అన్వేషించండి

Sri Vishnu Sahasranama Stotram : ధర్మరాజు అడిగిన ఈ 6 ప్రశ్నలకు భీష్ముడి సమాధానమే విష్ణు సహస్రనామం - వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమైన శ్లోకాలు చదువుకోండి!

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుసహస్రనామం పఠించడం అత్యంత పుణ్యఫలం. ఈ సందర్భంగా మొత్తం విష్ణుసహస్రం చదువులేకపోయినా అందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మీకోసం...

Sri Vishnu Sahasranama Stotram : ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి..ఈ రోజు నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం,  ఉపవాసం, జాగరణ విశేష ఫలితాన్నిస్తాయి.  గంగాదేవి-శంతనమహారాజు సంతానం అయిన భీష్ముడు కురక్షేత్ర సంగ్రామం అనంతరం అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్యతిథికోసం ఎదురుచూశాడు. ఆ సమయంలో పాండవులకు ధర్మం , నీతి బోధించాడు భీష్మపితామహుడు. ఆ సమయంలో ధర్మరాజు ఆరు ప్రశ్నలు అడిగాడు.
 
1. కిమ్ ఏకమ్ దైవతం లోకే...
 లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు?

2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ 
జీవితానికి పరమపదమైన గమ్యం ఏది?

3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ 
ఏ దేవుని స్తుతించుట వల్ల మానవులకు శుభం కలుగుతుంది?

4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్
ఏ దేవుని అర్చించడం వల్ల   మంచి జరుగుతుంది?

5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః 
సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?

6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ 
ఏ దేవుని జపించుటం వల్ల జన్మ సంసార బంధనాల నుంచి ముక్తి లభిస్తుంది?

ఈ 6 ప్రశ్నలకు సమాధానంగా...తన దగ్గరకు వచ్చిన శ్రీ కృష్ణుడిని ( శ్రీ కృష్ణుడే శ్రీమన్నారాయణుడు అని భీష్ముడికి తెలుసు) కీర్తించినదే విష్ణు సహస్రనామం. ఇందులో ఉన్న ఒక్కో శ్లోకం ఒక్కో ఫలితాన్ని అందిస్తుంది. 

Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణుంభవభయహరం సర్వలోకైక నాధమ్

విద్యాభివృద్ధికి 

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః 
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః 

ఉదర రోగ నివృత్తికి

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః 

సంతోషంగా ఉండేందుకు 

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః 

మేధాసంపత్తికి 

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః 
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ 

Also Read: ముక్కోటి దేవతలు అంటే ఎవరెవరు.. వైకుంఠ ఏకాదశిరోజు విష్ణువుతో భూలోకానికి వచ్చేదెవరు!

కోర్కెలు నెరవేరేందుకు 

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః 
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః 

వివాహ ప్రాప్తికి

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః 
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః 

అభివృద్ధికి

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః 
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః 

మరణ భయం తొలగిపోయేందుకు

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః 

సంపద వృద్ధి చెందేందుకు

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం
అర్థో నర్థో మహా కోశో మహా భోగో మహాధనః

Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!

ప్రయాణం చేసేముందు

వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు

నిత్యం ఈ ఒక్క శ్లోకం పఠిస్తే విష్ణుసహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందంటారు పండితులు

ఈశ్వర ఉవాచ 
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Pawan Kalyan Comments On Tirumala Stampede: టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Embed widget