Mukkanuma Festival: ముక్కనుమ పండుగ ఉందా, లేదా.. ఈ రోజు ఏం చేయాలి...
సంక్రాంతి అంటే మూడు రోజులు అని మాట్లాడుకుంటాం కానీ ఇది నాలుగు రోజుల పండుగ అంటారు కొందరు. తొలి మూడు రోజులకీ ఏదో ఒక పరమార్థం ఉంటే..నాలుగో రోజైన ముక్కనుమ సంక్రాంతికి ముగింపు అని చెబుతారు.
సంక్రాంతిలో తొలిరోజైన భోగి రోజంతా భోగిమంటలు, భోగిపళ్లు, బొమ్మల కొలువుతో సందడిగా సాగిపోతుంది. రెండో రోజు సంక్రాంతి పెద్దల పండుగగా భావిస్తారు. మూడో రోజు కనుమ సందర్భంగా పంటలు పండేందుకు తోడ్పాటునిచ్చే పశువులకు కృతజ్ఞతగా పూజలు చేస్తారు. కొందరు ఈ రోజు మాంసాహారం తింటారు కానీ..వాస్తవానికి నాలుగో రోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని , తమని రక్షించమని వేడుకుని బలిస్తారు. ఈ రోజున నాన్ వెజ్ తింటారు. అందుకే ఈ రోజున ముక్కల కనుమ అంటారు..అదేనండీ ముక్కనుమ.
Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
మరీ ముఖ్యంగా సంక్రాంతిలో మూడోరోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదనే నియమం మేరకు పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు నాలుగో రోజున అత్తారింటికి తిరిగి పయనమవుతారు. అందుకే ముక్కనుమ రోజున నాన్ వెజ్ తో మంచి భోజనం పెట్టి, పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తారింటికి పంపిస్తారు. కొందరైతే ముక్కనుమ రోజు కూడా ప్రయాణం చేయకూడదు అంటారు కానీ.. దీనికి శాస్త్రపరంగా ఎలాంటి ఆధారాలు లేవు.
సాధారణంగా కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు..కొందరైతే ముక్కనుమ రోజు రథం ముగ్గువేసి... పక్కింటి వాళ్ల వాకిట్లో వేసే రథం ముగ్గుని కలిపి అలా ఊరంతా కలసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మరలే సందర్భాన్ని గుర్తుచేస్తూ ఆయన్ను సాగనంపేందుకు ఊరు ఊరంతా కలసి రథం ముగ్గు కొనను కలుపుతూ వేస్తారు.
Also Read: ఈ టైమ్ లో చెడుమాట్లాడితే అంతే...
ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. ఈ రోజు బంధువులను కలిస్తే మంచిదని చెబుతారు. కొత్త సంబంధాలు కలుపుకునేందుకు, మంచి చెడులకు సంబంధించి బంధువులను పరామర్శించేందుకు ఈ రోజు మంచిరోజుగా భావిస్తారు. అందుకే సుకుటుంబ,సపరివార సమేతంగా వనభోజనాలు కూడా చేస్తారట.
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
అసలు ముక్కనుమ అనేది శాస్త్రాల్లో లేదని..ఎవరో తీసుకువచ్చి కనుమకు అతికించారని అలా అలా ప్రచారంలోకి వచ్చిందని అంటారు. మరో వాదన ప్రకారం ముక్కనుమ అనేది ఉందంటారు. ఈ రెండు వివాదాల మధ్య ఈ పండగ కొన్ని చోట్ల జరుపుతున్నారు, మరికొన్ని చోట్ల వదిలేస్తున్నారు. అయితే పండుగలకు సంబంధించి అనవసర వివాదాలు, వాదనలు పెట్టుకునే కన్నా మీరు విశ్వసిస్తే జరుపుకోండి లేదంటే వదిలేయండి..అంతే కానీ మనకు తెలిసింది మాత్రమే వాస్తవం అన్నట్టు వాదనకు దిగడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నది తెలుసుకోండి అంటారు పండితులు.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు..
Also Read: గుడ్ల గూబను అశుభం అనుకుంటే పొరపాటే.. ఈ విషయం తెలుసా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి