Horoscope Today 30 October 2021: ఈ రాశుల వారికి ఈ రోజు డబ్బే డబ్బు… మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
భగవంతుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభసమయం.
వృషభం
ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. కొత్త ఆదాయ వనరులు ఉంటాయి. మతపరమైన ప్రయాణం విజయవంతమవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వృద్ధుల ఆరోగ్యంపై ఖర్చు ఉంటుంది. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీరు కొన్ని పనుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఆనందంగా ఉంటారు. స్నేహితులతో చర్చిస్తారు.
మిథునం
మీరు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటారు. మీ ప్రవర్తన వల్ల అందరూ ప్రభావితమవుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం అందుతుంది. మీరు అన్ని బాధ్యతలను నిర్వర్తించగలరు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధనం లాభం ఉంటుంది. ఈరోజు రిస్క్ తీసుకోకుండా ఉండండి.
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
కర్కాటకం
మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి పార్టీల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఈరోజు విజయం సాధిస్తారు. బంధువు నుండి మంచి సమాచారం పొందుతారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. అధికారులను కలిస్తే బాగుంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన మీపని పూర్తవుతుంది.
సింహం
ఎలాంటి కారణం లేకుండా వివాదంలో చిక్కుకుంటారు. ఈరోజు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. న్యాయపరమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో కొంత అసమ్మతి ఉండొచ్చు, అది మీ పనిని ప్రభావితం చేస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. మరింత బాధ్యత పెరుగుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
కన్య
ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. అనవసర మాటలు కట్టిపెట్టండి. ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈరోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారస్తులకు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఒత్తిడి దూరమవుతుంది.
Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
తుల
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాత మిత్రులను కలుస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఒకరి నుంచి అప్పు తీసుకోవాల్సి రావొచ్చు. ఆస్తి విషయంలో కుటుంబంలో వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆకస్మిక యాత్రకు వెళ్లవలసి రావచ్చు.
వృశ్చికం
మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని పాత విషయాల పరిష్కారమవుతాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. యోగా, వ్యాయామంపై శ్రద్ధ వహించండి. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులు పురోగతి సాధించగలరు.
ధనుస్సు
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు బంధువును కలవడానికి వెళతారు. అనవసరంగా ఖర్చు పెట్టకండి. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఒక వ్యక్తితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కుటుంబంలో ఏదైనా విషయంలో గొడవలు రావొచ్చు. వృద్ధుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి.
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
మకరం
రుణం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. గతంలో బంధువులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో సమయం గడపగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీరు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. ఈ రోజు మీరు పనిలో మీ జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
కుంభం
రుణం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. గతంలో బంధువులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో సమయం గడపగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీరు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. ఈ రోజు మీరు పనిలో మీ జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకోవచ్చు.
మీనం
మీరు ఏదో ఒక పనిలో ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంటి బాధ్యతలను నిర్వర్తించగలుగుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. మీకు మంచి సమాచారం అందుతుంది. మీరు చేపట్టే పనిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి.
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి