అన్వేషించండి
Advertisement
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగో ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయింది.
India Vs Australia 2nd Test Match Score: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగో ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా(Team india) బ్యాటర్లందరూ చేతెలెత్తేయడంతో భారత జట్టు తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 42, రాహుల్ 37, శుభ మన్ గిల్ 31 పరుగులు చేశారు. రిషబ్ పంత్ 21 పరుగులు చేయగా... అశ్విన్ 21 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు.
భారత బ్యాటర్ల తడబ్యాటు
ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టుకు మ్యాచు తొలి బంతిలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ తొలి బంతికే యశస్వీ జైస్వాల్(yashasvi jaiswal) అవుటైపోయాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి బంతికే యశస్వీని మిచెల్ స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్(KL Rahul), శుభ్ మన్ గిల్(Gill) టీమిండియాను ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. కంగారు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ స్కోరు బోర్డును 50 పరుగుుల దాటించి భారత్ ను మళ్లీ రేసులోకి తెచ్చింది. అయితే 51 బంతుల్లో 31 పరుగులు చేసిన శుభమన్ గిల్ అవుటవ్వడంతో రెండో వికెట్ కోల్పోయింది. శుబమన్ గిల్ ను బొలాండ్ అవుట్ చేశాడు. దీంతో 69 పరుగుల వద్ద భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు స్కోర్లు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ కూడా 37 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో పెవిలియన్ కు చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. ఓ దశలో 69 పరుగుల వరకూ ఒక్కటే వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ కూడా 7 పరుగులకే అవుట్ కావడంతో 81 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది.
Mitchell Starc's lethal six-for blows India away as they fold for 180💥 #WTC25 | Follow #AUSvIND live ➡ https://t.co/l7fptF25is pic.twitter.com/PRpzAqxHQP
— ICC (@ICC) December 6, 2024
రోహిత్ శర్మ మరోసారి విఫలం
81 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలు తర్వాత కూడా కొనసాగాయి. 87 పరుగుల వద్ద రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ ను కూడా కోల్పోయింది. హిట్ మ్యాన్ కేవలం మూడే పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కానీ రిషభ్ పంత్ తో జత కలిసిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitesh Kumar Reddy) భారత్ ను మరోసారి ఆదుకున్నాడు. టాపార్డర్ బ్యాటర్లంతా వెనుదిరుగుతున్నా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 21 పరుగులు చేసి పంత్ వెనుదిరిగినా నితీశ్ మాత్రం కంగారు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన నితీశ్ ను స్టార్క్ అవుట్ చేశాడు. అశ్విన్ కూడా 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో టీమిండియా 180 పరుగులైనా చేయగలిగింది. . ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు. బొల్లాండ్ 2, కమిన్స్ రెండు వికెట్లు తీశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
క్రైమ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion