అన్వేషించండి

Makar Sankranti Gobbillu 2024: సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బిళ్ల సందడెందుకు!

Sankranti Gobbillu 2024: సంక్రాంతికి ఇంటి ముందు కన్నులపండువగా కనిపించే రంగు ముగ్గుల్లో గొబ్బిళ్లు తప్పనిసరిగా పెడతారు. భోగి, సంక్రాంతికి ఇంటిముందు పెట్టే గొబ్బిళ్ల వెనుకున్న ఆంతర్యం ఏంటి!

Makar Sankranti Gobbillu 2024: సంక్రాంతి పండుగ సందర్భంగా పాటించే పద్ధతులు, సంప్రదాయాల వెనుక మన జీవనశైలి, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఇమిడి ఉంటాయి. అందులో భాగమే గొబ్బిళ్లు. పండుగ ప్రారంభానికి  నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభంలోనే  తెలుగు లోగిళ్లన్నీ రంగవల్లులు, గొబ్బిళ్లతో కళకళలాడుతుంటాయి. రంగులు నింపిన ముగ్గుల మధ్య గొబ్బిళ్లు .. వాటిపై గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి..పసుపు-కుంకుమతో గౌరీ దేవిని పెడతారు. భోగి రోజు సాయంత్రం గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. గొబ్బి అనే మాట గర్భా అనే మాట నుంచి వచ్చింది. గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు. అందుకే గొబ్బెమ్మను గౌరవిస్తూ పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఈ సందర్భంగా పాడే పాటలు అద్భుతంగా అనిపిస్తాయి. గొబ్బిపాటల్లో ఎక్కువగా గోవిందుడు, శ్రీకృష్ణుడి గురించి పురాణ కథలున్నాయి. గొబ్బిపాటల్లో కృష్ణుడిని ఉద్దేశించే ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో గోదాదేవి పాశురాల్లో కూడా గొబ్బిళ్ల ప్రస్తావన ఉంటుంది. 

Also Read: ఈ రాశులవారికి సహనం, ఓర్పు చాలా అవసరం - జనవరి 12 రాశిఫలాలు

కన్నె పిల్లల మనసు తెలిపే పాట

సుబ్బీ గొబ్బెమ్మా సుఖములీయవే
చామంతి పువ్వంటి చెల్లిల్నియ్యవే
తామర పువ్వంటి తమ్ముడ్నీయ్యవే
మొగలీ పువ్వంటీ మొగుడ్నియ్యవే
అంటూ సాగే గొబ్బి పాట కన్నెపిల్లల కోర్కెలను వారి భవిష్యత్ ను, పుట్టినిల్లు,మెట్టినింటి సౌభాగ్యాన్ని కోరుకునే ఆడపడుచుల మనసులు తెలియజేస్తుంది. 

Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!

అన్నమయ్య రాసిన గొబ్బిళ్ల పాట

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
పదకవితా పితామహుడు అన్నమయ్య... శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుని, కంసుడిని వధించడం లాంటి  సంఘటలను వివరించడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడనే వివరణ ఈ పాటలో ఉంటుంది.

Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!

అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు, అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు వియ్యపురాళ్ల పరువు పట్టుదలలు, ఆప్యాతలు, అనుబంధాలు  ఇలా ఎన్నో విషయాలు ఈ గొబ్బిపాటల్లో ఉంటాయి. 

గంగమ్మ గౌరమ్మ అప్పసెల్లెండ్రూ .. గొబ్బియళ్లో ..
ఒక తల్లి బిడ్డలకు వైరమూ లేదు.. గొబ్బియళ్లో
మంచి మంచి పూలేరి రాసులు పోసిరి...గొబ్బియళ్లో ...

ఈ పాట..ఎలాంటి వైరాలు వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి జీవనం సాగించాలనే ధర్మాన్ని బోధిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో వినిపించే ఈ పాటలో గాజులు అమ్ముకునే వ్యాపారి కంచి వెళ్లి గాజులు తీసుకొస్తే..మహిళలంతా చేరి కంచి కామాక్షమ్మ గురించి అడిగి తెలుసుకోవడమే ఈ గొబ్బిపాటలోని ఇతివృత్తం.

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

ముగ్గులకు దైవత్వాన్ని ఆపాదించే గొబ్బిళ్లు

గొబ్బియల్లో కంచికి పోయేటి గాజులశెట్టి గొబ్బియల్లో...
గొబ్బయళ్ళో గొబ్బియని పాడరమ్మ
కంచి వరదరాజునే గొబ్బియళ్లో
గొబ్బియళ్లో అంచులంచురగుల మద
పంచవన్నె ముగ్గుల్లో గొబ్బియళ్లో..
ఈ పాట ముంగిట్లోని ముగ్గుల ప్రాముఖ్యాన్ని వాటికి దైవత్వాన్ని ఆపాదించడమూ కనిపిస్తుంది.

పట్టణాల్లో అరుదుగా కనిపించే ఈసంప్రదాయం..పల్లెల్లో అడుగడుగునా కనిపిస్తుంది... 

Also Read: బొమ్మల కొలువు ఎందుకు - ఏ బొమ్మలు ఏ మెట్టుపై పేర్చాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget