News
News
X

Spirituality: జ్ఞానం, మోక్షం,గౌరవం, హోదాకి చిహ్నాలు -దేవుళ్ల వాహనాల వెనుకున్న ఆంతర్యం ఇదే!

Spirituality: హిందూ దేవుళ్లకు వాహనంగా జంతువులు, పక్షులు ఉండడం గమనించే ఉంటారు. అయితే వాహనంగా వాటిని పెట్టుకోవడం వెనుక ఆంతర్యం వేరేఉందంటారు పండితులు..అదేంటంటే..

FOLLOW US: 
Share:

Spirituality: ఏనుగు (గణేషుడు), కోతి (హనుమంతుడు), పాము (సుబ్రమణ్యస్వామి) వీటితో పాటూ ఆవు..ఇలా జంతువులు, పక్షులను దేవుడిగా భావించి పూజలందిస్తారు..మరికొన్ని దేవుళ్లు, దేవతలకు వాహనంగా ఉంటాయి. ఇవి కేవలం వాహనం మాత్రమే కాదు.. మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పే సూచికలు. కొందరు దేవుళ్ళకు వాహనాలుగా బాగా ప్రసిద్దిచెందిన కొన్ని జంతువులు మరియు పక్షులేంటో తెలుసుకుందాం

ఎలుక
ఎలుక వినాయకుడికి వాహనం. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం. జ్ఞానానికి అధినేత అయిన వినాయకుడు వీటన్నింటిపై చేసే సవారీ అని అర్థం. మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణుజొచ్చి, తన వాహనంగా చేసుకొమ్మని వినాయకుడిని వేడుకున్నాడు.  

ఎద్దు (నంది)
ఎద్దుకున్న తెలుపు రంగు స్వచ్ఛత, న్యాయాన్ని సూచించగా... శివాలయాల్లో గర్భగుడి వైపు కూర్చున్న నంది వ్యక్తి జీవాత్మను, మనసు ఎల్లప్పుడూ పరమేశ్వరుడిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్నిస్తుంది. శక్తికి చిహ్నంగా ఉన్న ఎద్దు మోహం, భౌతిక కోరికలకు అతీతంగా జీవించే జీవిగా పరిగణిస్తారు.

Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ ప్రధాన పాత్ర పోషించిన ఐదుగురు

సింహం
సింహం అడవిలో ఉమ్మడి కుటుంబంలో నివసించే జీవి. ఇది అడవిలో అత్యంత శక్తివంతమైన జీవి..అనవసరంగా తన శక్తిని అస్సలు వృధా చేయదు. అవసరమైనప్పుడు వెనక్కు తగ్గదు. అధిపతిగా ఇంటిని ఐక్యంగా ఉంచడం, అనవసర విషయాలకు దూరంగా ఉండడాన్ని సూచిస్తుంది సింహం

గుడ్లగూబ 
గుడ్లగూబ చురుకైన స్వభావం కలిగిన పక్షి. లక్ష్మీ దేవి వాహనం. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని సూచిస్తుంది గుడ్లగూబ. 

నెమలి, హంస
హిందూ మతంలో ముఖ్యమైన దేవతా మూర్తుల్లో సరస్వతిని చదువులతల్లిగా ఆరాధిస్తారు. అమ్మవారు  త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్ఞానానికి ప్రధాన దేవతగా మయూరాన్ని చెబుతారు. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦, పాలు నీళ్లను వేరే చేసే సామర్థ్యం హంస సొంతం.  నెమలి సుబ్రమణ్యస్వామి వాహనం కూడా....

Also Read: తిరుప్పావై అంటే ఏంటి, 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి!

గరుత్మంతుడు(గ్రద్ద)
అన్నిపక్షులకు అధిపతి గరుడ. అష్టాదశ పురాణాల్లో గరుడుడి పేరుమీద ఓ పురాణం ఉంది..అదే గరుడ పురాణం.  ఈ పురాణం శ్రీ మహా విష్ణువు ..తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించాడు. అందుకే ఈ పురాణానికి "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. మోక్షాన్ని ప్రసాదించే శ్రీ మాహావిష్ణువుకి వాహననమైన గరుత్మంతుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. 

ఐరావతం
ఏనుగు ఇంద్రుని  వాహనం. సురుల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనం. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారం, హోదాని సూచిస్తుంది. 

మొసలి
వరుణుడి వాహనం మొసలి. వేదకాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టికి నాశనం చేసే అంశాల కంటె అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ. వేదాల ప్రకారం..వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు.  మొసలి గౌరవం, శక్తి, వేగం, శక్తి, జిత్తులమారి, ధైర్యానికి సూచన

అశ్వం
గుర్రం..ప్రత్యక్షదైవం అయిన సూర్యుడి వాహనం. అశ్వం ఇంద్రధనుస్సును సూచిస్తుంది. ఆది దేవుడు ఏడు గుర్రాల మీద స్వారి చేస్తాడు. గుర్రం వేగానికి చిహ్నం.

Published at : 20 Dec 2022 12:47 PM (IST) Tags: Spirituality inspiration animals And birds of hindu gods Divine Animal of Hindu Gods

సంబంధిత కథనాలు

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం -  ఫిబ్రవరి రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?