అన్వేషించండి

Kedarnath Dham Doors Open: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు, హర హర మహాదేవ్ నామస్మరణలతో మారుమోగిన క్షేత్రం!

Kedarnath Dham: భక్తుల కోసం కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరిచారు. వేద మంత్రాలు పఠించి, సాంప్రదాయ పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ్ నామస్మరణలతో మారుమోగింది క్షేత్రం!

Kedarnath Dham Doors Open: ఉత్తరాఖండ్‌లో పవిత్ర చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. బుధవారం (ఏప్రిల్ 22) భక్తుల కోసం  కేదార్‌నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి.   "హర్ హర్ మహాదేవ్" అనే నామస్మరణలతో ధామ్ మొత్తం మారుమోగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు.

భక్తుల ఆరు నెలల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ముగిసింది. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ అధికారులు, యాత్రికులైన పురోహిత సంఘం  వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ బాబా కేదార్ ద్వారాలు తెరిచారు.  తలుపులు తెరిచే సమయంలో సీఎం ధామి హాజరయ్యారు.
బాబా కేదార్‌నాథ్ ద్వారాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణం "జై శ్రీ కేదార్" నినాదాలతో మారుమోగింది. కేదార్‌నాథ్‌లో సైన్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.  

వేద మంత్రాల పఠనం, సాంప్రదాయ ఆచారాలతో కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు భక్తుల కోసం అధికారికంగా తెరుచుకున్నాయి. భారతదేశం , ప్రపంచం నలుమూలల నుంచి వేలాది  యాత్రికులు ఈ పవిత్ర స్థలానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేదార్‌నాథ్ కమిటీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 

తలుపులు తెరవడం గురించి సీఎం ధామి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు
 "ఈ రోజు, పూర్తి ఆచారాలు  వేద మంత్రోచ్ఛారణలతో, శ్రీ కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు భక్తుల కోసం తెరుస్తారు. ఈ శుభ సందర్భంలో, దేవభూమి ఉత్తరాఖండ్‌లో పవిత్ర చార్‌ధామ్ యాత్ర చేస్తున్న మీ అందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అభినందనలు తెలియజేస్తున్నాను. బాబా కేదార్ ఆశీస్సులు యాత్రికులందరికీ సుఖసంతోషాలతో కూడిన యాత్రను ప్రసాదించుగాక." అని పోస్ట్ చేశారు

ప్రధాని నరేంద్రమోదీ కూడా కేదార్‌నాథ్ ద్వారాలు తెరుచుకోవడంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.. దేవభూమి ఉత్తరాఖండ్ లో చార్‌ధామ్ యాత్ర దేశ విశ్వాసం, ఐక్యత, సుసంపన్నమైన సంప్రదాయలకు ప్రతీక..భక్తులంతా సురక్షితమైన యాత్ర చేయాలి, బాబా కేదార్ ఆశీస్సులు మీ అందరిపైనా ఉండాలి..మీ యాత్ర శుభప్రదం కావాలి.. జై శ్రీ కేదార్, హర హర మహాదేవ్ అని పోస్ట్ పెట్టారు మోదీ

మోదీ కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణంపైనా ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల సౌకర్యార్థం రహదారులు, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు. మోదీ తన పదవీకాలంలో పలుమార్లు కేదార్ నాథ్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ధ్యానం చేశారు. ఏటా దీపావళి తర్వాత వచ్చే రెండో రోజు భాయ్ దూజ్ నాడు శీతాకాలం ప్రారంభంకాగానే కేదార్‌నాధ్ ద్వారాలు మూసివేస్తారు. మళ్లీ ఏప్రిల్ మే నెలల్లో ఆలయాన్ని తెరుస్తారు..ఆరు నెలల పాటూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.

2026లో కేదార్‌నాథ్ దర్శనం కోసం సుమారు 4 లక్షల 50వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం చార్ ధామ్ యాత్రకు 14 లక్షల 50వేల మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిని మాత్రమే చార్ ధామ్ యాత్రకు అనుమతిస్తారు. హెలికాఫ్టర్ బుకింగ్, ట్రెక్కింగ్ నియమాలు, కొత్త ధరలకు సంబంధించిన అన్ని వివరాలు అధికారిక వెబ్ సైట్ లో ఉన్నాయి.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget