మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా? కుబేరుడు ఎల్లప్పుడూ మీ వెంటే!
కుటుంబంలోకి కొత్త సభ్యుల రాగానే అంతా అదృష్టాన్నిచ్చే పేరు పెట్టేందుకు ఆరాట పడతారు. అలా వెతికి వెతికి పేర్లు పెడతారు.
హిందీలో ఒక నానుడి ఉంది.. ‘‘నసీబ్ సే నామ్ మిల్తా హై, నామ్ సే నసీబ్ బన్తా హై’’ అని. అంటే ‘‘అదృష్టవంతులకే పేరొస్తుంది. పేరుతోనే అదృష్టం దక్కుతుంది’’ అని అర్థం. అందుకే బిడ్డ పుట్టగానే అంతా అదృష్టాన్నిచ్చే పేరు పెట్టేందుకు ఆరాట పడతారు. ఇది వరకు రోజుల్లో దేవుళ్ల పేర్లు పెట్టుకుని.. అది పిలిచిన ప్రతి సారి భగవన్నామ స్మరణ చేసుకున్నట్టు ఉంటుందని భావించేవారు. పిల్లలకు ఎక్కువగా దేవుళ్ల పేర్లే పెట్టుకునే వారు. ఈ మధ్య చాలా ట్రెండీగా పెర్లు పెడుతున్నారు. ఎంత ట్రెండీగా పెట్టినప్పటికీ పుట్టిన సమయాన్ని బట్టి అదృష్టం తెచ్చే పేరే కావాలని అనుకుంటారు అందరూ అనేది కాదన లేని విషయమే. బిడ్డకు పెట్టే పేరు ట్రెండీగానూ, అరుదుగానూ, అదృష్టం తెచ్చేదిగానూ ఉండాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. అందుకే, నక్షత్రాన్ని బట్టి అక్షరాన్ని ఎంచుకుని మరీ పేర్లను పెడుతుంటారు. అయితే, జ్యోతిష్య నిపుణులు మాత్రం కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు అదృష్టాన్ని తెస్తాయని చెబుతున్నారు. అదృష్టం ఇచ్చే పేర్ల గురించి పండితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
వైదిక జ్యోతిష్యం అందించే వివరాలను బట్టి వ్యక్తి పేరులోని మొదటి అక్షరం అతని స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుందట. పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి అతడి అదృష్టం ఆధారపడి ఉంటుంది. పుట్టిన తేది, సమయం, స్థలాన్ని బట్టి అతడి రాశిని శాస్త్ర ప్రకారం నిర్ణయిస్తారు. జ్యోతిషం ప్రకారం పేరు అదృష్టానికి ఒక కారణం అవుతుంది కూడా. వర్ణమాలలోని కొన్ని అక్షరాల మీద కుబేరుడికి అపారమైన ఆశీర్వాదం ఉంటుందట. అలాంటి వారికి అసలు ఆర్థిక సమస్యలే ఉండవట. వారు రాజుల్లా బతికేస్తారట.
- శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి Aతో పేరు మొదలైన వారు చాలా అదృష్టవంతులు. వీరికి ఆత్మగౌరవం మెండుగా ఉంటుంది. కష్టపడి పనిచేసే తత్వం కూడా ఉంటుంది. ఫలితంగా ఏరంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి వెళ్తారు. కుబేరుడికి వారి మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. అందువల్ల వీరికి పెద్దగా ఆర్థిక కష్టాలు ఉండవు.
- S అక్షరంతో పేరు మొదలయ్యే వారు అంకిత భావంతో కష్టించి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. కనుక వీరికి అదృష్టం వెన్నంటి ఉంటుంది. కుబేరుడి ఆశిస్సులు కూడా ఉంటాయి కనుక కష్టాలు పెద్దగా వీరిని ఇబ్బంది పెట్టవు.
- జ్యోతిషాన్ని అనుసరించి కొంత మందిలో కొత్త విషయాలు తెలుసుకోవడంలో చాలా కోరిక ఉంటుది. అలాంటి వారి పేరు p అనే అక్షరంతో మొదలయి ఉంటుంది మీరు గమనిస్తే. వీరు చాలా తెలివైన వారై ఉంటారు. కుబేరుడి అనంతమైన ఆశీర్వచనాలు వీరి మీద ఉంటాయ. జీవితంలో ఏరోజునా వీరికి డబ్బుకు లోటుండదు.
Also read : వినాయకుడి ‘స్వస్తిక్’ చిహ్నానికి ఉన్న పవర్స్ గురించి మీకు తెలుసా?