Margashirsha Purnima 2025: డిసెంబర్ 4 అత్యంత శక్తివంతమైన రాత్రి, ఈ రోజు చేసే సాధనతో 2 కోరికలు నెరవేరుతాయి!
Margashirsha Purnima Special:మార్గశిర పూర్ణిమ 2025 డిసెంబర్ 4న వచ్చింది. ఇంగ్లీష్ నెలల ప్రకారం ఇదే చివరి పూర్ణిమ. ఈ రోజు చేసే సాధనతో రెండు కోరికలు నెరవేరుతాయట...

Margashirsha Purnima 2025: హిందూ ధర్మంలో పూర్ణిమ తిథి అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం మార్గశిర్ష పూర్ణిమ, గురువారం, డిసెంబర్ 4, 2025వచ్చింది. చంద్రోదయ సమయం గురించి చెప్పుకుంటే డిసెంబర్ 04 గురువారం ఉదయం 8 గంటల 37 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 5న ఉదయం 4 గంటల 43 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యాస్తమయ సమయానికి పౌర్ణమి ఉండడం ప్రధానం. అందుకే డిసెంబర్ 04 మార్గశిర పౌర్ణమి. ఈ రోజున ఒక ప్రత్యేక సాధన చేయడం ద్వారా జీవితంలోని రెండు కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
డిసెంబర్ 4, 2025, గురువారం రాత్రి సాధారణ రాత్రి కాదు, ఇది ఒక దివ్య రాత్రి...ఈ రోజు విశ్వంలో రెండు అత్యంత శుభ యోగాలు ఒకేసారి ఏర్పడతాయి. రెండు ప్రధాన కోరికలు కలిగిన ఒక యోగం, దీని ద్వారా మీరు మీ జీవితంలోని అసంపూర్తిగా ఉండిపోయిన ధర్మబద్ధమైన రెండు ప్రధాన కోరికలను నెరవేర్చుకోవచ్చు.
డిసెంబర్ 4 గురువారం నాడు ఆకాశం ప్రశాంతంగా, చల్లగా, కాంతితో నిండినప్పుడు.. పూర్ణిమ చంద్రుడు ఉదయించినప్పుడు, మీరు ఒక సాధారణమైన కానీ అత్యంత ప్రయోజనకరమైన సాధన చేయాలి. ఈ సాధన మీ జీవితంలోని తీరని, ధర్మబద్ధమైన 2 కోరికలను నెరవేరుస్తుంది.
దీని కోసం, మొదట ఓ గ్లాసులో నీరు నింపండి. ఆ గ్లాస్ పట్టుకుని చంద్రుడి చూస్తూ నిల్చోండి. మీ మనస్సు , మెదడును ప్రశాంత స్థితిలో ఉంచండి. మీ మనస్సులో మీ 2 కోరికలను స్పష్టంగా చెప్పండి. సాధన చేసేటప్పుడు మీ భావన ఎంత చురుకుగా ఉంటే, ఈ శక్తి మీ జీవితంలో అంత త్వరగా ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. అనంతరం మరో గ్లాస్ లో నీటిని తీసుకుని ఈ విధంగానే చేసి.. చంద్రుని చల్లని వెలుగులో ఆ నీటిని తాగండి. ఇది సంవత్సరం చివరి అత్యంత ప్రభావవంతమైన పూర్ణిమ. ఇది కోల్డ్ మూన్, ఇది కోరికలను నెరవేర్చడానికి చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
క్షీరోదార్ణవ సంభూత ! అత్రినేత్ర సముద్భవ !
గృహాణార్ఘ్యం మయా దత్తం చంద్ర ! మార్గశిరే శుభే ‖
నవగ్రహంలో స్తోత్రంలో చంద్రుడి శ్లోకం
దధిశంఖతుషారాభం క్షీరార్ణవ సంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణమ్ ||
పెరుగు, శంఖం, మంచు వలె తెల్లనైన వానికి, పాల సముద్రంలో పుట్టిన వానికి,, శశి (చంద్రుడు), సోముడు అని పిలువబడే వానికి,, శంభు (శివుడు) మకుటంలో ఆభరణంగా ఉన్న వానికి నమస్కరిస్తాను.
అనే శ్లోకాలు పఠించండి
ఈ రాత్రి చేసిన సంకల్పం, విశ్వాసం , ఆహ్వానం వృధా కాదు. నిజమైన మనస్సుతో పూర్ణిమ రాత్రి చేసిన ఈ సాధన మీ రెండు కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. చంద్రదేవుని కృప ఎప్పుడూ వృధా కాదు అని నమ్మండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
నిద్రపట్టడం లేదా? ఉలిక్కిపడి నిద్రలేస్తున్నారా? ఆందోళన పెరుగుతోందా? అందుకు ఏ గ్రహం కారణమో తెలుసా!






















