ఆమడ దూరం ఒకప్పుడు దూరాన్ని కొలిచేందుకు వాడిన పదం. ఇది 4 క్రోసులు లేదా 8 మైళ్లకు సమానం, అంటే సుమారు 13 కిలోమీటర్లు.
'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?
Amada Duram : ఆమడ దూరం అనే మాట విన్నారా ఎప్పుడైనా? దూరానికి కొలమానంగా ఆమడ దూరం అని చెబుతుంటారు. ఇంతకీ ఆమడ దూరంలో ఆమడ అంటే ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది?

- ఆమడ దూరం పూర్వం వాడిన 13 కిలోమీటర్ల కొలత.
- ఈ కొలత నాలుగు క్రోసులు, కేక వినిపించే దూరం.
- ఇది అలసట, లక్ష్య సాధన, అంతరాత్మ ప్రయాణం సూచిస్తుంది.
- ఆమడ నేటికీ భావంగా నిలిచి తెలుగు సంస్కృతిని తెలుపుతుంది.
Amada Duram Meaning: ఆమడ దూరం.. ఈ పదాన్ని ఒకప్పుడు దూరాన్ని కొలిచేందుకు వినియోగించేవారు. బ్రిటీష్ పాలనకు ముందు తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వాడేవారు. ఆధనిక భాషలో ఇది చాలా దూరం అని అర్థం. కానీ కచ్చితమైన కొలతలు, ప్రామాణిక లెక్కల ప్రకారం..
ఆమడ దూరం - 4 క్రోసులు
క్రోసు - 2 మైళ్లు
2 మైళ్లు - 3.2 కిలోమీటర్లు
ఆమడ అంటే 8 మైళ్లు లేదా 13 కిలోమీటర్ల దూరం
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పాత నిఘంటువు ప్రకారం ఆమడ దూరం అంటే 8 లేదా 10 మైళ్లు అని ఉంది. ప్రాంతీయ వ్యత్యాసాల వల్ల కొంత వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 13 కిలోమీటర్ల దూరం అని అర్థంచేసుకుంటారు.
పురాణ అస్త్రాల రహస్య శక్తి! ధర్మ మార్గం, విశ్వ రహస్యాలు!
ఆమడదూరం అనే పదం ఎలా ఆవిర్భవించింది?
ఆమడ అనేది తెలుగు స్థానిక పదం..ఇది సంస్కృతం నుంచి నేరుగా రాలేదు. భారతీయ కొలత వ్యవస్థలో భాగం. క్రోసు అనే పదం క్రోశం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది..క్రోసు అంటే ఓ మనిషి కేక వినిపించే దూరం. ఆరోగ్యవంతుడైన వ్యక్తి పెద్దగా అరిస్తే..ఆరోగ్యవంతుడైన వ్యక్తికి వినిపించే దూరం. అలా ఆమడ దూరం ఈ క్రోసుల మీద ఆధారపడింది. 4 క్రోసులు ఒక ఆమడ. బ్రిటీష్ రాకముందు వరకూ వాడిన కొలత ఇది. గ్రామాల మధ్య దూరం, ప్రయాణాలు చెప్పేటప్పుడు రెండు ఆమడల దూరం అనే పదం వినియోగించేవారు.
బ్రౌన్ నిఘంటువులో స్పష్టంగా...“The greatest Telugu measurement of extent, equal to four coss, or about eight English miles.”
పాత సాహిత్యంలో, కథల్లో, మాటల్లో...ఇది అలసట కలిగించే దూరంగా కూడా వాడారు. ప్రతి అడుగు ఆమడగా అనిపించిందనేవారు. అంటే చాలా అలసిపోయినట్టు అర్థం.
ఇతర పురాతన కొలతలతో పోల్చితే...దీన్నే యోజనం అనేవారు
సాధారణంగా 4 క్రోసుల దూరం అంటే ఒక యోజనం
యోజనం అంటే 8 నుంచి 15 కిలోమీటర్ల దూరం మధ్య మారుతుంది
కొన్ని సంప్రదాయాల్లో ఆమడను యోజనంతో సమానంగా చెప్తారు
ఇతర కొలతలు - అంగుళం, జాన, మూర, బార, దండం, క్రోసు, ఆమడ/యోజనం
ఆధ్యాత్మిక దృష్టిలో..
ఆమడ అంటే 13 కిలోమీటర్ల దూరం మాత్రమే..కానీ ఆధ్యాత్మికంగా ఇది లోతైన అర్థం కలిగి ఉంది. పురాణాలు, రామాయణం, మహాభారతంలో దూరాన్ని యోజనాల్లో చెప్పారు. రాముడు అరణ్యవాసం, హనుమంతుడు సముద్ర లంఘనం అన్నీ యోజనాల్లో చెప్పారు. ఇది కేవలం భౌతిక దూరాలు కావు..శ్రమను, సహనాన్ని అంతరాత్మ ప్రయాణాన్ని సూచిస్తాయి.
ఆమడదూరం నడవడం అంటే శరీరం అలసిపోయేంత అని అంచనా. జీవితంలో లక్ష్యాలు, సాధన, ఆత్మజ్ఞానం కూడా ఓ ఆమడదూరంలా అనిపిస్తాయ్. కానీ నడుస్తుంటే ప్రతి అడుగు ఓ అనుభవం అవుతుంది, పాఠం నేర్పిస్తుంది. వేదకాలం నుంచి కొలతలు ప్రకృతి, మనిషి, దైవం మధ్య సమతుల్యతను చూపించేవి అవుతాయ్.
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
ఆమడ అనేది మనిషి సామర్థ్యానికి అనుగుణంగా ఉన్న కొలత. దూరం ఎంతైనా కానీ నడవడం ముఖ్యం. ఆధునిక కాలంలో ఇప్పుడు మనం కిలోమీటర్లు, మైళ్లు అనే పదాలు వాడుతున్నాం..కానీ ఆమడదూరం అనే మాట ఇంకా జీవించి ఉంది. ఎందుకంటే అది సంఖ్య కాదు ఓ భావం. ఒక పాత మాట జీవించి ఉండడం అంటే ఆ భాష, సంస్కృతి బలంగా ఉందని అర్థం.
Frequently Asked Questions
ఆమడ దూరం అంటే ఏమిటి?
ఆమడ అనే పదం ఎలా ఆవిర్భవించింది?
'ఆమడ' అనేది తెలుగు స్థానిక పదం, సంస్కృతం నుండి నేరుగా రాలేదు. ఇది భారతీయ కొలత వ్యవస్థలో భాగం, 4 క్రోసులకు ఒక ఆమడగా లెక్కించబడుతుంది.
ఆధ్యాత్మికంగా ఆమడ దూరానికి అర్థం ఏమిటి?
భౌతికంగా 13 కిలోమీటర్లు అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా ఇది శ్రమను, సహనాన్ని సూచిస్తుంది. జీవిత లక్ష్యాలు, ఆత్మజ్ఞానం ఆమడ దూరంలా అనిపిస్తాయి, ప్రతి అడుగు అనుభవం నేర్పుతుంది.
ఆమడ దూరాన్ని యోజనంతో పోల్చవచ్చా?
అవును, కొన్ని సంప్రదాయాల్లో ఆమడను యోజనంతో సమానంగా చెప్తారు. సాధారణంగా 4 క్రోసులు ఒక యోజనం అవుతుంది, ఇది 8 నుండి 15 కిలోమీటర్ల మధ్య మారుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























