అన్వేషించండి

Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!

Ravivar Vrat Vidhi: వారంలో ప్రతి రోజూ ఓ దేవుడికి అంకితం..అలా..ఆదివారం ప్రత్యక్షనారాయణుడికి అంకితమైన రోజు. ఈ రోజు పూజా విధానం, దానివల్ల పొందే ఫలితాలు తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆదివారం ఉప్పు, మాంసం, నలుపు దుస్తులు ధరించడం నిషిద్ధం.

Surya Dev:  హిందూ ధర్మంలో నిత్యపూజ జీవితంలో శాంతిని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని తీసుకొచ్చేదిగా భావిస్తారు. వారంలో రోజుకో దేవుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తారు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడిని ఆరోగ్యం, ఐశ్వర్యం, గౌరవం, విజయం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చెబుతారు..అందుకే "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" అని శాస్త్రం చెబుతుంది. నిత్య పూజలో భాగంగా ఆదివారం సూర్య భగవానుడిని భక్తితో కొలిస్తే మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
 
సూర్యుడిని నిత్యం పూజించేవారి జాతకంలో ఉండే చాలా దోషాలకు పరిహారంలా పనిచేస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు సూర్యుడిని నిత్యం పూజిస్తే ఉపశమనం లభిస్తుంది. జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. అయితే ఆదివారం రోజు కొన్ని నియమాలు పాటించడం కూడా ముఖ్యమే..

తులా నుంచి మీనం వరకు ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయ్ - 28 జూన్ - 4 జూలై వారఫలాలు!

ఆదివారం సూర్యుడి పూజా విధానం
 
ఆదివారం పూజ  ఆదిత్యుడి అనుగ్రహం పొందడానికి చేస్తారు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం శుభప్రదం. వేకువజామునే స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించండి.  ఎరుపు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనది. రాగి చెంబులో నీరుపోసి అందులో ఎర్ర చందనం, ఎరుపు పూలు, అక్షతలు, కుంకుమ కలపండి. సూర్యుడు ఉదయించే దిశగా నిల్చుని.. రెండు చేతులు పైకెత్తి కలశలో నీటిని ఎడమచేస్తో పట్టుకుని కుడిచేత్తో అర్ఘ్యం ఇవ్వండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో 'ఓం సూర్యాయ నమః' , 'ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః' అనే మంత్రాన్ని పఠించండి.  

అర్ఘ్యం ఇచ్చి వచ్చిన తర్వాత ఇంట్లో పూజా స్థలంలో పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై సూర్యుడి చిత్ర పటం లేదా విగ్రహం లేదా రాగి నాణెం పెట్టి...ఎర్రటి పూలతో పూజచేయండి. దీపం, ధూపం, నైవేద్యం సహా మీ శక్తిమేరకు షోడసోపచార పూజ పూర్తిచేయండి. సూర్యుడి అష్టోత్తరం, ఆదిత్యహృదయం పఠించిన తర్వాత హారతి ఇవ్వండి.  

 28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!

ఆదివారం పాటించాల్సిన నియమాలు

వేకువజామునే లేచి స్నానం చేయాలి

ఆదివారం నలుపు, నీలం రంగు దుస్తులు ధరించవద్దు

ఉప్పు తినొద్దు, మద్యం - మాంసానికి దూరంగా ఉండాలి

ఎవరిపైనా కోప్పడొద్దు, అవమానించవద్దు, అబద్ధాలు చెప్పొద్దు

చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వవద్దు

ఈ రోజు శరీరాన్ని నూనెతో మర్దన చేయకూడదు

సూర్య భగవానుడి పూజ చేసేవారు జుట్టు, గడ్డం కత్తిరించుకోవద్దు

 సూర్య బీజ మంత్రం

"ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః" 

ఈ శక్తివంతమైన మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల శరీరంలోని సహజ చికిత్సా శక్తి పెరుగుతుంది. ఈ బీజ మంత్రం ప్రభావంతో జీవితంలో వెలుగు నిండుతుంది, ఆనందం పెరుగుతుంది.

మీ బొట్టు తీసి అద్దానికి, బాత్రూమ్ లోనూ అతికిస్తున్నారా! ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Frequently Asked Questions

సూర్య భగవానుడి పూజలో జపించాల్సిన మంత్రం ఏమిటి?

సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు 'ఓం సూర్యాయ నమః' లేదా 'ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?
'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget