అన్వేషించండి

Naag Panchami 2024 : పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!

Naag Panchami 2024: శ్రావణమాసంలో నాగపంచమి, కార్తీకమాసంలో నాగులచవితి వచ్చిదంటే చాలు నాగపూజలో మునిగితేలుతారు. ఇంతకీ అసలు పాలు ఎందుకు పోస్తారు... దీనివెనుకున్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా...

Health Benefits of Worshipping Naga Devata :  ఆగష్టు 08 గురువారం నాగులచవితి...సూర్యోదయం సమయానికి చవితి ఉంది..అందుకే నాగుల చవితి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు.. ఆ మర్నాడు...ఆగష్టు 09 శుక్రవారం గరుడపంచమి వచ్చింది...  ఈ రోజు పుట్టల దగ్గర భారీగా చేరి పాలు పోసి భక్తులు పూజలు చేస్తుంటారు. అసలు పుట్టలో పాలెందుకు పోయాలి? పుట్టవరకూ ఎందుకు వెళ్లాలి? దీనివెనుకున్న ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా...

సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్
జనమేజయ యాగాంతే ఆస్తిక వచనమ్!
అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తేనమః
నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయేనమః
అనంతో వాసుకిం శేషం తక్షకః గుళికస్తథా!

Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!

మానవ మనుగడకు జీవనాధారం అయిన ప్రకృతిని దైవస్వరూపంగా భావిస్తారు. అందుకే పూర్వీకుల నుంచి ... చెట్టు, పుట్ట, రాయి, నదులు, పర్వతాలు, కొండలు సహా సమస్త ప్రాణికోటిని పూజించేవారు. హిందువుల పండుగలలో విశిష్టత ఇదే. ఇందులో భాగమే నాగుల చవితి, నాగపంచమి రోజు పుట్టలో పాలుపోయడం కూడా. అయితే పుట్టలో పాలు పోయడం వెనుక శాస్త్రీయ కారణాలున్నాయని మీకు తెలుసా...
 
పుట్టలను చెదపురుగులు, చీమలు నిర్మిస్తాయి. ఆ సమయంలో వాటి నోటి నుంచి సుక్రోజ్ అనే జిగట పదార్థం వెలువడుతుంది. ఆ తడితోనే పుట్టగోడలు నిర్మితమవుతాయి..కొంతకాలానికి గట్టిగా తయారవుతాయి. ఆ తర్వాత అందులో పాములు చేరి నివాసం ఉంటాయి. పుట్టలో పాలు పోసినప్పుడు ఆ మట్టి తడవడం వల్ల మంచి వాసన వస్తుంది. బయట మట్టిని తడిపినప్పుడు వచ్చే వాసన కన్నా పుట్టలు తడిసినప్పుడు వచ్చే వాసన భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మట్టిలో చెదపురుగుల నుంచి వెలువడిన సుక్రోజ్ గాల్లో కలిసి వాసన రూపంలో బయటకు వస్తుంది . ఆ గాలి పీలిస్తే  మహిళలలో సంతాన సంబంధిత సమస్యలు తొలగిపోతాయంటారు. పూర్వకాలంలో సంతాన లేనివారు ప్రత్యేకంగా పుట్టలకు పూజలు చేసి..ప్రదక్షిణలు చేయడం ద్వారా సంతాన సంబంధిత దోషాలు తొలగి పోయేవని చెప్పేవారు.

Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!

 పాలు పోసిన తర్వాత సాధారణంగా పుట్ట దగ్గర మట్టి తీసుకుని ఇంటికి తీసుకొస్తారు. చెవులకు, మెడకు ఆ మట్టిని పెడతారు. దాన్ని పుట్ట బంగారం అని పిలుస్తారు...ఆ మట్టి రాసుకుంటే బంగారం ఆభరణాలొస్తాయంటారు...కానీ ఆ మట్టిని చెవులకు రాసుకోవడం వల్ల వినికిడి సమస్యలు రావని శాస్త్రీయకారణం. పాముని పూజించడం కన్నా పుట్టని పూజించడం వెనుకే అసలైన విశిష్టత ఉందటారు. ఎవరిలో ఎలాంటి దోషాలు ఉంటాయో తెలియదు ...అందుకే ఏడాదికోసారి పుట్ట దగ్గరకు వెళ్లి పూజిస్తే ఆ దోషాలన్నీ మనకు తెలియకుండా నశిస్తాయని శాస్త్రవచనం. అందుకే ఇంట్లో ఉండే పెద్దల నుంచి చిన్నపిల్లల వరకూ అందరూ కలసి పుట్టదగ్గరకు వెళ్లి పూజలు చేయాలంటారు. 

 కొత్తగా ఏర్పడిన పుట్టలు, పొలాల్లో ఉండే పుట్టలు పూజించడం ఉత్తమం. అందరూ పోటీ పడి ఓ పుట్ట దగ్గరే పూజలు చేస్తే ఫలితం తక్కువ ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే..పుట్ట తడిస్తే మంచిది అన్నారుకదా అని గిన్నెలకొద్దీ పాలుపోయడం, గుడ్లు వేసేయడం లాంటివి చేసి లోపలపున్న జీవులకు హానికలిగించడం సరికాదంటారు.

Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!

ఆగష్టు 08 గురువారం నాగులచవితి...సూర్యోదయం సమయానికి చవితి ఉంది..అందుకే నాగుల చవితి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు.. ఆ మర్నాడు...ఆగష్టు 09 శుక్రవారం గరుడపంచమి వచ్చింది... 

గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget