అన్వేషించండి

Marriage In Hinduism: పెళ్లి చేసుకోకపోతే స్వర్గంలోకి నో ఎంట్రీ? వేదాలు, పురాణాలు ఏం చెప్పాయ్?

Spiritualists Brahmacharis:పెళ్లి చేసుకోపోతే స్వర్గంలోకి ఎంట్రీ ఉండదా? ఇది నిజమేనా? పురాణాల్లో ఏముంది? దీనివెనుకున్న ఆంతర్యం ఏంటి? ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు? తెలుసుకోండి..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రతి మనిషి మూడు రుణాలతో పుట్టి పెళ్లి ద్వారా తీర్చాలి.
  • వంశాభివృద్ధికి, పితృకర్మలకు వివాహం, సంతానం అవసరం.
  • నిస్వార్థ కర్మలు, భగవద్భక్తితో వివాహం లేకుండా మోక్షం సాధ్యం.
  • స్వర్గ-నరకాలు వివాహంపై కాదు, ఆచరించే కర్మలపై ఆధారపడి ఉంటాయి.

Marraige: ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లంటే నో అనే వారి సంఖ్య పెరుగుతోంది. డేటింగ్ కల్చర్ రావడంతో పెళ్లి, పిల్లలు, బాధ్యతలంటే ఓ అడుగు వెనక్కే వేస్తున్నారు. ఏదో ఒక తోడుంటే చాల్లే అనుకుంటున్నారు. అయితే పెళ్లెందుకు చేసుకోవాలి? చేసుకోపోతే ఏమవుతుందో మీకు తెలుసా?

28-06-2026 ఆదివారం మీ రాశిఫలాలు!

పెళ్లి అంటే ఉత్సవం కాదు..ప్రతి వ్యక్తి జీవితంలో అనుసరించాల్సిన 16 సంస్కారాలలో ప్రధానమైనది. సానపెట్టడం వల్ల వజ్రం ప్రకాశించినట్టు సంస్కారాలు పూర్తిచేస్తేనే ఆత్మ ప్రకాశిస్తుంది. ఈ జన్మకో సార్థకత లభిస్తుంది. 

Marriage In Hinduism: పెళ్లి చేసుకోకపోతే స్వర్గంలోకి నో ఎంట్రీ? వేదాలు, పురాణాలు ఏం చెప్పాయ్?

పెళ్లెందుకు చేసుకోవాలి?
 
భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి మూడు రుణాలతో పుడతాడు... 

1. ఋషిఋణం ,  2. దేవఋణం,  3. పితౄణం

ఈ మూడు రుణాలు అందరూ తీర్చాల్సిందే..లేదంటే మరో జన్మ తప్పదు. మానవ జన్మకు సార్థకత ఉండదు. అందుకే ఈ మూడు రుణాల నుంచి విముక్తి లభించాలంటే పెళ్లిచేసుకోవాల్సిందే.  

"బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" 

" యజ్ఞేన దేవేభ్యః" 

"ప్రజయా పితృభ్యః" 

ఏలినాటి శని 2027 హెచ్చరిక! 2 రాశులవారికి భయం - ఓ రాశి వారికి అభయం , పవర్‌ఫుల్ రెమెడీస్

ఋషి ఋణం

బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం చేయడం ద్వారా ఋషి ఋణం తీర్చుకోవాలి. నిత్యం దైవారాధనలో ఉండాలి, గురువులను పూజించాలి, పురాణాలను అధ్యయనం చేసి తర్వాత తరానికి అందించాలి

దేవఋణం

యజ్ఞ యాగాలు చేయడం ద్వారా దేవరుణం తీరుతుంది. యజ్ఞం వల్ల దేవతలు తృప్తి చెందుతారు, సకాలంలో వానలు కురిపిస్తారు, పంటలు వృద్ధి చెందుతాయి, కరువు తొలగిపోతుంది. నీరు గాలి వెలుగు ఆహారం ప్రసాదించే దేవతల రుణం తీర్చుకోవడమే దేవరుణం
 
పితౄణం

మంచి సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణం తీరుతుంది. వంశాన్ని కొనసాగించేందుకు, పతృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానానికి జన్మనివ్వాలి. సంతానం కలగాలంటే వివాహం తర్వాతే ..."ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అని చెబుతుంది వేదం. అంటే   వంశపరంపరను తెంచేయవద్దని అర్థం. పున్నామ నరకం నుంచి తప్పించుకుని ఉత్తమ గతులు లభించాలంటే సంతానం ఉండాలని చెబుతోంది వేదం.

Marriage In Hinduism: పెళ్లి చేసుకోకపోతే స్వర్గంలోకి నో ఎంట్రీ? వేదాలు, పురాణాలు ఏం చెప్పాయ్?

పెళ్లి చేసుకోకుంటే స్వర్గంలో ఎంట్రీ ఉండదా?

నైష్ఠిక బ్రహచర్యం - పెళ్లి చేసుకోకుండా జీవితాంతం భగవంతుడి చింతలో , సమాజ సేవలో గడిపేవారిని నైష్ఠిక బ్రహ్మచారులు అంటారు. భీష్ముడు, హనుమంతుడు, ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద వీరు ఈ కోవకు చెందుతారు..వీరంతా ఉత్తమ గతులు పొందినవారే. ఒక వ్యక్తి తన కర్మలను  స్వార్థం లేకుండా ఆచరిస్తూ , భగవంతుడిపై పరిపూర్ణ భక్తిని కలిగి ఉంటే వారికి పెళ్లితో సంబంధం లేకుండా మోక్షం సిద్ధిస్తుందని చెబుతోంది భగవద్గీత
 
కేవలం శారీరక సంబంధం కోసం కాదు.. మనస్సును వికసింపజేసుకోవడానికి పెళ్లి  సాధన మాత్రమే..ఆ మనసును నేరుగా భగవంతుడిపై లగ్నం చేస్తే వారికి వివాహం అవసరం లేదు..స్వర్గంలో చోటు దక్కకపోవడం ఉండదు.
 
అందుకే.. పెళ్లి చేసుకోపోతే స్వర్గం ఉండదు అనే నియమం... సాధారణ సంసార జీవితం గడపాలి అనుకునేవారి, బాధ్యతల నుంచి పారిపోయేవారికి హెచ్చరిక. కానీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి..సమాజానికి మంచి చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే వారికి స్వర్గమే కాదు మోక్షం కూడా సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. స్వర్గం-నరకం అనేవి మనం ఆచరించే కర్మల ఆధారంగా ఉంటాయి కానీ వివాహంపై కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు.

మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Frequently Asked Questions

పెళ్లి చేసుకోవడం వల్ల జీవితానికి ఎలాంటి ప్రాముఖ్యత వస్తుంది?

వివాహం 16 సంస్కారాలలో ఒకటి. ఇది ఆత్మను ప్రకాశవంతం చేస్తుంది, జన్మకు సార్థకతను ఇస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరు తీర్చాల్సిన మూడు ఋణాలలో (పితౄణం) ఒకటి తీర్చడానికి కూడా ఇది అవసరం.

పురాణాల ప్రకారం మానవుడు తీర్చాల్సిన మూడు రుణాలు ఏమిటి?

ఋషిఋణం వేదాధ్యయనం ద్వారా, దేవఋణం యజ్ఞయాగాదుల ద్వారా, పితౄణం మంచి సంతానాన్ని కనడం ద్వారా తీరుతాయి. ఈ రుణాలు తీరిస్తేనే మానవ జన్మకు సార్థకత లభిస్తుంది.

పెళ్లి చేసుకోకపోతే స్వర్గంలోకి ప్రవేశం ఉండదా?

లేదు. స్వార్థం లేకుండా కర్మలు చేస్తూ, భగవంతుడిపై పరిపూర్ణ భక్తి ఉంటే మోక్షం సిద్ధిస్తుంది. నైష్ఠిక బ్రహ్మచారులైన భీష్ముడు, శంకరాచార్యుల వంటివారు కూడా మోక్షం పొందారు.

నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే ఏమిటి?

పెళ్లి చేసుకోకుండా, జీవితాంతం భగవంతుడి చింతలో, సమాజ సేవలో గడిపేవారిని నైష్ఠిక బ్రహ్మచారులు అంటారు. వీరు పెళ్లితో సంబంధం లేకుండా మోక్షాన్ని పొందుతారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget