News
News
X

Daily Horoscope Today 6 November: ఈ రాశివారు స్త్రీల వల్ల లాభం పొందుతారు , ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.విదియ రా.10.56 వరకు తదుపరి తదియ, నక్షత్రం అనూరాధ రా.3.40 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ఉ.9.03 నుంచి 10.32 వరకు దుర్ముహూర్తం ఉ.6.05 నుంచి 7.35 వరకు అమృతఘడియలు... సా.5.58 నుంచి 7.28 వరకు.
మేషం
తలపెట్టిన పనిలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పెద్దగా కలసిరాదు. అనుకోని ఖర్చులుంటాయి. ఆరోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులకు పై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాలు వాయిదావేసుకోండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
వృష‌భం
వృషభ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.  విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆకస్మిక ధన నష్టం ఉంటుంది.  ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. 
మిథునం
పిల్లల విషయంలో ఎక్కువ పట్టుదల ప్రదర్శించవద్దు. వ్యసనాలకు దూరంగా ఉండండి. కోపాన్ని తగ్గించుకోండి, మనో వేదనకు గురవుతారు. అకాల భోజనం వల్ల అనారోగ్యం పాలవుతారు. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నమే చేయవద్దు.  ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరకూ కష్టపడాల్సిందే. 
క‌ర్కాట‌కం
కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.  విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ , ఆకస్మిక ధన నష్టం సూచనలున్నాయి. ఈ రోజు ప్రణాళికలు రూపొందించకండి, కొత్తగా ఏ పనులు ప్రారంభించవద్దు. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. 
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
సింహం
చేసే పనుల్లో ఆటంకాలు తప్పవు. ఇంట్లో కొన్ని మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. బంధు,మిత్రులతో జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయండి, వాహనం నడిపేవారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
క‌న్య‌
ఈ రాశివారికి ఈ రోజు చక్కగా ఉంది.  గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది.  స్త్రీల వల్ల లాభం పొందుతారు. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు.  శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహిస్తారు.
తుల‌
ఈ రోజు మీరు మానసికంగా దృఢంగా ఉండండి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడతో మానసికంగా ఆందోళన చెందుతారు. ఈ రాశి మహిళలకు అనారోగ్య సూచనలున్నాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగులక కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. 
వృశ్చికం
వివాదాల జోలికి పోవద్దు.  బంధు, మిత్రులతో విబేధాలు రాకుండా జాగ్రత్తపడండి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసికంగా ఆందోళం చెందుతారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందుతారు. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
Also Read: సోదరులకు భోజనం పెట్టి కానుకలిచ్చే వేడుక, కార్తీకమాసంలో రెండో రోజు 'భగినీ హస్త భోజనం'
ధ‌నుస్సు
దైవ దర్శనం చేస్తారు. ప్రయాణాలతో అలసిపోతారు.  ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. స్త్రీలు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారం అందుకుంటారు.
మ‌క‌రం
 కుటుంబంలో కొన్ని గందరగోళ పరిస్థితుల కారణంగా మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపనీ ఆలస్యంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు తమ బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. మాటతీరు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
కుంభం
స్థిరమైన ఆలోచన ఉండదు. వివాదాల్లో భాగం కావొద్దు. ఎవ్వరి విషయాల్లో తలదూర్చవద్దు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి.  స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. తలపట్టిన పనులు పూర్తవుతాయి.  కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు చేస్తారు.
మీనం
తలపెట్టిన పనల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. పాత అనారోగ్యం తిరగబెట్టే అవకాశం ఉంది జాగ్రత్త. తలపెట్టిన పనులకు ఆటంకాలు తప్పవు. అయినప్పటికీ పట్టుదలతో వ్యవహరించి పూర్తి చేయండి. మీకు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. 
Also Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..

Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!

Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...

Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Nov 2021 07:36 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Daily Horoscope Today 7November 2021

సంబంధిత కథనాలు

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Karwa Chauth and Atla Taddi 2022: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today 6th October 2022: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

Horoscope Today 6th  October 2022:  ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?