Dhanurmasam 2025: ధనుర్మాసం ప్రారంభ ముగింపు తేదీలు, ఈనెల విశిష్టత , పూజా విధానం! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Dhanurmasam 2025 start and end dates: 2025 సంవత్సరంలో ధనుర్మాసం ప్రారంభ ముగింపు తేదీలు, ఈనెల విశిష్టత , పూజా విధానం! పూర్తి వివరాలు తెలుసుకోండి!

Dhanurmasam 2025 Dates: చంద్రుడు నక్షత్ర సంచారాన్ని చాంద్రమానం...సూర్యుడు రాశి సంచారాన్ని సౌరమానంగా లెక్కిస్తారు. ఇలా సూర్యభగవానుడు ధనస్సులో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది..ఈ ఏడాది డేట్స్ ఎప్పుడొచ్చాయంటే...
నెలరోజులకు ఓ రాశిలోకి పరివర్తనం చెందుతాడు సూర్య భగవానుడు. మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు మేష సంక్రాంతి, కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతి, మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకరసంక్రాంతి... ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుస్సంక్రాంతి. అయితే ధనస్సులోకి ఆదిత్యుడు ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది.
2025లో ధనుర్మాసం ప్రారంభ తేదీలు.. ముగింపు తేదీలు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
హిందూ పంచాంగం ప్రకారం ఏటా మార్గశిర మాసంలోనే ధనుర్మాసం మొదలవుతుంది. ఈ నెల అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సాధారణంగా ధనుర్మాసం డిసెంబర్ మధ్యనుంచి ప్రారంభమై.. సంక్రాంతి సమయానికి ముగుస్తుంది.
సూర్యుడు 2025 డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల 58 నిముషాలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు.
2026 జనవరి 14న ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఆరోజుతో ధనుర్మాసం ముగుస్తుంది
ధనుర్మాసం విశిష్టత
ధనుర్మాసం అనేది కేవలం ఒక నెల పేరు కాదు… ఇది భగవంతుడు మనల్ని తన దగ్గరకు ఆకర్షించే గురుత్వాకర్షణ సమయం.
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం
ఈ నెలలో భూమి అయస్కాంత క్షేత్రం, గురుత్వాకర్షణ, ఓజోన్ పొర – ఇవన్నీ సూక్ష్మంగా మారి మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తాయి. అందుకే సాధకులు ఈ మాసంలో సూర్యోదయానికి 96 నిమిషాల ముందు (బ్రహ్మముహూర్తం) నిద్ర లేవగానే దేవుని నామస్మరణ చేస్తే, ఆ నామం నేరుగా హృదయంలో పడి అహంకార గ్రంథిని కరిగిస్తుంది.
భగవంతుడు స్వయంగా జాగృతం అవుతాడు
ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనేందుకు ఉపక్రమించే సమయం. ఈ సమయంలో దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ భూమి మీదకు దిగి వస్తారు..ఈ సమయంల మీరు పఠించే నామం నేరుగా భగవంతుడిని చేరుకుంటుంది
ఈనెల గురించి భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడంటే..
“మాసానాం మార్గశీర్షోఽహం” (10-35)
అంటే “నెలలలో నేను మార్గశిర్షుడను” అని. ఈ నెలలో ఎవరైతే భక్తితో ఉపవాసం, జాగరణ, నామస్మరణ చేస్తారో… వారి హృదయంలో నేను స్వయంగా ప్రవేశిస్తానని ఆయన చెప్పారన్నమాట
తిరుప్పావై
ధనుర్మాసంలో ఆండాళ్ అమ్మవారు 30 రోజులూ వేకువజామునే శ్రీకృష్ణుడిని మేల్కొలపేందుకు పాడిన పాశురాలే తిరుప్పావై. ఈ 30 పాశురాలు పాడితే 30 జన్మల పాపం కరిగిపోతుందని ఆళ్వార్లు చెప్పారు. అందుకే ధనుర్మాసంలో ఎక్కడ చూసినా “మార్గళి ట్టింగళ్… మది నిఱైంద నన్నాళాల్…” అనే గోదాదేవి స్వరం వినిపిస్తుంది.
ధనుర్మాసంలో చేసే ప్రతి కర్మ శాశ్వత ఫలితం ఇస్తుంది
ఒక్క తులసీ ఆకు సమర్పణ → వైకుంఠ ప్రాప్తి
ఒక్క గోపిక చందనం ధరించడం → లక్ష్మీ కటాక్షం
ఒక్క గీతా శ్లోకం పఠించడం → సర్వపాప విమోచనం
ఒక్క రోజు ఉపవాసం → 1000 ఏకాదశుల ఫలితం
ధనుర్మాసం అంటే కేవలం పండుగ కాదు..భగవంతుడికి మిమ్మల్ని దగ్గరచేసే సమయం.. ఈనెలలో ఎంత ఎక్కువ భగవన్నామస్మరణ చేస్తే అంత త్వరగా ఆయన హృదయంలో చోటు దొరుకుతుంది
ఓం నమో భగవతే వాసుదేవాయః
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















