అన్వేషించండి

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Karwa Chauth and Atla Taddi 2022: ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు జరుపుకునే కర్వా చౌత్ ఈ ఏడాది ఎప్పుడొచ్చింది..ఆ రోజ ఏం చేయాలి..

Karwa Chauth and Atla Taddi 2022: హిందూమతంలో కర్వా చౌత్‌ (అట్ల తదియ)కు విశేష ప్రాధాన్యత ఉంది. వివాహిత మహిళలు..భర్తల సౌభాగ్యం కోసం ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు ఈ పూజ చేస్తారు. ఈ ఏడాది ఈ పూజ ఎప్పుడు చేయాలంటే..
 
ఈ ఏడాది కర్వా చౌత్ ఎప్పుడు చేసుకోవాలనే గందరగోళంలో ఉన్నారు కొందరు. అక్టోబరు 12 అని కొందరు, అక్టోబరు 13 అని కొందరు అంటున్నారు. అయితే స్పష్టంగా చెప్పాలంటే ఈ విషయంలో అస్సలు కన్ఫ్యూజన్ అవసరం లేదు.. ఎందుకంటే తదియ తిథి తగులు మిగులు అస్సలు లేదు.. అక్టోబరు 12నే జరుపుకోవాలి. ఇంతకీ కర్వా చౌత్ అంటే తెలుగువారికి అర్థమయ్యేలా చెప్పాలంటే అట్లతదియ. 

ఈ ఏడాది అట్లతదియ అక్టోబరు 12 బుధవారం వచ్చింది. తదియ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉందంటే...
అక్టోబరు 11 మంగళవారం రాత్రి 1.20 నుంచి ప్రారంభమైన తతియ ఘడియలు అక్టోబరు 12 రాత్రి 1.42 వరకూ ఉన్నాయి. అంటే సూర్యోదయం, చంద్రోదయం సమయానికి తదియ ఘడియలు ఉన్న రోజు బుధవారం..అందుకే కర్వా చౌత్( అట్ల తదియ) బుధవారమే జరుపుకోవాలి.

Also Read: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

అట్ల తదియ ఎవరు జరుపుకుంటారు!
హిందూ, పంజాబీ కమ్యూనిటీల్లో వివాహిత మహిళలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో కర్వా చౌత్ ఒకటి. ఈ పండుగ భర్తకు దీర్ఘాయువును కోరుతూ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ అట్లతదియ నోము నోచుకుంటారు. ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు అట్లతదియ చేసుకుంటారు. అంటే..దసరా పండుగ అయ్యాక 8 రోజులకు అట్లతదియ వస్తుంది. 

అవివాహితులకు మరింత ప్రత్యేకం
వివాహితులు మాత్రమే కాదు పెళ్లికాని యువతులకు మరింత ప్రత్యేకం అట్లతదియ. మంచి భర్త రావాలని, వైవాహిక జీవితం బావుండాలని పెళ్లికాని యువతులు ఈ నోము నోచుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు.

అట్లతదియ అంటే ఏం చేస్తారు
అట్ల తదియకు ముందు రోజు రాత్రే కన్నెపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. తదియ రోజు తెల్లవారుజామునే లేచి అన్నం, కందిపచ్చడి, గోంగూర పచ్చడి, కూర, పెరుగుతో కడుపునిండా అన్నం తిని..తాంబూల వేసుకుంటారు. ఇలా తినడాన్నే 'ఉట్టికింద ముద్ద' అందంగా. ఆ తర్వాత సూర్యోదయం అయ్యేవరకూ ఆటపాటలతో సందడిగా గడుపుతారు. తలకు స్నానం చేసి అందంగా అలంకరించుకుని పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటారు. మధ్యలో పండ్లు తినొచ్చు.  చీకటి పడేసరికి మళ్లీ గౌరీదేవికి పూజ చేసి, చంద్రుడిని దర్శించుకుని వ్రత కథ చెప్పుకుంటారు.  ముత్తైదువికి వాయనం ఇచ్చిన తర్వాత అట్లు తింటారు. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహంతో సౌభాగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది.

Also Read: గడ్డిపై ప్రతీకారం తీర్చుకునేవాళ్లుంటారా ... కానీ చాణక్యుడి విజయం అక్కడి నుంచే మొదలైంది..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Embed widget