Horoscope Today 27 October 2021: ఈ రాశివారు స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి, రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే...
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషరాశి
సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ పనులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల సమయం. తెలివిగా వ్యవహరించండి. కుటుంబంలో కలతలు కొనసాగుతాయి. ఎవరి నుంచి అయినా వ్యతిరేకత రావచ్చు.
వృషభం
మీరు అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. వ్యాపార ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. అనవసర ప్రసంగాలు వద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.
మిథునం
ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపార సమస్యల వల్ల ఆందోళన పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. శత్రువులు చురుకుగా ఉంటారు. పాత వ్యాధి తిరిగి రావచ్చు.
Also Read: ఏడువారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి ... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!
కర్కాటకం
న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపార ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులకు కలిసొస్తుంది. షేర్ మార్కెట్లో లాభాలొస్తాయి.
సింహం
వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాన్ని తిరిగి పొందగలుగుతారు. కెరీర్ విజయవంతమవుతుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. పార్టీల్లో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వంకరగా మాట్లడే వారికి దూరంగా ఉండండి.
కన్య
ఈరోజు సాధారణంగా ఉంటుంది. పాత వ్యాధి తిరిగి రావచ్చు. దుర్వార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శుభసమయం. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి. తెలియని వ్యక్తిని నమ్మవద్దు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
తుల
కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యాపార ప్రయాణం కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులు సహాయం చేస్తారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. పెట్టుబడులు ఊహించని లాభాలనిస్తాయి. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తొందరపాటు వద్దు.
వృశ్చికం
ఇంటికి అతిథులు వస్తారు. శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. పెట్టుబడుల ద్వారా లాభం పొందుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు..జాగ్రత్తవహించండి.
ధనుస్సు
ఈరోజు మీరు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి ప్రభావితం కావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అనవసర మాటలు కట్టిపెట్టండి. ఎవరికీ సలహా ఇవ్వకండి. లావాదేవీల విషయంలో తొందరపడకండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆదాయం కొనసాగుతుంది. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి.
Also Read: పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
మకరం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరితోనైనా వాగ్వాదం ఉండొచ్చు. టెన్షన్ పెరుగుతుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. స్నేహితులను కలుస్తారు.
కుంభం
ఆస్తి పెరుగుతుంది. కోర్టు కేసులు కొనసాగుతాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ ఆందోళనలు అలాగే ఉంటాయి.ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి. పెట్టుబడి పెట్టే ఆలోచన విరమించుకోండి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ధన లాభం వచ్చే అవకాశం ఉంది.
మీనం
కొత్త ఉద్యోగం ప్రారంభించేందుకు తొందరపడకండి. అదృష్టం కలిసొస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వివాదాల్లో తలదూర్చకండి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుతాయి.
Also Read: అన్నీ రుణానుబంధాలే…తస్మాత్ జాగ్రత్త..జాగ్రత్త….
Also Read: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి