అన్వేషించండి

Bindi Astrology: మీ బొట్టు తీసి అద్దానికి, బాత్రూమ్ లోనూ అతికిస్తున్నారా! ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?

Astrology: చిన్న బొట్టు స్త్రీ ముఖానికి అందాన్ని ఇస్తుంది, కానీ దాన్ని అద్దానికి అతికించడం, తిరిగి పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు కూడా వస్తాయని మీకు తెలుసా?  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అద్దాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి; తూర్పు దిశలో శ్రేయస్కరం.

భారతీయ మహిళలకు రోజువారీ అలంకరణలో  బొట్టు ఓ భాగం. ఇది అందం కోసం మాత్రమే కాదు మంగళం, శక్తి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. అయితే చాలామంది మహిళలు అద్దంపై బొట్టు అతికించడం, తీసి పెట్టుకోవడం చేస్తుంటారు. చాలా మంది మహిళలకు ఈ అలవాటు ఉంటుంది. నుదుటిన ఉన్న బొట్టు తీసి ఠక్కున అద్దానికి తగిలిస్తారు..కొందరు డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి తగిలిస్తే మరికొందరు బాత్రూమ్ లో అతికిస్తుంటారు. ఇది చాలా చిన్న చర్యే కానీ ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు

అద్దం మన ప్రతి బింబాన్ని చూపించే పవిత్రమైన వస్తువు. కొందరు స్త్రీలు అద్దంపై కుంకుమ బొట్టు అతికించడం అంటే దేవతలకు నివేదించినట్టు భావిస్తారు. ఇది లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతం. కానీ అద్దం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలని సంప్రదాయాలు చెబుతున్నాయి. బొట్టు అతికించడం వల్ల మసకబారితే బింబం స్పష్టంగా కనిపించదు...ఇది మానసికంగా అసౌకర్యం కలిగిస్తుంది.  
 
బొట్టును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం దానిని నుదుటిపై పెట్టుకుంటారు, కానీ తరచుగా స్త్రీలు తెలిసి లేదా తెలియక బొట్టు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు, అవి వైవాహిక జీవితానికి నష్టదాయకంగా పరిణమించవచ్చంటున్నారు వాస్తు నిపుణులు. 

అద్దం ముందు నిల్చుని రెడీ అయిన తర్వాత.. అంతకు ముందు దానికి బొట్టు తగిలించడం..దాన్ని తీసి తిరిగి పెట్టుకోవడం చాలామంది చేస్తుంటారు. వాస్తు శాస్త్రంలో అద్దాలు శక్తిని ప్రతిబింబించే శక్తివంతమైన అంశంగా పరిగణిస్తారు. ఒక మహిళ అద్దంపై బొట్టు పెట్టుకున్నప్పుడు, అది ప్రతికూల శక్తిని ఆకర్షించగలదు. అద్దంపై చుక్క పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో ప్రతికూల ప్రకంపనలు ఏర్పడి, అది ఇంటి శ్రేయస్సు, సంతోషాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ఈ అలవాటు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుందట. భార్య భర్త మధ్య కూడా వివాదాలు, ఇంట్లో ఆర్థిక నష్టాలు, అనవసర ఖర్చులు, ఆర్థిక అస్థిరత పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

అద్దం పడకగదిలో లేదా ప్రధాన ద్వారం దగ్గర ఉంచితే, అది ఆర్థిక నష్టాన్ని ప్రోత్సహిస్తుంది. అద్దంపై చుక్కల గుర్తులు ఉంటే, వాటిని క్షుణ్ణంగా శుభ్రం చేయండి. ఈ గుర్తులను అలాగే వదిలేయడం ప్రతికూలతకు ఆహ్వానం పలికినట్టే. ఇక స్నానాల గదిని అపవిత్రమైన , అశుభ్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు కాబట్టి, స్నానాల గది గోడకు లేదా అద్దానికి బొట్టు అంటించడం సరికాదంటున్నారు. అద్దానికి అతికించిన బొట్టు తీసి పెట్టుకునే కన్నా కొత్తగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని శక్తి ఆకర్షణగా, నీటి తత్వంలో ముడిపడినవిగా భావిస్తారు. అవి సానుకూల శక్తిని రెట్టింపు చేస్తాయి కాబట్టి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదం. దక్షిణం లేదా పశ్చిమం వైపు అద్దం ఉంచకూడదు. అద్దంపై బొట్టు లాంటి మార్కులు ఉంటే అవి స్వచ్ఛతకు భంగం కలిగిస్తాయి. అందుకే అద్దం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలని సూచిస్తారు వాస్తు నిపుణులు.  తూర్పు వైపు అద్దంలో బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుంది. దక్షిణ దిశవైపు తిరిగి బొట్టు ఎప్పుడూ పెట్టుకోరాదు.  

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Frequently Asked Questions

అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ దిశలు పాటించాలి?

తూర్పు దిశ వైపు చూస్తూ అద్దంలో బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుంది. దక్షిణ దిశవైపు తిరిగి ఎప్పుడూ బొట్టు పెట్టుకోరాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget