Horoscope Today 11 November 2021: ఈ రాశివారికి ఈ రోజు డబ్బే డబ్బు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఈ రోజు మీకు కలిసొస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. మీ ఆలోచనలతో ఆకట్టుకుంటున్నారు. వ్యాపారంలో మార్పులు సంభవించవచ్చు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
వృషభం
ఖర్చులు తగ్గించండి. పెట్టుబడులు కలిసొస్తాయి. వ్యాపారంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ప్రేమికులకు కలిసొచ్చే సమయం. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కలిసొచ్చే సమయం.
మిథునం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. రిస్క్ తీసుకోవద్దు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధినుంచి బయటపడొచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...
కర్కాటకం
ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం ఉంది. పిల్లల వైపు నుంచి విజయం సాధిస్తారు. భూమి, ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. న్యాయపరమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి.
సింహం
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆనందంగా ఉంటారు. కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. అనవసరంగా ఖర్చు పెట్టకండి.
కన్య
ఆర్థిక సంబంధిత ఒత్తిడి దూరమవుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నవారు తమ ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
తుల
కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు ఉంటుంది. వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్య సూచనలున్నాయి. ఫలితం ఏదైనా ప్రయత్నం మానొద్దు. ఓ పెద్ద సమస్య తొలగిపోతుంది.
వృశ్చికం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చు. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. పెద్ద ఒప్పందాలు జరగవచ్చు. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. కొత్త పనులు లాభిస్తాయి. అనవసర మాటలు వద్దు.
ధనుస్సు
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుతాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. శత్రువులు చురుకుగా ఉంటారు.
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
మకరం
పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారం కోసం అప్పులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తుల ఇమేజ్ చాలా బాగుంటుంది. ఆకస్మిక ప్రయాణ ప్రణాళిక రూపొందిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు.
కుంభం
నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అధిక వేగంతో డ్రైవింగ్ చేయవద్దు. ఎవరైనా మిమ్మల్ని గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ అభీష్టానుసారం నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంటుంది. పెద్దలతో వాదించకండి. స్నేహితుని వల్ల నష్టం జరగొచ్చు. రిస్క్ తీసుకోవద్దు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.
మీనం
మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ ప్రవర్తన వల్ల అందర్నీ ఆకట్టుకంటారు. అనుకున్న పనులు పూర్తిచేయడం వల్ల మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపార మందగమనం తొలగిపోతుంది. డబ్బు లాభదాయకంగా ఉంటాయి. అన్ని పనులు ఉత్సాహంగా చేస్తారు. ఎవరితోనైనా మనస్పర్థలు రావొచ్చు.
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి