అన్వేషించండి

Dussehra 2025 Day 7: నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజు కాళరాత్రి దుర్గగా శ్రీశైల భ్రమరాంబిక - ఈ రూపం విశిష్టత, పూజా విధానం!

Kushmanda Durga Alankaram : శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నవదుర్గలుగా దర్శనమిచ్చే శ్రీశైల భ్రమరాంబిక ఏడో రోజు కాళరాత్రి దుర్గగా దర్శనమిస్తోంది.

Srisailam Shardiya Navratri 2025: శ్రీశైలంలో శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  భ్రమరాంబిక నవదుర్గల అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఉత్సవాల్లో మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంట, నాలుగో రోజు కూష్మాండ, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయనిగా  దర్శనమిచ్చిన భ్రమరాంబిక సెప్టెంబర్ 28 ఏడో రోజు కాళరాత్రి దుర్గగా అభయం ఇస్తోంది.  

కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్‌
కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్‌ మాలావిభూషితామ్‌॥

గార్ధభ వాహనం

దట్టమైన చీకటితో సమానంగా ప్రకాశించే నల్లని దేహం

విరబోసుకున్న కేశాలు

వెలుగుతున్నట్టుండే కళ్లు

విద్యత్ కాంతితో సమానంగా ప్రకాశించే కంఠహారం

ముక్కుపుటాల నుంచి చెలరేగే అగ్నిజ్వాలలు 

రెండు చేతుల్లో వడి తిరిగిన ఖడ్గం, కంటకం

మరో రెండు చేతులతో అభయ, వర ముద్రలు 
 
చూడగానే భయంకలిగించే రూపం కాళరాత్రి 

రూపంతో భయపెట్టే కాళరాత్రి దుర్గ..మనసులో ఉండే భయాలను తొలగించే చల్లని తల్లిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తలుచుకుంటే చాలు నెగెటివ్ ఎనర్జీ దరిచేరదు 

దుర్గాదేవి రాక్షసులను ఎదిరించినప్పుడు ఆమె బంగారువర్ణ చర్మం తొలగిపోయి  భీకర రూపంతో ఉద్భవించిందట. కాళరాత్రి అంటే చీకటి, భయంకరమైనది అని అర్థం. దుష్టశక్తులను వశం చేసుకునే కాళరాత్రి భక్తుల భయాలను దూరం చేయడంతో పాటూ సకల శుభాలు కలిగిస్తుంది. 
శని గ్రహాన్ని పాలించే ఈ దుర్గను పూజిస్తే జాతకంలో ఉండే శనిప్రతికూల ప్రభావం తగ్గుతుంది.

వామ్ పాడొల్ల సల్లోహలతా కణ్టక భూషణా | 
వర్ధన మూర్ధ ధ్వజా కృష్ణ కాళరాత్రి భార్యంకరీ || 

కాళరాత్రి రూపం చూసేందుకు భయంకరంగా ఉంటుంది కానీ ఎప్పుడూ శుభాలనే కలిగిస్తుంది. అందుకే కాళరాత్రి దుర్గను శుభంకరీ అని పిలుస్తారు. నవరాత్రుల్లో ఏడోరోజు సాధకుడి మనసు సహస్రార చక్రంలో ఉంటుంది. ఈ చక్రంలో సాధకుడి మనసు పూర్తిగా కాళరాత్రి స్వరూపంపై స్థిరమవుతుంది. దుష్టశక్తులను దునుమాడే కాళరాత్రి దుర్గను పూజిస్తే నీరు, నిప్పు, జంతు భయం ఉండదని చెబుతారు.  

కాళి
కాళరాత్రి 
వేర్వేరు అనుకుంటారు..కానీ  కాళి, కాళిక, కాళరాత్రి అన్నీ ఒకటే.  ఈ దుర్గ ఆరాధనలో ఎక్కువగా వామాచార ప్రాధాన్యం ఉంటుంది. అయితే జాతకంలో గ్రహసంచారం బాగాలేనివారు కాళరాత్రి దుర్గను పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది.   

నవ దుర్గా స్తోత్రం

గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥

దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥

దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

దేవీ స్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దేవీ కాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥

దేవీ కాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ 
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥

దేవీ మహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥

దేవీ సిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

 దసరా నవరాత్రులు సందర్భంగా ఆంధ్ర & తెలంగాణలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ఆలయాలు ఇవే!

 శ్రీ చక్రంలో వివిధ దేవతలను స్తుతిస్తూ సాగే శక్తివంతమైన స్తోత్రం - నవరాత్రుల్లో ఒక్కసారైనా పఠించండి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
Advertisement

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget