అందుకే సంక్రాంతి పెద్దపండుగ! సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయి సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగానూ , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేల్కొంటారో దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారు ఈ సమయంలో భక్తితో ఏం కోరుకున్నా దేవతలు తీరుస్తారని పండితులు చెబుతారు విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగను పెద్ద పండుగగా జరపడం ప్రారంభించారు Image Credit: Pinterest