By: ABP Desam | Updated at : 15 Feb 2022 04:48 PM (IST)
Edited By: RamaLakshmibai
Mahabharat
పూర్వంకాలం నుంచి తీర్థయాత్రలు ఆధ్యాత్మిక అన్వేషణలో ఒక ముఖ్య భాగంగా ఉన్నాయి. ఎన్నో కష్టాలనీ, అసౌకర్యాలనీ ఓర్చుకుని భక్తులు తీర్థయాత్రలు చేస్తుంటారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకూ దైవ సందర్శనార్థం వెళతారు. అయితే ఏదో వెళ్లాం వచ్చాం అన్నట్టు కాకుండా తీర్థయాత్రలు ఎందుకు చేయాలో తెలుసా..
ఒకసారి పాండవులంతా కలిసి తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని తమ శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణుడికి చెప్పి తనని కూడా తమ వెంట రమ్మని అడుగుతారు. పనుల ఒత్తిడి కారణంగా రాలేకపోతున్న అన్న కృష్ణుడు తనకు బదులుగా తీసుకెళ్లమని ఓ సొరకాయ ఇస్తాడు. కన్నయ్య మాటమేరకు ఆ సొరకాయ తీసుకుని వెళతారు. గంగ సహా అన్ని పుణ్యనదుల్లో, సాగరాల్లో స్నానాలు చేసి పుణ్యక్షేత్రాలన్నింటిని సందర్శిస్తారు. తీర్థయాత్రలన్నీ ముగించుకుని తిరిగి హస్తినాపురానికి చేరుకుని కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఆ సొరకాయను తిరిగి ఇస్తారు.
Also Read: శివరాత్రి గురించి పార్వతికి శంకరుడు చెప్పిన కథ ఇదే
తీర్థయాత్రలన్నీ తిప్పి తీసుకొచ్చిన సొరకాయని వండించి ఆ మధ్యాహ్నం ఆతిథ్యంఇస్తాడు శ్రీకృష్ణుడు. సొరకాయ కూర తిన్న పాండవులు ఇదేంటి కృష్ణా.. ఈ చేదు సొరకాయతో భోజనం పెట్టావు అని ప్రశ్నిస్తారు. అయ్యో అన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కదా ఈ సొరకాయ చేదుగా అయ్యిందా.. మీతో పాటే తీసుకెళ్ళారు కాదా తీపిగా అయ్యుంటుందనుకున్నాను అని అంటాడు కృష్ణుడు. ఆ మాటల్లో అర్థం పాండవులకు అప్పటికి అర్థమవుతుంది. మనసులో మార్పు రాకుండా ఎన్ని తీర్థాలు చేసినా శూన్య ఫలితమే అని తెలుసుకుంటారు. అంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగామన్నది ముఖ్యం కాదు...దైవ భక్తితో ఎలాంటి స్వార్థం లేకుండా దర్శనం చేసుకున్నామా లేదా అన్నది ముఖ్యం అన్నది అర్థం చేసుకోవాలి.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
తీర్థం అంటే పవిత్ర జలం.
"ఆపో వై సర్వా దేవతాః. "
నీళ్ళు సర్వ దేవతా స్వరూపం. నీళ్ళు-గంగ ఎప్పుడూ పవిత్రమే. ఏదైనా శుద్ధి చేయాలంటే నీళ్ళే కావాలి. నీళ్ళు తనలో సుగంధం, దుర్గంధం రెండూ చేర్చుకున్నా ప్రవాహజలం ఎప్పటికప్పుడు శుద్ధి అవుతుంటుంది.
ఆపః పృథివీ —పృథివ్యా ఓషథయః .
ఓషథీభ్యో అన్నం—అన్నాత్ పురుషః
నీటినుంచీ భూమి. కాబట్టి దేహానికి ఏర్పడే అశుచిని దాని పైది ఐన జలం పోగొడుతుందని విశ్వాసం.
"శరీరే జర్ఝరీ భూతే —వ్యాథి గ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీ తోయం —వైద్యో నారాయణ హరిః "
అని ఔషధ సేవనంలో జలమే మందుగా స్వీకరిస్తున్నాం.
తీర్థం అంటే తరింపజేసేది. తరించడం అంటే దాటడం.. అంటే కష్టాలనుంచీ బయటపడడం.తెలిసి కానీ, తెలియక కానీ చేసిన దోషాలను పశ్చాత్తాపపడినపుడు పోగొట్టుకోడానికి తీర్థయాత్రలు శరణ్యం. యథాశక్తి ఆ క్షేత్రాల్లో దాన ధర్మాలు చేసి పాపాల నుంచి విముక్తుడైన సంతృప్తి పొందుతారు.
వాస్తవానికి 'నిర్మలంగా ఉండే మనసే తీర్థం, ఒకరి కష్టాలు చూచి చలించి తాను చేయగిలిగే సాయం చేస్తే తీర్థయాత్రా ఫలితం పొందినట్టే.
"పోయి సేవింపలేకున్న పుణ్య తీర్థ మహిమ వినుటయు అఖిల కల్మష హరంబు "…అంటాడు ప్రవరుడు .
అంటే పుణ్యాత్ముల సాన్నిధ్యం కూడా తీర్థయాత్రా సమానమే అని అర్థం.
Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత
Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి
Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?