అన్వేషించండి

2026లో ఈ రాశుల వారికి శని దేవుడి కష్టాలు ! జాగ్రత్తలు, పరిహారాలు తెలుసుకోండి | Shani Dosha 2026

Shani Dev: 2026 నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాది కూడా శని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

Shani Effect 2026:  కొన్ని రోజుల్లో క్యాలెండర్ మారుతుంది..కానీ...శని అదే రాశిలో సంచరిస్తాడు.పాత సంవత్సరంలో ఏ రాశులపై శనిప్రభావం ఉంటుందో అవే రాశులపై శనిప్రభావం కొనసాగుతుంది. కారణం శని ఒక్కో రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తాడు. అంటే రెండున్నరేళ్లకు ఓసారి రాశులపై శని ప్రభావంలో మార్పులువస్తాయన్నమాట. శనిదేవుడు 2025 ఏప్రిల్ నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు..ఇదే రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తాడు. అందుకే క్యాలెండర్ 2025 నుంచి 2026 కి మారినా కానీ ఆయా రాశులపై శని ప్రభావంంలో మార్పులు ఉండవు.

నూతన సంవత్సరం 2026 గురించి కొత్త ఆశలు, సానుకూల మార్పులను ఆశిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరం చాలా రాశిచక్ర గుర్తులకు కష్టతరంగా ఉండవచ్చు. దీనికి కారణం శని సాడేసతి అని చెప్పాలి.
 
శనిని న్యాయ దేవతగా భావిస్తారు, ఇది చాలా శక్తివంతమైన గ్రహం. శని మనిషికి కర్మల ప్రకారం ఫలితాలను కూడా ఇస్తాడు. శని గోచార సమయంలో  జీవితంలో పోరాటం, ఒత్తిడి, ఆలస్యం, మానసిక హెచ్చు తగ్గులు కనిపిస్తాయి.

2026లో శని రాశిని మార్చడు  

శని దేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తాడు. 2025లో మీనరాశిలోకి ప్రవేశించిన శనిభగవానుడు 2027 జూన్ వరకూ ఇదే రాశిలో ఉంటాడుయ అటువంటి పరిస్థితిలో 2026లో శని రాశి మార్పు ఉండదు ... ఏ రాశిచక్ర గుర్తులపై శని ప్రభావం నడుస్తోందో అదే 2026లోనూ కొనసాగుతుంది. ఈ కారణంగా 2026 సంవత్సరంలో కూడా ఈ రాశిచక్ర గుర్తులు శని యొక్క ఈ తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో  ఎక్కువ సహనం, సంయమనం అవసరం. 

2026లో ఏ రాశిచక్ర గుర్తులపై శనిప్రభావం ఉంటుందో తెలుసుకోండి!
 
కుంభ రాశి

కుంభ రాశి జాతకులపై ఏల్నాటి శని చివరి దశ నడుస్తోంది. మీ రాశి నుంచి శనిదేవుడు రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో  మీరు కష్టపడి పనిచేయాలి, సహనంగా ఉండాలి..అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. అయితే 2026లో మీకు మానసిక ఒత్తిడి పెరగవచ్చు..చిన్న  చిన్న పనులు పూర్తిచేయడానికి కూడా ఎక్కువసమయం పట్టొచ్చు
 
మీన రాశి

శని ప్రస్తుతం మీ రాశిలోనే ఉన్నాడు. ఏల్నాటి శని రెండో దశ నడుస్తోంది మీకు.  ఇది జూన్ 2027 వరకు కొనసాగుతుంది. ఏల్నాటి శని మూడు దశల్లో రెండో దశ చాలా కష్టతరమైనది. ఈ సమయంలో శని ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది..ఆర్థిక ఇబ్బందులుకూడా వెంటాడుతాయి
 
మేష రాశి

మీ రాశి నుంచి శని సంచారం 12వ ఇంట్లో ఉంది. అంటే మీకు ఏల్నాటి శని మొదటి దశ నడుస్తోంది. ఈ సమయంలో కుటుంబ సుఖ శాంతులు భంగం కలిగించవచ్చు.. మానసిక ఒత్తిడి నిరంతరం పెరగవచ్చు. సహనమే మీకు రక్ష
 
సింహ రాశి

సింహ రాశి వారిపై శని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుంచి శని సంచారం ఎనిమిదో స్థానంలో ఉంది..ఈ సమయంలో మీకు అష్టమ శని అన్నమాట. అష్టమంలో శని సంచారం ఖర్చులు పెంచుతాడు..అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక, శారీర బాధలు పెరగవచ్చు
 
ధనుస్సు రాశి

జూన్ 2027 వరకూ శని సంచారం మీన రాశిలో ఉంటుంది..అంటే మీ రాశి నుంచి నాలుగో స్థానంలో శని సంచారం..దీన్ని అర్ధాష్టమ శని అంటారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏర్పడతాయి
 
శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇవి చేయండి

ప్రతి శనివారం శని దేవుడిని,  హనుమంతుడిని పూజించండి
 
శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేయండి , ఆవాల నూనెతో దీపం వెలిగించండి

శనివారం నల్ల నువ్వులు, మినపప్పు, నల్ల గొడుగు, చెప్పులు, ఇనుము, ఆవాల నూనెను దానం చేయండి

శని చాలీసా లేదా హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం ద్వారా కూడా శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget