ABP Desam

గంగిరెద్దుల సంప్రదాయం ఎలా మొదలైంది!

ABP Desam

సంక్రాంతి పండగొస్తే వాడవాడలా గంగిరెద్దులు కనిపిస్తాయి. అసలీ సంప్రదాయం ఎలా మొదలైందంటే

ABP Desam

పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుడిని తన ఉదరంలో ఉండేలా వరం కోరుకుంటాడు.

ఇచ్చిన వరం మేరకు శివుడు గజాసురుడి ఉదరంలో ఉండిపోయాడు.

శివుడిని బయటకు రప్పిచేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో వాయిద్యాన్ని పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు వెళ్లారు

వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు.

తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగాడు శ్రీ మహావిష్ణువు

అలా శివుడిని తిరిగి కైలాశానికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నమే..ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది

ఈ కథను వినాయకచవితి సందర్భంగా కూడా చెప్పుకుంటాం... Images Credit: Pinterest