అన్వేషించండి

Horoscope Today January 12th 2024 : ఈ రాశులవారికి సహనం, ఓర్పు చాలా అవసరం - జనవరి 12 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 12th January  2024  - జనవరి 12 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా ప్రోత్సాహకరమైన రోజు. మీరు కొత్త పనిని ప్రారంభించడానికి గొప్ప అవకాశం పొందుతారు. మీ ఆలోచన మరియు భావజాలం మీ పనిని విజయం వైపు నడిపిస్తుంది. ఓపిక పట్టండి మరియు మీ లక్ష్యాల వైపు పయనిస్తూ ఉండండి.  కుటుంబ బంధాలలో ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వాహన నిర్వహణకు ధనం వెచ్చించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీకు ఆస్తి పరంగా చాలా అనుకూలమైన రోజు. మీరు కొన్ని మంచి ఆర్థిక అవకాశాలను పొందవచ్చు..వాటిని సద్వినియోగం చేసుకోవడం మర్చిపోకూడదు. మీ ఖర్చులను అదుపులో ఉంచుకుని పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. మీరు కార్యాలయంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అధిక కోపాన్ని తగ్గించుకోవాలి. ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది, కానీ పని ఒత్తిడికి దూరంగా ఉండండి.

Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు  మీరు కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఓపిక పట్టండి, స్థిరంగా పని చేయండి. మీ ప్రణాళికలను గుర్తుంచుకుని అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది.  వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. బడ్జెట్ ప్రకారం మాత్రమే ఖర్చు చేయండి.  కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో వాదనలు పెట్టుకోవద్దు. 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీకు పని పరంగా చాలా అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనిలో విజయం పొందుతారు, కష్టానికి తగిన ఫలాలు పొందుతారు. ఇతరుల నుంచి తీసుకునే సలహాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. భౌతిక సంతోషం  పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీ ఖర్చులపై నిఘా ఉంచండి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సిన రోజు. అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి . పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి. జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి. సానుకూల దృక్పథంతో అన్ని పనులను పూర్తి చేయండి మరియు మీ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడి పని చేయండి. వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంటుంది.

Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 
ఈరోజు వ్యాపార, వృత్తి పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. మీ కృషి , పోరాటం మీకు విజయాన్ని అందిస్తాయి. సామాజిక హోదా, ప్రతిష్ఠ పెరుగుతాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది. పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు. ఓపికగా వ్యవహరిస్తేనే మీ లక్ష్యాలను సాధించగలరు. కుటుంబంలో  సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడానికి సంకోచించకండి. 

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వ్యాయామం ,యోగాపై దృష్టి సారించాలి. ఆరోగ్య సంబంధిత ప్రణాళికలను వేసుకోవడం మంచిది. మేధోపరమైన పని నుంచి కొత్త ఆదాయ వనరులు సృష్టించగలుగుతారు. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. పని బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితుని సహాయంతో ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అధిక కోపాన్ని నివారించండి. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. మీ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. మీ ప్రతిభ, నైపుణ్యాలతో కొత్త విజయాలు సాధిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. అనవసర ఖర్చులు తగ్గించండి. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మీరు మీ ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఖర్చులను నియంత్రించండి. వృత్తి జీవితంలో పురోగతికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. కుటుంబ జీవితంలో  ఆనందం ఉంటుంది . ఆదాయం తక్కువగానూ, ఖర్చులు ఎక్కువగానూ ఉండవచ్చు. 

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రోజు మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధించడానికి సమయాన్ని వెచ్చించాల్సి రావచ్చు. కొత్త అవకాశాలను అన్వేషించండి. ఇప్పుడు ప్రణాళికలు రూపొందించుకుని ముందడుగు వేస్తే రానున్న రోజుల్లో విజయం సాధిస్తారు. మాజీ భాగస్వామిని కలుస్తారు. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మవద్దు. ధన ప్రవాహం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతాయి కానీ పరిస్థితి త్వరలోనే చక్కబడుతుంది. 

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. స్నేహితులకు సమయం కేటాయించడం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. నూతన ఆదాయ మార్గాల ద్వారా లాభాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కార్యాలయంలో మీ గుర్తింపు పెరుగుతుంది..కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీరు సాధించాలి అనుకున్న లక్ష్యాలను ఎప్పుడూ పక్కన పెట్టేయవద్దు.. ప్రయత్నిస్తూనే ఉండాలి. 

Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Pantangi Toll Plaza: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
Embed widget