అన్వేషించండి

Krishna Janmashtami 2023: ద్వారక సముద్రంలో మునిగినప్పుడు మిస్సైన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు ఎక్కడుందంటే!

ద్వారపయుగాంతంలో ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు విశ్వకర్మ చెక్కిన రెండు విగ్రహాలు కూడా నీటిలో కలసిపోయాయి. కొన్నేళ్ల తర్వాత ఆ విగ్రహాలు శ్రీ మధ్వాచార్యులు చేతికొచ్చాయి..అవిప్పుడు ఎక్కడున్నాయంటే

Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి ఆలయాల్లో ప్రధానంగా చెప్పుకునేవి నాలుగు. ఉత్తరప్రదేశ్-మథుర, గుజరాత్-ద్వారక, కేరళ- గురువాయూరు, కర్ణాటక-ఉడిపి. వీటిలో స్వయంగా రుక్మిణి విశ్వకర్మతో తయారుచేయించిన విగ్రహం కొలువైన ఆలయం ఉడిపి. ఇక్కడ ఆలయంలో చిన్ని కృష్ణుడు ఉంటాడు. మరి బాలకృష్ణుడిని భార్య రుక్మిణి తయారు చేయించడం ఏంటనే సందేహం తీరాలంటే దీనివెనుకున్న ఆసక్తికర కథనం తెలుసుకోవాలి...
 
మధ్వాచార్యుల చేతికి బలరామకృష్ణులు

త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరంలో తపోదీక్షలో ఉండగా ఆ వైపు వస్తున్న నావ అలలకు పైపైకి లేచి ప్రమాదంలో చిక్కుకోబోయింది. ఆ సమయంలో మధ్వాచార్యులు తపోబలంతో తన దగ్గరున్న కండువాను ఆసరాగా విసిరి నావను ఒడ్డుకు చేర్చాడు. నావలో ఉన్నవారంతా కిందకు దిగిన తర్వాత  తమకు కాపాడినందుకు కృతజ్ఞతు తెలియజేశారు. అందుకు ప్రతిగా నావలో ఏదైనా విలువైన వస్తువుని తీసుకోమని కోరారు. అందుకు చిరునవ్వు నవ్విన మధ్వాచార్యులు పడవలో ఉన్న గోపీచందనపు గడ్డలు  ఇవ్వమని అడిగారు. ఆ మాటవిని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. విలువైన వస్తువులు తీసుకోమని చెబితే..ఎందుకూ పనికిరాని మట్టిగడ్డలు అడుగుతున్నారెందుకని ప్రశ్నించారు. వాటిని చేతిలోకి తీసుకున్న మధ్వాచార్యులు చప్పున నీటిలో ముంచారు. ఆ మట్టి మొత్తం కరిగిన తర్వాత బయటపడ్డాయి శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలు.

Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి!

రుక్మిణి తయారుచేయించిన విగ్రహాలివి 

కారాగారంలో జన్మించిన శ్రీ కృష్ణుడిని వసుదేవుడు గోకులంలో నందుడి ఇంట వదలిపెట్టాడు. అంటే శ్రీకృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలోనే సాగింది. ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఓ సారి దేవకీదేవి శ్రీకృష్ణునితో... నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగించినట్టే తనకూ కలిగేలా చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడిలా మారిపోయి అన్న బలరాముడితో ఆడుకున్నాడు. అల్లరి కృష్ణుడి ఆటపాటలు చూసి దేవకితో పాటూ మురిసిపోయింది రుక్మిణి. ఆ క్షణాన్ని పదిలంగా ఉంచాలని భావించిన రుక్మిణి వెంటనే విశ్వకర్మని పిలిచి ఆడుకుంటున్న బలరామకృష్ణులను చూపించి విగ్రహాలు తయారుచేయాలని కోరింది. అలా తయారు చేయించిన విగ్రహాలు కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు నీటిలో కలసిపోయాయి.  ఆ తర్వాత ఇవే విగ్రహాలు మధ్వాచార్యుల చేతికి వచ్చాయి. ప్రస్తుతం ఉడిపిలో పూజలందుకుంటున్నది ఈ విగ్రహమే.

అభిషేకించిన తర్వాత బరువు పెరిగిన విగ్రహం

ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ బలరామకృష్ణులను ఉడిపికి ఆహ్వానించేందుకే మధ్వాచార్యులు ఆరోజు తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తన శిష్యులతో ప్రక్షాళన చేయించిన తర్వాత స్వయంగా అభిషేకించారు. అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత పదుల మంది కలసినా కనీసం కదపలేకపోయారు. అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని చెబుతారు. విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ, సామాన్య శకం 1236లో ఉడిపిలో విగ్రహాలు ప్రతిష్ఠించారు.

Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది

పశ్చిమ ముఖంగా బాలకృష్ణుడు

అణువణువూ కృష్ణ నామస్మరణతో మారుమోగే ఈ ఆలయం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒకప్పడు శ్రీకృష్ణమఠంగా, ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలిచే ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం అని చెబుతారు. నిమ్న కులస్థుడైన కనకదాసు భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ పశ్చిమాభిముఖంగా దర్శనమిచ్చినట్టు స్థలపురాణం. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది. 

కిటికి ద్వారా కృష్ణుడిని దర్శించుకోవాలి

శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, కొయ్యశిల్పాలు ఇక్కడ భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం,  దానికి సమీపంలో తీర్థ మండపం ఉంది. ఈ ఆలయంలో  భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. బాలకృష్ణుడిని కిటికీ ద్వారా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అంటారు.

Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Embed widget