Lord Shiva Idol: ఈ భంగిమలో ఉన్న శివుని విగ్రహాలు ఇంట్లో ఉంటే పరమశివుని అనుగ్రహం తథ్యం - కానీ అదొక్కటీ వద్దు!
Lord Shiva Idol: హిందూ సంప్రదాయం ప్రకారం, వారంలో ప్రతి రోజు ఒక దేవుడికి అంకితం చేశారు. ఆ విధంగా సోమవారం శివుడిని పూజించడం మన ఆచారంలో భాగంగా మారింది.
Lord Shiva Idol: మహాదేవ్ లేదా భోలేనాథ్ అని భక్తులు పిలుచుకునే పరమ శివుడు చాలా దయామయుడని, దయగల దేవుడని చెబుతారు. తన భక్తులు చేసే చిన్నపాటి పూజలకు కూడా ఆయన చాలా తేలికగా సంతోషిస్తాడు. ఉదాహరణకు చెంబుడు నీళ్లు పోసి శివ శివా అంటేచాలు సంతసిస్తాడని చెబుతారు. భక్తులు నిర్మలమైన హృదయంతో, మనస్సుతో, నిండు భక్తితో శివుడిని పూజిస్తే, ఆ వ్యక్తి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది.
అయితే, మీ ఇంట్లో శివుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలోచిస్తున్నట్లయితే, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా శివుని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి ఈ తప్పులు చేస్తే ఆ మహాదేవుని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఇంట్లో ఎలాంటి శివుడి విగ్రహం పెట్టుకోవాలి, ఎలాంటి విగ్రహానికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధ్యాన భంగిమలో ఉన్న శివుడి విగ్రహం
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఇంట్లో శివుని విగ్రహాన్ని పెట్టాలనుకున్నప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పరమశివుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు, శివుని విగ్రహం ధ్యాన భంగిమలో ఉండాలని గుర్తుంచుకోండి. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి శివుని విగ్రహాన్ని పిల్లల చదువు గదిలో కూడా ఉంచవచ్చు. ఇది పిల్లల ఏకాగ్రత స్థాయిని పెంచుతుందని, వారు చదువులో మెరుగ్గా రాణించడానికి సహాయపడుతుంది.
శివ కుటుంబం చిత్రాన్ని ఉంచండి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంట్లో శివుడి కుటుంబాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీంతో ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులకు ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, అవగాహన పెరుగుతుంది. అంతే కాదు, పరమశివుడు కూడా సంతోషించి తన భక్తులపై తన ఆశీస్సులు అందిస్తాడు.
అర్ధనారీశ్వర విగ్రహం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మహాదేవుని అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఉంచిన ఇంట్లో, శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంట్లో ఉండే వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే సమయంలో కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ, అవగాహన ఉండటమే కాకుండా గాఢంగా మారుతుంది. ఇది ఒకరి వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
పొరపాటున కూడా ఈ విగ్రహాన్ని పెట్టకండి
అదే సమయంలో, కొన్ని దేవతా విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదని చెబుతారు, ఎందుకంటే ఇది వారి జీవితంలో మరిన్ని ఇబ్బందులను తెస్తుంది. వాస్తు ప్రకారం, మహాదేవుడు తాండవం చేస్తున్నప్పుడు కోపంగా ఉన్న భంగిమలో ఉన్న పటం, బొమ్మ, విగ్రహం ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుందని చెబుతారు.
Also Read : Bhagavad Gita Sloka: గీతాసారమంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది
దీనితో పాటు, శివుని నటరాజ అవతారం విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదని కూడా చెబుతారు. ఇది ఇంట్లో అశాంతిని సృష్టిస్తుంది. శివుని ఉగ్ర అవతారమైన కాల భైరవుని విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదని చెబుతారు. అటువంటి విగ్రహాన్ని ఉంచడం వల్ల, ఇంటి వాతావరణం మారి, కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది, ఇది కాలక్రమేణా పెరుగుతుంది.
Also Read : Hanuman Puja: హనుమంతుడు తన భక్తులను 10 రకాల కష్టాల నుంచి రక్షిస్తాడు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.