News
News
X

దుష్ట శక్తులు, ప్రేతాత్మలు ఇంట్లోకి ప్రవేశించకూడదంటే ఇలా చేయండి

భయం లేని జీవితాన్ని గడిపేందుకు ఈ ఉపాయాలు దోహదం చేస్తాయి. అయితే వాటి గురించి తెలసినవారు ఈరోజుల్లో చాలా తక్కువ. ఇలాంటి వివరాలను మనకు కొందరు జ్యోతిష పండితులు అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

కనిపించని దైవం ఉన్నాడన్న నమ్మకం ఉన్నపుడు కనిపించని దయ్యం కూడా ఉన్నట్టే అంటారు పెద్దలు. దేవుడనే భావన ఎలాగైతే ధైర్యాన్ని ఇస్తుందో, కష్టాలు దాటేందుకు ఊతంగా ఉంటుందో.. దయ్యం అనే భావన కూడా అలాగే భయాన్ని కలిగించి ధైర్యం కోల్పోయేలా చేస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మీ అని నానుడి. అంటే ధైర్య సాహసాలు కలిగి ఉండడమే నిజమైన లక్ష్మీ ప్రాప్తికి మార్గం అని. ఇలాంటి భయాలను దూరం పెట్టేందుకు మన పురాతన వేద గ్రంథాలలో సైతం కొన్ని ఉపాయాలను సూచించారు. వీటిని పాటించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి దరిచేరదు. భయం లేని జీవితాన్ని గడిపేందుకు ఈ ఉపాయాలు దోహదం చేస్తాయి. అయితే వాటి గురించి తెలిసినవారు ఈరోజుల్లో చాలా తక్కువ. ఇలాంటి  వివరాలను మనకు కొందరు జ్యోతిష పండితులు అందుబాటులో ఉంచారు. వాటి గురించి తెలుసుకోవడం అవసరం.  

సనాతన ధర్మంలో ఇలా భూతప్రేతాల నుంచి విముక్తి పొందేందుకు మార్గాలను కూడా వివరించారు. చరకసంహితలో భూత ప్రేత పీడిత రోగుల లక్షణాలను వాటి నుంచి విముక్తి చెయ్యాల్సిన ఉపాయాలు కూడా చర్చించారు. జ్యోతిష సాహిత్య మూల గ్రంథాలైన ప్రశ్నామార్గం, వృహత్పరాశర్, హోరాసార్, ఫాల్దీపిక, మానసాగరి వంటి వాటిలో జ్యోతిష యోగా గురించిన ప్రస్తావన ఉంది. ఇది ప్రేత పీడ, పితృదోషం వంటి వాటిని వదిలించుకునేందుకు పరిష్కారాలు సూచిస్తోంది. అథర్వవేదంలో ప్రేతాత్మలు, దుష్ట శక్తులను బహిష్కరించేందుకు చాలా ఉపాయాలను వివరించారు. చిన్న చిన్న ఉపాయాలతో దుష్ట శక్తులను దరి చేరకుండా నివారించుకోవడం సాధ్యమే అని శాస్త్రం చెబుతోంది.  ప్రేత బాధ నుంచి ఉపషమనం పొందేందుకు ఎలాంటి ఉపాయాలు పాటించాలో తెలుసుకుందాం.

  • సానాతన ధర్మంలో ఓం అనే ప్రణవ నాధానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఇంటి ముఖద్వారం మీద ఓం గుర్తును రాసిపెట్టుకోవాలి. ఈ చిహ్నం కనిపిస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. దీనితో పాటు ఇంట్లోని వారందరు దైవానుగ్రహం కలిగిన తాయత్తులను ధరించాలి.
  • భూత, ప్రేత, శాకినీ, డాకిని వంటి ప్రేతాత్మల నుంచి రక్షణ పొందేందుకు ఇంట్లో నెయ్యి లేదా ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఈదీపపు నుసితో కాటుక తయారు చేసుకోవాలి. ఈ ఉపాయాన్ని దీపావళి రాత్రి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ కాటుకను ధరిస్తే దుష్ట శక్తులు దరిచేరవు.
  • రాత్రి భోజనం తర్వాత వెండి పాత్రలో కర్పూరం, లవంగాలను కాల్చాలి. ఈ పరిహారం దేవస్థానం లేదా ఏదైనా పవిత్రస్థలలాల్లో అకస్మాత్తుగా ఎదురైయ్యే దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. ఈ ఉపాయం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు చెయ్యాలి.
  • రావి చెట్టు నుంచి ఏడు ఆకులను తీసుకొని వాటిని ఇంటిలోని దైవసన్నిధిలో ఉంచి పూజించాలి. ఈ ఆకులు ఎండిపోగానే తొలగించి తిరిగి కొత్త ఆకులను పూజలో ఫెట్టుకోవాలి. తీసేసిన ఆకులను అదే రావి చెట్టు కింద ఖననం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల భూతప్రేతాలు దరి చేరవు.

గమనిక: పండితులు, వివిధ ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

Also Read: లవంగాలను ఇలా ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట

Published at : 14 Mar 2023 09:26 PM (IST) Tags: evil spirit removing evil spirit special measures

సంబంధిత కథనాలు

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

వామ్మో, మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? అవి మరణానికి సంకేతాలు

వామ్మో, మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? అవి మరణానికి సంకేతాలు

Vaishno Devi Darshan: వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే ఇబ్బంది పడతారు!

Vaishno Devi Darshan: వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే ఇబ్బంది పడతారు!

మీ ఇంట్లో ట్యాప్ ఇటు వైపు ఉందా? ఆర్థిక కష్టాలు తప్పవు!

మీ ఇంట్లో ట్యాప్ ఇటు వైపు ఉందా? ఆర్థిక కష్టాలు తప్పవు!

మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది

మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా