అన్వేషించండి

Maha Shivaratri 2022: పార్వతీపరమేశ్వరుల కల్యాణం చూతము రారండి

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఇవాల్టి ( ఫిబ్రవరి 22) నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ద్వాదాశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీమల్లికార్జునస్వామి వారికి అష్టాదశ మహాశక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి వారికి నిలయమైన శ్రీశైలం మహాక్షేత్రం. భూ మండలానికి నాభిస్థానమని భూకైలాసంగా ప్రసిద్ధమైన దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చలువ పందిళ్లు, ఆహారం, వైద్యం, పుణ్య స్నానాలకు షవర్స్ సహా సకల ఏర్పాట్లు చేశారు. మార్చి 4 బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నారు ప్రత్యేకంగా శివదీక్ష స్వీకరించిన స్వాములు ప్రత్యేక క్యూలైన్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.  ఉదయం 9.00 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈవో లవన్న అర్చకులు, వేదపండితులు శ్రీకారం చుట్టారు. 

బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మ‌వార్ల వాహన సేవలు

  • 23 బుధవారం భృంగి వాహనసేవ
  • 24 గురువారం హంసవాహనసేవ
  • 25 శుక్రవారం మయూరవాహనసేవ
  • 26  శనివారం రావణవాహన సేవ
  • 27  ఆదివారం పుష్పపల్లకీ సేవ
  • 28 సోమవారం గజవాహనసేవ
  • మార్చి 1 వ మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం ప్రభోత్సవం,నందివాహనసేవ. ఇదే రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం పాగాలంకరణ ,, స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
  • మార్చి 2 బుధవారం రథోత్సవం , తెప్పోత్సవం
  • మార్చి 3 గురువారం యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
  • మార్చి 4 శుక్రవారం అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగింపు....

Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ కోసం  హైస్కూలు పక్కన టూరిస్టు బస్టాండ్ వద్ద శివాజీ స్ఫూర్తి కేంద్రం ముందు భాగంలో కేటాయించారు. క్షేత్రపరిధిలో వివిధ ప్రాంతాల్లో త్రాగునీటి కోసం శివగంగా జలప్రసాదం సిద్ధం చేశారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని  సర్వ దర్శనం, ఆర్జిత సేవలను  అనుమతించడం లేదని ఈవో Lavanna ప్రకటించారు. మార్చి 4వ తేదీ వరకూ మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు ఆన్ లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈఓ  తెలిపారు. శ్రీఘ్రదర్శనం రూ.200, అతిశీఘ్ర దర్శనం రూ.500, ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.  భక్తులంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మరో వైపు మాస్కులు లేకుండా భక్తులు ఆలయంలోకి అనుమతించడం లేదు.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

టాప్ హెడ్ లైన్స్

2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget