Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 25 May 2022: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
మే 25 బుధవారం రాశిఫలాలు
మేషం
అనవసర మాటలు నియంత్రించండి. కార్యాలయ వాతావరణంలో క్రమశిక్షణతో ఉండండి. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. మంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. కొందరు మానసికంగా బలహీనంగా ఉంటారు. ఈరోజు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోకండి. పనిలో మీ నైపుణ్యం పెరుగుతుంది.
వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద బాధ్యతను పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఎవ్వరినీ విమర్శించవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మిత్రులను కలుస్తారు.
మిథునం
ఈరోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మీ కెరీర్‌కు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. వైవాహిక సంబంధాల్లో సంతోషం పెరుగుతుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైవాహిక జీవితానికి సంబంధించి కొంత ఆందోళన ఉండవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించండి. తెలియని వ్యక్తులు హాని కలిగించవచ్చు.
Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
కర్కాటకం
ఈరోజు పని లేకపోవడం వల్ల చిరాకు ఉంటుంది. ఎవరితోనైనా వివాదాం రావొచ్చు. మీ ఆస్తిని రక్షించుకోండి. అదనంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు కలగవచ్చు. బంధుమిత్రులతో సమావేశం అవుతారు. ప్రమాదకర పనిలో జాగ్రత్తగా ఉండండి.
సింహం
రాజకీయాల్లో ఉన్న వ్యక్తులను కలుస్తారు.తలపెట్టిన పని ముందుకు సాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపారంలో రిస్క్ తీసుకుంటేనే సక్సస్ ఉంటుంది. బాధ్యతలు నిర్వర్తించడంలో అససత్వం వద్దు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కన్యా
కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. స్నేహితుడితో విభేదాలు రావచ్చు. మీరు కార్యాలయంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. మీరు వ్యాపారానికి సంబంధించిన రాబోయే ప్రణాళికలపై పని చేస్తారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. మీ సంపద పెరుగుతుంది.
తుల
ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తి పెరుగుతుంది. మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయాల్సి రావొచ్చు. ఈ రోజు మీరు సానుకూల శక్తితో నిండి ఉంటారు. ప్రేమికుల మధ్య ప్రేమ బంధం దృఢంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి ఏదీ దాచవద్దు. అర్ధంలేని చర్చలో భాగం కావద్దు.
Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
వృశ్చికం
ఈ రోజంతా హడావుడి ఉంటుంది. కుటుంబంలో ఒక పెద్ద సంఘటన జరగడం వల్ల అలసిపోతారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. తలపెట్టిన పని అసంపూర్తిగా ఉండిపోతుంది. వ్యక్తిగత సంబంధాలపై నమ్మకం పెరుగుతుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
ధనుస్సు
తెలివైన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరివల్లైనా మీరు హానిజరగొచ్చు. ఆధ్యాత్మికతపై మనసు నిమగ్నమై ఉంటుంది. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది. మీరు పాత అనుభవాల నుంచి ప్రయోజనం పొందుతారు. నూతన గృహం కొనుగోలు చేసేందుకు ఇదే శుభసమయం. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
మకరం
కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అసమ్మతి కారణంగా కార్యాలయంలో పని దెబ్బతింటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక మీరు మతపరమైన ప్రయాణం చేయవచ్చు. వ్యాపారంలో వస్తున్న అడ్డంకులను నిర్భయంగా తొలగించుకోగలుగుతారు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు.
కుంభం
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. మీరు కొత్త పని పట్ల చాలా ఆసక్తిని కనబరుస్తారు. మీరు కార్యాలయంలో సహోద్యోగుల సహాయం పొందుతారు. కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడండి. ఏ సమస్య వచ్చినా మనసులో టెన్షన్ ఉంటుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మీనం
ఎప్పటినుంచో నిలిచిపోయిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో తెలియని వ్యక్తులను వెంటనే నమ్మవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో విమర్శలను ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించండి.
Also Read: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!