News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mahabharat: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..

ముసలం అనే మాట నిత్యం వింటూనే ఉంటాం. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ పదం నిత్యనూతనం. ఏ పార్టీలోనైనా అంతర్గత కలహాలు చోటుచేసుకుంటే ఆ పార్టీలో ముసలం పుట్టిందంటారు. ఇంతకీ ముసలం మొదట ఎక్కడ పుట్టింది..

FOLLOW US: 
Share:

కురుక్షేత్రం ముగిసిన తర్వాత 36 ఏళ్లలో కృష్ణుడు కూడా మరణిస్తాడని, యాదవులంతా కొట్టుకు చస్తారని గాంధారి శాపం ఇస్తుంది. ఆ తర్వాత ద్వారకకు వెళ్లిపోయిన శ్రీకృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడికి పుట్టిన కొడుకు పేరు సాంబుడు. ఓసారి సప్తరుషులు శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వెళతారు. వాళ్లు రాజవీధిలో వస్తుండడం చూసిన యాదవులకు దుర్భుద్ధి పుట్టింది. కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి స్వాముల దగ్గరకు తీసుకొచ్చి.. అయ్యా ఇది భద్రుడి భార్య..దీనికి సంతానం కలుగుతుందా అని ఆటపట్టిస్తారు. అసలు విషయం గ్రహించి ఆగ్రహించిన సప్తరుషులు..."వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు... యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వాసుదేవుడిని దర్శించుకోకుండానే వెను తిరుగుతారు. 

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఆ తర్వాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఊరుకుంటాడు. ఆ మర్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా వున్న ఒక రోకలి పుట్టింది. యాదవులంతా భయంతో పరిగెత్తుకు వెళ్ళి ఆ సంగతి వసుదేవుడికి చెప్పగా.. ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలపండని ఆజ్ఞాపిస్తాడు. యాదవులంతా ఆయన చెప్పినట్టే చేశారు కానీ.. గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి...రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణంలో చాలా మార్పులొస్తాయి. ఎన్నో ఉత్పాతాలు కనిపించాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అపవడం, పగలు మేకలు నక్కల్లా కూయడం ,  ఆవులకు గాడిదలూ, ముంగిసలకు ఎలుకలూ, కుక్కలకు పిల్లులూ పుట్టాయట. కృష్ణబలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. అప్పుడే వేడివేడిగా వండిన ఆహారపదార్థాలు కూడా పురుగులు పట్టడం మొదలుపెట్టాయి. వరుస అశుభ సూచనలు చూసిన కృష్ణుడు గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు.

Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
ఊరిలో కన్నా తీర్థం సమీపంలో చనిపోవడం మంచిదని భావించిన కృష్ణుడు యాదవులను పిలిచి.. సముద్రానికి జాతర చేయాలి అంతా బయల్దేరండని ఆజ్ఞాపిస్తాడు. రాబోతున్న ప్రమాదాన్ని ఊహించని యాదవులంతా ఆహారపదార్థాలు సమకూర్చుకుని, అందంగా అలంకరించుకుని జాతరకు వెళతారు. అంతా సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళతాడు. ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తుపానీయాలు సేవించడం, అనవసర మాటలు మాట్లాడటం, పిచ్చిపిచ్చిగా నవ్వడం చేశారు. "ప్రద్యుమ్నా! అడుగో కృతవర్మని చూశావా! నిద్రపోతున్న వాళ్ళను చంపాడు. ఏంపౌరుషంరా! ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా?" అని సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు. "అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి  చంపావు నువ్వు. అది మరిచిపోయావా? నువ్వు చేసింది రణనీతి కాబోలని" కృతవర్మ ఆక్షేపించాడు. ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగి కృతవర్మ కంఠం నరికేశాడు సాత్యకి. సముద్రతీరంలో తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిముషం  ఆ కత్తికి ఆక్రమించి ఉంది. ఆ తర్వాత కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగా వివాదం పెరిగింది. సముద్ర తీరంలో మొలిచిన తుంగ పీకి ఒకర్నొకరు కొట్టుకుని అంతా ప్రాణాలు విడుస్తారు. అప్పుడు వాళ్లు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే తుంగగా మొలిచి..అదే వాళ్ల యుద్ధ సాధనంగా మారి యాదవుల నిర్మూలనకు కారణమైంది.  

దారుకుడూ, బభ్రుడూ తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దర్నీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళినమార్గానే కృష్ణుడు వెళ్లిపోతాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణుడు అవతారం చాలిస్తాడు. 

Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Jan 2022 12:44 PM (IST) Tags: Harikrishna lord srikrishna lord srikrishna messages musalam mausala parvam srikrishna dwaraka real story srikrishna yadhav family tree srikrishna death mysteries musalman mausala parvam katha శ్రీకృష్ణుడు

ఇవి కూడా చూడండి

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

టాప్ స్టోరీస్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక

రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక

ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ

ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ