరించి బయటకు రావాలి
  • ఆలయంలో అనవసరంగా మాట్లాడటం, పరుషపదజాలం ఉపయోగించడం చేయరాదు
  • ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గోక్కోవడం, తాంబూలం వేసుకోవడం చేయరాదు
  • జనన, మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో మాట్లాడకూడదు
  • ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు
  • నందీశ్వరుడు, శివలింగానికి మధ్యనుంచి నడిచి వెళ్ళకూడదు
  • ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు, బలిపీఠానికి మొక్కకూడదు
  • మూలవిరాట్ దగ్గర దీపం లేకుండా దర్శనం చేసుకోరాదు
  • ఆలయంలో ప్రవర్తనా విధానం ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు
  • ఆలయానికి వెళ్లి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు..కాసేపు కూర్చున్నాక కడుక్కోవచ్చు

Also Read:  సంక్రాంతినే పెద్దపండుగ, పెద్దలపండుగ అంటారెందుకు, దీని విశిష్టత ఏంటి!

ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ బద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్లో ప్రతిష్ఠిస్తారు. ఆలయాల్లో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అందుకే ఆలయాలకు వెళ్లేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

Also Read: ఈ సంక్రాంతికి ఈ ఐదుపనులు చేసేలా ప్లాన్ చేసుకోండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Embed widget