అన్వేషించండి

Mahabharatham Summary: మహాభారత సారాంశం మొత్తం 10 వాక్యాల్లో - ఈ తరం తప్పనిసరిగా తెలుసుకోవాలి!

Spiritual News: మహభారతం కేవలం ఓ మతానికి సంబంధించిన గ్రంథం మాత్రమే కాదు..జీవన విధానం ఎలా ఉండాలో చూసించే దిక్సూచి. మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు

Mahabharatham Summary in Telugu: మహాభారతం మొత్తం చదివారా? మీకు చదవడం కుదరకపోయినా ఈ పది ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే చాలు.. మహాభారత సారాంశం మీకు అర్థమవుతుంది. 

1. కుటుంబ సభ్యుల గొంతెమ్మ కోర్కెలు తీర్చుకుంటూ వెళితో రానున్న రోజుల్లో వాళ్లు అదుపుతప్పి పూర్తిగా మీ అధీనం నుంచి దూరమవుతాయి. ఇందుకు ఊదాహరణ  - కౌరవులు. పిల్లలపై ప్రేమతో వారు చేస్తున్న తప్పులను ప్రశ్నించకుండా వారు ఏం కోరితే అది సాధించుకునేందుకు ధృతరాష్ట్రుడు ప్రోత్సహించడం వల్లే చివరకు పతనం అయ్యారు. 
 
2. ఎంత బలవంతుడివి అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు..నేటికాలంలో నెట్ వర్క్ ఉన్నా, ఇంకెన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నా.. నువ్వు నడిచే మార్గం అధర్మం అయినప్పుడు ఈరోజు గెలిచినా రానున్న రోజుల్లో నాశనం కాక తప్పదు. ఇందుకు ఉదాహరణ కర్ణుడు. సకల విద్యలు నేర్చుకున్న కర్ణుడు అధర్మంవైపు నిలిచిన కారణంగానే పతనం అయ్యాడు 
 
3. పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు కానీ వారి యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హులకి కూడా జ్ఞానం అందిస్తే వినాశనం తప్పదు. ఇందుకు ఊదాహరణ అశ్వత్థామ. పాండవులు, కౌరవులకు విద్య నేర్పించిన ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. తనయుడి ఆలోచనాతీరు సరిగా లేదని తెలిసినా విద్య నేర్పించాడు ద్రోణుడు. అందుకు ఫలితమే మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన నిలిచి కృష్ణుడి చేతిలో అశ్వత్థామ శాపగ్రస్తుడయ్యాడు

రామాయణం - మహాభారతం రెండింటిలోనూ ప్రధాన పాత్ర పోషించిన ఐదుగురు

4. కుటుంబంలో వారు తప్పులు చేస్తున్నా, అవసరం లేకపోయినా మీకెందుకు మేమున్నాం అనే భరోసా ఇస్తే దానివల్ల ఓ దశ దాటిన తర్వాత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యంగా బతకాల్సి వస్తుంది. ఇందుకు ఉదాహరణ భీష్ముడు. రాజ్యాధికారం చేపట్టను అని చెప్పడం వల్లనే కౌరవులు బాధ్యత తీసుకోవడం..తప్పులు జరుగుతున్నా ప్రశ్నించలేక జీవితాంతం చేతులు ముడుచుకుని నిర్వీర్యంగా బతకాల్సి వచ్చింది. ఆ పాప ప్రక్షాళన కోసమే అంపశయ్యపై తనకి తానుగా తీసుకున్న శిక్ష
 
5. ఆస్తులున్నా, శక్తి ఉన్నా, అధికారం ఉన్నా, తమను బలపరిచే సమస్తం ఉన్నా కానీ.. అహంకారంతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్లకు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉండేవారికీ వినాశనం తప్పదు. ఇందుకు ఊదాహరణ దుర్యోధనుడు. కౌరవుల్లో పెద్దన్న అయిన దుర్యోధనుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 

6. స్వార్థపరుడికి , గర్విష్టికి, జ్ఞానం ఉన్నా కేవలం తనవారికోసమే వినియోగించేవాడికి బాధ్యతలు అప్పగిస్తే వినాశనం తప్పదు. అది కుటుంబంలో అయినా...మహాభారతంలో ఇందుకు ఊహాహరణ ధృతరాష్ట్రుడు
 
7.ప్రతి ఒక్కరికీ మంచి శత్రువు కన్నా చెడు మిత్రుడు అత్యంత ప్రమాదకరం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మహాభారతంలో శకుని పాత్ర ఇందుకు ఉదాహరణ. కౌరవులతో ఉంటూనే..వారి మంచి కోసం అని చెబుతూనే జూదం పేరుతో పాండవులను అడవులకు పంపించి.. మహాభారత యుద్ధానికి, కౌరవుల పతనానికి కారణం అయ్యాడు శకుని
 
8. శక్తి యుక్తులకు , తెలివితేటలకు ధర్మం తోడుగా నిలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని విజయం తప్పకుండా వరిస్తుంది. ఇందుకు ఉదాహరణ అర్జునుడు. పాండవులు ఎంత బలవంతులు అయినా కృష్ణుడి ధర్మవ్యూహమే వారిని విజేతలుగా నిలిపింది.

9. నైతిక విలువలు పాటిస్తూ నీ మార్గంలో నువ్వు సక్రమంగా అడుగులు వేస్తే ధర్మం నీకు తోడుగా నిలుస్తుంది, ఏ శక్తీ నీకు నీవాళ్లకు హాని చేయదు. మహాభారతంలో ఇందుకు ఉదాహరణ ధర్మరాజు
 
10. అన్నీ తెలిసినా, అందరకీ బంధువైనా కానీ...ధర్మం వైపు నిలబడాల్సిందే. అదే భగవంతుడి కర్తవ్య ధర్మం. మహాభారతంలో ఇందుకు ఉదాహరణ శ్రీ కృష్ణుడు

రోహిణి కార్తె అంటే ఏంటి? 2026లో రోహిణి కార్తె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ సమయంలో ఏం చేయకూడదు?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-10-2026 గురువారం మకర, కుంభ, మీన రాశుల వారికి శుభవార్తలా? సవాళ్లా?
15-10-2026 గురువారం మకర, కుంభ, మీన రాశుల వారికి శుభవార్తలా? సవాళ్లా?
15-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, మీ అదృష్టం ఎలా?
15-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, మీ అదృష్టం ఎలా?
15-10-2026 గురువారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు - వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!
15-10-2026 గురువారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు - వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!
15-10-2026 గురువారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలు!
15-10-2026 గురువారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget