అన్వేషించండి

Signs of Nature: ప్రకృతి మనతో మాట్లాడుతుంది, మనం వినాలి - నేరేడు పండ్ల వెనుక శాస్త్రం & ప్రకృతి సంకేతంలో నిజమెంత!

Jamun Trees Heavy Fruiting: నేరేడు పండ్లు ఎక్కువ కాస్తే అది కరువుకి సంకేతమా? ప్రకృతి నుంచి వచ్చే పెద్ద హెచ్చరికా? ఇందులో నిజమెంత? వృక్ష శాస్త్రం ఏం చెబుతోంది? ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈ ఏడాది నేరేడు పండ్ల దిగుబడి కరువు సూచనగా ఉంది.
  • భూగర్భ జలాలు తగ్గి వాతావరణ మార్పులు సంకేతమిది.
  • జాతి మనుగడకై చెట్టు చేసే ప్రయత్నమే 'మాస్టింగ్' అంటారు.
  • ప్రకృతి వనరుల బాధ్యతాయుత వినియోగానికి ఇదొక హెచ్చరిక.

Signs of Nature: నేరేడు పండ్లు ఏమని హెచ్చరిస్తున్నాయ్? మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత నేరేడు పండ్ల దిగుబడి ఈఏడాది ఉందా? గతేడాది వరకూ కొన్ని పండ్లు మాత్రమే కాసిన చెట్లు ఈ ఏడాది నిండిపోయాయా? ఇదంతా దేనికి సంకేతం? అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? ఏ ఏడాదిలో నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే..ఆ ఏడాది కరువు వస్తుందనే మాట నిజమేనా? వాస్తవం ఏంటి? వృక్షశాస్త్రం ఏం చెబుతోంది? ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు?

వేసవిలో నేరేడు చెట్లు ఎక్కువ పండ్లు రాలిస్తే ఆ ఏడాది కరువు వచ్చే అవకాశం..ఈ వాదనను ఆధునిక వృక్షశాస్త్రం కూడా కొంతవరకూ సమర్ధిస్తోంది. దీనిని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. చెట్టు తన మనుగడ కన్నా ఎక్కువ విత్తనాలు, పండ్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిందంటే మనుగడ కోసం ప్రకృతి చేస్తున్న ప్రయత్నం అని చెబుతున్నారు వృక్షశాస్త్ర నిపుణులు.

మీ ఇంటి ఎంట్రన్స్ డోర్ లోపలకు తీసేలా ఉందా , బయటకు తీసేలా ఉందా?

వాతావరణంలో మార్పులకు సంకేతం

భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదంటే వాతావరణంలో భారీగా మార్పులు రాబోతున్నాయని చెట్టు గుర్తించినప్పుడు అది రక్షణ చర్యలోకి వెళుతుంది. తాను బతకలేకపోవచ్చు కానీ జాతి మనుగడ కొనసాగాలి అని తన శక్తినంతా కూడగట్టుకుని పండ్లలో, విత్తనాలలో పెట్టుబడిగా. ఇలాంటి సమయంలో కొత్త చిగుర్లు తక్కువగా వస్తాయ్..తన శక్తినంతా ఆదాచేసి పండ్లపై దృష్టి పెడుతుందన్నమాట.

భూగర్భ నీటిమట్టం తగ్గిందనే హెచ్చరిక
 
నేరేడు చెట్టుకి లోతైన వేర్లు ఉంటాయి. భూగర్భ జలమట్టం తగ్గినప్పుడు నీటి ఒత్తిడి ఏర్పడి ఇది హెచ్చరికకు సంకేతంగా మారుతుంది. అంటే రానున్న రోజుల్లో వేడి అధికంగా ఉండబోతోందని అర్థం. 

ఆధ్యాత్మిక దృక్పథంలో..

ప్రకృతి జీవశాస్త్రం మాత్రమే కాదు..అది ఆధ్యాత్మిక చక్రం కూడా. చెట్టు తన మనుగడ కన్నా జాతి మనుగడ ముఖ్యం అని త్యాగం చేయడం దైవిక సందేశం. ఇది సమర్పణ, పునరుత్పత్తి, మరణం , పునర్జన్మ చక్రాన్ని గుర్తుచేస్తుంది. 

ప్రకృతి గురువు బోధన

ఆధునిక శాస్త్రం కన్నా ముందే ఉన్న ప్రకృతి గురువు బోధన ఇది. అయితే ఈ సంవత్సరాన్ని సమృద్ధిగా ఆనందించాలి, అదే సమయంలో నీటి వనరులను సక్రమంగా వినియోగించాలనే హెచ్చరికను గుర్తుంచుకోవాలి. 

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏం ఇస్తామో అదే తిరిగి వస్తుంది.. ప్రకృతి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది..మనం ఏం ఇస్తే అదే తిరిగి అందిస్తుంది. ఓవరాల్ గా నేరేడు ఆత్మహత్య చేసుకోవడం లేదు..తన తర్వాతి తరాలు బతికేలా చివరి వరకూ ప్రయత్నిస్తోంది. ప్రకృతి చక్రంలో ఇదో అద్భుతం. ప్రకృతి వనరులను బాధ్యతగా కాపాడాల్సిన బాధ్యత మనపై కూడా ఉందని గుర్తుచేసే హెచ్చరిక ఇది.  

సంతాన భాగ్యం లేదా? ఈ 6 సులభమైన పరిహారాలు పాటిస్తే చాలు ఇంట్లో నవ్వుల్ విరబూస్తాయ్!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

Frequently Asked Questions

ఈ ఏడాది నేరేడు పండ్లు ఎక్కువగా కాయడానికి కారణం ఏమిటి?

వృక్షశాస్త్ర నిపుణుల ప్రకారం, దీనిని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. చెట్టు తన మనుగడ కన్నా జాతి మనుగడ కోసం ఎక్కువ పండ్లు ఉత్పత్తి చేస్తుంది.

నేరేడు పండ్ల అధిక దిగుబడి దేనిని సూచిస్తుంది?

ఇది వాతావరణంలో మార్పులు లేదా భూగర్భ జలాలు తగ్గుతున్నాయని సూచిస్తుంది. రానున్న రోజుల్లో కరువు లేదా అధిక వేడి ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది.

నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే కరువు వస్తుందనే మాట నిజమేనా?

అవును, ఈ వాదనను ఆధునిక వృక్షశాస్త్రం సమర్ధిస్తుంది. ఇది కరువు వచ్చే అవకాశం ఉందని, అలాగే భూగర్భ జలమట్టం తగ్గుతుందని హెచ్చరిస్తుంది.

నేరేడు పండ్ల అధిక దిగుబడి గురించి ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు?

చెట్టు జాతి మనుగడ కోసం త్యాగం చేయడం దైవిక సందేశం. ఇది సమర్పణ, పునరుత్పత్తి, మరణం, పునర్జన్మ చక్రాన్ని గుర్తుచేస్తుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget