అన్వేషించండి

Karthika Masam 2024 Starting Day: నవంబరు 02 కార్తీకమాసం ప్రారంభం - మొదటి రోజు పాటించాల్సిన నియమాలివే!

Karthika Masam 2024 Starting Day: ఈ రోజు (నవంబరు 02) నుంచి కార్తీకమాసం ప్రారంభం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో ప్రతి రోజూ ప్రత్యేకతమే. మొదటి రోజు ఇలా ప్రారంభించండి...

Karthika Masam 2024 Starting Day

శ్లోకం
సర్వపాప హరంపుణ్యం వ్రతం కార్తీక సంభవం
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే "

" కార్తీక దామోదరా! నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయు' అని నమస్కారం చేసి కార్తీక స్నానం ఆరంభించాలి. 

స్నానమాచరించేటప్పుడు...

సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే సమస్త జలాల్లో శ్రీ  మహా విష్ణువు వ్యాపించి ఉంటాడు. పురుషులైతే మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేసి.. దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అనంతరం బొటనవ్రేలి కొనతో నీటిని కదిపి...మూడు దోసెళ్ళ నీళ్ళను గట్టుమీద పోసి తీరానికి చేరుకోవాలి. తీరానికి చేరుకోగానే నీళ్లుకారుతున్న దుస్తుల్ని అలాగే వదిలేయకుండా వెంటనే పిండాలి. స్త్రీలు అయితే స్నానమాచరించి ఒడ్డుకి చేరుకోగానే పసుపు రాసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని పొడిగా, శుభ్రంగా ఉండే దుస్తులు ధరించాలి. నది లేదా చెరువు ఒడ్డున బియ్యపు పిండితో ముగ్గువేసి, పసుపు కుంకుమ అద్ది..దానిపై దీపం వెలిగించి యధాశక్తి పూజించాలి.

Also Read: కార్తీకమాసం మొదటి రోజు గోవర్ధన పూజ .. దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది!

సకలపాపాలు తొలగించే కార్తీకం

సూర్యాస్తమయం సమయంలో శివాలయం లేదా వైశ్ణవ ఆలయంలో యథాశక్తి దీపాలు వెలిగింది భక్తిశ్రద్ధలతో దేవుడిని ప్రార్థించాలి
కార్తీకమాసం వ్రతం ఆచరించడానికి వర్ణ భేదం, వయో భేదం, లింగ భేదం ఉండదు. ఎవరి శక్తిమేరకు వారు హరిహరులను స్మరించవచ్చు..కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని  చేసిన వారు  వైకుంఠ ప్రవేశం  పొందుతారు. పూర్వ జన్మలో చేసిన, ప్రస్తుత జన్మలో చేస్తున్న పాపాలన్నీ కార్తీకమాసం వ్రతం వల్ల హరించుకుపోతాయని పండితులు చెబుతారు

దీపం వెలిగించండి

కార్తీక మాసం అంటే చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండే మాసం. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అందుకే కార్తీక మాసంలో (Karthika masam 2023) అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుంది. అందుకే అగ్ని సంబంధమైన దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లోకి శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.  ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి. మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించాలి. 

Also Read: కార్తీకమాసం వచ్చేస్తోంది - నెలంతా తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!

కార్తీకమాసంలో పఠించాల్సిన లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం.

దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం.

సర్వసుగంధ సులేపితలింగం, బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదాశివలింగం

కనకమహాకణి భూషితలింగం, ఫణిపతివేష్టిత శోభితలింగం
దక్షసుయఙ్ఞ వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం

కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం

దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవ చ లింగం
దినకరకోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదాశివలింగం

అష్టదళోపరివేష్టితలింగం, సర్వసముద్భవకారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

సురగురు సురవర పూజితలింగం, సురవనపుష్ప సదార్చితలింగం
పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం

లింగాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ శివసన్నిధౌ, శివలోకమవాప్నోతి, శివేన సహ మోదతే.

Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సంLSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
World Test Championship: గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీ, అగ్ర జట్ల మధ్య మహా సమరం
గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీ, అగ్ర జట్ల మధ్య మహా సమరం
Rashmika Mandanna - Diwali: దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
Embed widget